"ఆరోగ్యమే మాహాభాగ్యం" అని చిన్నప్పుడు చదువుకున్నాము. ఆరోగ్యం బాగుండాలి అంటే ఏదో ఒక వ్యాయామం చేయటం తప్పనిసరి. మనం చేసే ఉద్యోగం ఏంటి? సాఫ్ట్ వేర్, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా? మీ అందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా? రేపు పొద్దున నాకు పొట్ట రాదనీ ఎవరైనా గ్యారెంటి ఇవ్వగలరా?? అందుకే ఏదో ఒక వ్యాయామం తప్పని సరి అనిపించి షట్టిల్ (ఈకల బంతాట) ఆడటం మొదలు పెట్టాము.
షట్టిల్ ఆటనే ఎందుకు ఎంచుకున్నామంటే?? గత ఒలంపిక్స్ లో సైనాకి పతకం వస్తుందని తను ఆడిన ఆటలన్నీ క్రమం తప్పకుండా చూశాను. అనుకున్నట్టు గానే తను పతకం సాదించింది. దానితో ఆట మీద ఆశక్తి ఇంకా పెరిగింది. రోజు సాయంత్రం సైనా ఆడే "పుల్లెల గోపి చంద్ అకాడమీ"కి వెళ్లి ఆడటం మొదలు పెట్టాము.
అక్కడికి వెళ్లిన మొదటి రోజున ఏ అమ్మాయిని చూసినా సైనా లాగానే కనిపించింది. చివరికి ఒక అమ్మాయిని సైనా అని ఖాయం చేసుకున్నాం. తర్వాత రోజు ఉదయాన్నే ఈనాడులో, సైనా అదేదో దేశంలో ఆట గెలిచిందని చదివి నాలుక కరుచుకున్నాను. ఆ తరువాత ఒక వారానికి నిజంగానే సైనా ఆటను చూడగలిగాము. ఆమె సాధన చేస్తుంటే, కొద్దిగా దూరంలో మా ఆట మేము ఆడుకున్నాము. బహుశా మా ఆట చూసిందేమో, ఆ రోజు నుండి ఇంతవరకు ఒక్క పోటీ కుడా సాంతం గెలవలేదు.
అక్కడ ఏడెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గరనుండి చాలా మంది పిల్లలు సాధన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఇలాంటి పిజికల్ గేమ్స్ ఆడటం నేను చూడలేదు. పది సంవత్సరాల పిల్లలు కూడా ముఖం పుస్తకంలో "పొలం పల్లెటూరు" (farmville) , "పట్టణం పల్లెటూరు" (cityville) , "ముఠా యుధాలు" (mafia wars) ఇలాంటివే ఎక్కువ ఆడుతున్నారు.
ఈ షట్టిల్ చూడటానికి చాలా తేలికగా ఉన్నా ఆడటం చాలా కష్టం. ఏ క్రికెట్ ఆడితేనో, ఫుట్ బాల్ ఆడితేనో దెబ్బలు తగిలితే తల్లి బిడ్డ న్యాయం. షట్టిల్ ఆటలో కుడా దెబ్బలు తగులుతున్నాయి. ఆ దెబ్బలన్నీ ఆటలో అరటిపండు అనుకొని ముందుకు పోతున్నాను.
Good One Ram :)
ReplyDeleteధన్యవాదాలు నాగార్జున
Delete"మనం చేసే ఉద్యోగం ఏంటి? సాఫ్ట్ వేర్, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా? మీ అందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా? రేపు పొద్దున నాకు పొట్ట రాదనీ ఎవరైనా గ్యారెంటి ఇవ్వగలరా?? అందుకే ఏదో ఒక వ్యాయామం తప్పని సరి " బాగా చెప్పారు.
ReplyDeleteధన్యవాదాలు వెన్నెలగారు :P
Delete"మనం చేసే ఉద్యోగం ఏంటి? సాఫ్ట్ వేర్, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా? మీ అందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా? రేపు పొద్దున నాకు పొట్ట రాదనీ ఎవరైనా గ్యారెంటి ఇవ్వగలరా??"
ReplyDeleteidi general ga maa friends to nenu yekkuvaga antu untanu. tondi, tooch naadi idi ani nenu anatam ledu, nenu anede ayina mee vyaasam lo idi chusi naaku chala navvochindi.
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అలానే మనలాగే ఆలోచించే మనుషులు కూడా ఏడుగురి కన్నా ఎక్కువే ఉంటారు కాబోలు, గురుప్రసాద్ గారు :)
Delete