Wednesday, September 7, 2011

నేను మెచ్చిన నటుడు

రోజు ఎవరి గురించి అయినా, రెండు ముక్కలు మంచిగా వ్రాయాలి అని నిశ్చయించుకున్నాను. ఎవరిని పొగడాలి అనుకుంటుంటే నా దూరవాణి పరికరానికి ఒక సందేశం వచ్చింది. అందులో ఒక కధానాయకుడి మీద అతి నీచంగా రాసిన సందేశం. సందేశం పక్కకు పెట్టి విషయానికి వద్దాం.

కధానాయకుడు, మాట వినగానే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తీ అతను. తన నటనతో సింహం కడుపున సింహమే పుడుతుంది అని నిరూపించాడు.

నాకు అప్పుడు ఎనిమిదేళ్ళ వయసు అనుకుంటా., మా ఊర్లో ఉన్న భూతాల దీవిలో (సినిమా హాల్ని ముద్దుగా అలా పిలుచుకుంటాం) విడుదలయిన ఒక కొత్త చిత్రం, బాగుందంటేను వెళ్ళాను. కధానాయకుడు చేసిన కత్తి విన్యాసం, గుర్రపు స్వారీ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిత్రంలో ఒక పాటలో చాలా సంగీత గమకాలూ ఉన్నాయి, దానికి అనుగుణంగా తను చేసిన నటన నాకు ఇంకా బాగా నచ్చాయి. చిత్రం ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తు లేదు. చిత్రం పేరు "భైరవ ద్వీపం", పాట "శ్రీ తుంబుర నారద నాదామృతం", ఈపాటికి అర్ధం అయ్యి ఉంటుంది కధానాయకుడు మా బాలయ్య బాబు అని?

ఇంతకు ముందు చిరంజీవిని నమ్మకుంటే వేలు చితికింది (చిరంజీవి, చితికిన వేలు), బాలయ్య బాబు అంటే ఇంకేమి చితుకుతుందో ని మొదట్లో కాస్త బయపడ్డాను.

తర్వాత నుంచి బాలయ్యకి నేను అభిమానిని అయిపోయాను. కత్తి పట్టి జానపదం చేసినా, గద పట్టి పౌరాణికం తీసిన, పంచ కట్టి సాంఘిక చిత్రాలు చేసినా, తోడ కొట్టి రచ్చ రచ్చ చేసినా, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేసిన, చేయగలిగిన అతి కొద్ది మంది నటులలో బాలయ్య బాబు ఒకడు.


ఉదాహరణకు పైన చెప్పినట్టు కత్తి పట్టి భైరవ ద్వీపంలో చేసినా నటన నిజంగా అభినందనీయం. నాకు ఇంకా బాగా నచ్చిన మరో చిత్రం "ఆదిత్య 369". ఇందులో ఒక వైపు కుర్రాడిగా ఇంకోవైపు శ్రీ కృష్ణ దేవరాయునిగా అతను చేసిన ద్విపాత్రాభినయం నిజంగా అద్భుతం. నారి నారి నడుమ మురారి చిత్రంలో ఇద్దరి భామల మధ్యన ముద్దుల బాలయ్య చేసిన అల్లరి ఎవరు మర్చిపోతారు చెప్పండి. బొబ్బలి సింహం నుంచి నిన్నటి సింహ వరకు పేరుతొ వచ్చిన చిత్రాలన్నీ ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమకే ఊరట కలిగించాయనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పొతే నాకు నచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

చిత్రాల గురించి కాసేపు పక్కన పెడితే, ఒక మనిషిగా తను ఏంటి అని ఆలోచిస్తే, నాకు నచ్చిన మొదటి విషయం, అతను మాట్లాడే తెలుగు. కార్యక్రమంలో అయినా అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడు. ఎవరో చెప్పగా విన్నాను, చిత్ర పరిశ్రమలో ఎవరికీ సమస్య వచ్చినా, ఎంతో బాధ్యతగా, సమస్యని తీరుస్తాడు అని. ఇంకో విషయం, ఒకటి రెండు చిత్రాలు విజయవంతం అవ్వగానే, దర్శకుడికే సూచనలు ఇస్తున్న కధానాయకులు ఉన్న రోజులలో, అన్ని విజయాలు సాధించినా దర్శకుడి పనికి నాడు అడ్డు రాకుండా, దర్శకుడు చెప్పినట్టు చేస్తాడు, అని మా తోటి అభిమాన సోదరులు చెప్పగా విన్నాను.

ఒక కధానాయకుడిగా విజయం సాదించటం చాలా సాధారణమైన విషయం, కానీ, తండ్రికి తగ్గ తనయుడిగా(అంచనాలను అందుకుంటూ) మంచి మనిషిగా పేరు తెచ్చుకోవటం అనేది చాలా కష్టం అని నా అభిప్రాయం. మన కధానాయకుడి మీద అభిమానం ఉంటే ప్రదర్శించటం తప్పు లేదు కానీ, అవతల వాళ్ళని తిట్టటం మంచి పద్దతి కాదు. ఈ మధ్య మొహం పుస్తకంలో బాలయ్య మీద బుద్ది లేని రాతలు, చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పైశాచిక చేష్టలని మనం అస్సలు ప్రోత్సహించకూడదు.

నాలుగు చిత్రాలు అపజయం పొందినంత మాత్రాన కదానయకుడిని తిడితే ఎలా? సింహం రెండు రోజులు పస్తులున్నా సింహమే కానీ కుక్క అవ్వదు కదా? మా బాలయ్య బాబు ఎప్పటికీ సింహమే.

నందిని గెలిచి, ఇంకొద్ది రోజుల్లో మళ్లీ "శ్రీరామా రాజ్యం" చిత్రంతో మన ముందుకు రాబోతున్న బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలానే మరిన్ని చిత్రాలు తీసి అలరించాలని ఆశిస్తూ
ఒక అభిమాని.
(అతి ముఖ్య గమనిక: ఇదంతా చదివి ఫలానా వంశానికి నేను వీరాభిమానిని అనుకోకండి. ఫలానా వంశం కోసం నేను నా ప్రాణం ఇవ్వను. అలాంటి వాళ్ళకి నా ఓదార్పును తెలియజేస్తున్నాను.)

12 comments:

  1. చాలా బాగుంది అనంత్......ఈమధ్య ప్రతి జేఫ్ఫా గాడికి బాలయ్య ని కామెడీ చెయ్యడం అలవాటు అయ్యింది....నీ బ్లాగ్ వాళ్ళకి ఒక మేల్కొల్పు కావాలి .........

    ReplyDelete
  2. @ Rakesh Madala: అలాంటి వాళ్ళ కొసమే ఈ శీర్షిక రాశాను రా!

    ReplyDelete
  3. hai anantha ram,
    dis is surekha nee writings anni super i njoy a lot while reading them...........
    i am nt much familiar to u i think andukae scrap cheyaledu but writings r really superbbbbbbbbb keep writinggggg bye

    ReplyDelete
  4. @ surekha prudhvi: ధన్యవాదాలండి సురేఖగారు

    ReplyDelete
  5. meeru meschina nati gurinchi kuda rayandi....mee varnana choodalani mucchataga undhi:)

    ReplyDelete
  6. @ అఙాత : నాకు నచ్చిన కధానాయిక, ఫలానా అంటా ఎవరూ లేరూ, అందరు కధానాయికలను కలిపి ఇది వరకే "కధానాయికతో కమ్మని కబ్బుర్లు" అనే శిర్షిక రాశాను కదా!

    ReplyDelete
  7. eee blog balayya babu chadivithe kanneeru munneeru aipothademo mama...
    Highlight - Chirajeevi tho petkunte velu chithikindi, balayya tho petkunte inkemi chithukuthundooo... :D :D :D

    -Jayanth

    ReplyDelete
  8. బాగుంది ఇంత కాలం ఎక్క్కడిది, ఉద్యోగం చేస్తున్నావా కథలు వ్రాస్తున్నావా

    ReplyDelete
  9. good....u know i sent this url to all my fnds..keep rocking

    ReplyDelete
  10. @Suresh : ధన్యవాదాలండి

    ReplyDelete