Thursday, November 21, 2019

ఓ బట్టతలా బట్టతలా బట్టతలా...

"జీవితాలే శాశ్వతం కాదు, జుట్టెంత?" నాకు నేను ప్రతి రోజు చెప్పుకుంటున్న మాట. జుట్టు గురించి, ఒక English కవి తెలుగులో ఏమన్నాడో తెలుసా, "జీవితంలో జుట్టు ఒక భాగమే తప్ప, జుట్టే జీవితం కాదు" అని. ఇంకో కవి, "బట్టతల రావటం లేట్ అవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్క" అని అన్నాడు. 

నా బాధను చూసి అందరూ , "బట్టతల భాగ్యం" అని ఓదారుస్తున్నారు. భాగ్యం కనిపించటం లేదుకానీ, బట్టతల మాత్రం భేషుగ్గా కనిపిస్తున్నది. global warming కన్నా ఫాస్ట్ గా ఉంది.   జుట్టు దూరం అయ్యే  కొద్దీ వైరాగ్యం దగ్గర అవుతున్నది. అలాంటి బట్టతలని తలచుకుంటూ, నాకన్నా త్వరగా బట్టతల తెచ్చుకున్న నా మిత్రులకు సంఘీభావం తెలియజేస్తూ, ఈ పాటని అంకితం చేస్తున్నాను. 
"అదుర్స్" సినిమాలో "చంద్రకళా , చంద్రకళా ..." పాట స్టైల్ లో 

||పల్లవి|| 

  నా బోడి గుండు మెరుపుకొక్క ఓం నమః 
  నా బాల బట్ట నునుపు కొక్క ఓం నమః

  నా పట్టుకురుల చావు కొక్క ఓం నమః
  మళ్ళి రాని మాయలాడి కురులకు ఓం నమః 

  ఓ బట్టతలా బట్టతలా బట్టతలా... 
  నా తల కొరికే నీ కసికే  చాంగుభళా
  ఓ బట్టతలా బట్టతలా బట్టతలా...
  నిదురను నరికే నిగనిగకే చాంగుభళా
  మనసే మరిగే సలసల వయసే విరిగే ఫెళ ఫెళ
  ముఖమే ముదిరేలా మహ బాగుందే నా తల కట్టు కళ
  బట్టతలా One more time
  బట్టతలా That's the way we like it
  బట్టతలా బట్టతలా బట్టతలా...
  నా తల కొరికే నీ కసికే  చాంగుభళా


|| చరణం 1 ||  

  ఓ కురులకిక brylcreem తైలం, తప్పదిక తిలోదకం 
  Ya... that's the way I want it
  ఆరుటకు dryer ధూపం , వాటికిక నీరాజనం   
  Yeh... that's the way to do it
  రోజుకో oil పెడతా ,నీ మొదలే ముద్దాడేలా 
  దువ్వెనకు దండం పెడతా,అనునిత్యం నీకు దూరం జరిగేలా 
  ఓ బట్టతలా బట్టతలా బట్టతలా...
  

|| చరణం 2 || 

  ఓ పురుషులను పగబట్టేలా బోడిగా భయపెట్టకే 
  Ya... that's the way I was born
  వయసు మూడు పది దాటిందని, వగలతో వచ్చేయకే 
  yeh... that's the way
  నీకేసి చూస్తే ధన ధన దరువేయచ్చే తల తబలా
  శివమణి తకధిమి బీటై చంపేశావే , బోడి గుండులా  
  బట్టతలా బట్టతలా బట్టతలా...
  నా తల కొరికే నీ కసికే  చాంగుభళా

No comments:

Post a Comment