Friday, September 30, 2011

పైనోళ్ళ గోల

ఈ మధ్య చాలా మంది స్నేహితులు అడుగుతున్నారు., "ఏంటిరా.. నీ గోల? అస్సలు ఇలా రాయాలని ఎందుకు అనిపించింది?" అని. దానికి వివరంగా సమాధానం ఇద్దామని, ఈ శీర్షిక రాస్తున్నాను.

అది అప్రేల్ 2010 చదువు అయిపోయి రెండు సంవత్సరాలు గాలికి, దూలికి, అమీర్పేట రోడ్ల మీద తిరిగి... తిరిగి... చివరకి ఒకప్పటి లింగరాజు గారి ఇలాకలో చేరాను. మొదటి రోజు కార్యాలయముకి వెళ్ళిన నాకు, ఆ భవంతులు చూసి ఆశ్చర్యం కలిగింది. సరే ఇప్పుడా ముచ్చట ఎందుకు కాని అస్సలు విషయానికి వస్తా.

నాతో పాటు చేరిన వాళ్ళలో డెబ్బయి అయిదు శాతం మంది ఉత్తర భారత దేశం నుండి వచ్చిన వాళ్లే. ఒక్కడికి పొట్ట పొడిస్తే తెలుగు ముక్క రాదు. నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు. అక్కడ వాళ్ళందరూ हुई, है (హుయి, హై) అని అంటుంటే, నేను కుయ్, కై లాడకుండా కూర్చున్నాను. అంతలోపు నలుగురు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యి నన్ను రక్షించారనుకోండి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ఆ రోజు నుండి కార్యాలయంలో ఏ విషయం చర్చకు వచ్చినా హిందీలోనే మొదలెట్టే వాళ్ళు. "ఒరేయ్ బాబు నాకు హిందీ రాదు, కనీసం ఆంగ్లంలో ఏడవండిరా!!" అని అన్నా, నా మొర ఆలకించేవాడు లేకపోయ. పైగా, "హిందీ జాతీయ భాష, అది రాకుండా ఎలా బ్రతుకుతున్నారు ఇన్ని రోజులు?" అని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు. "నాకే కాదు మా ఊర్లో ఎవ్వరికీ హిందీ రాదురా బాబు" అంటే వినరే? అప్పుడు అనిపించింది, అదే లింగరాజు గారు ఆ పెట్టే కార్యలయమేదో అద్దంకిలో పెడితే, తిక్క కుదిరేది తింగరి పీనుగలకి, అని. హైదరాబాద్లో అందరికీ హిందీ వచ్చు కాబట్టి బతికిపోతున్నారు.

నార్తోళ్ళు, నార్తోళ్ళు అని తెలుగు వాళ్ళం తిట్టుకుంటుంటే వాళ్ళకి అర్ధం అయ్యేది. అందుకే వాళ్ళకి మేము పెట్టిన పేరు "పైనోళ్లు". అంటే దేశానికి పై భాగం నుంచి వచ్చిన వాళ్లని. ఏ మాటకామాట పైనుంచి వచ్చిన అమ్మాయిలు మాత్రం, సున్నం కొట్టిన గోడల్లాగా, కాల్గేట్ పేస్టులాగా, కాకి రెట్టలాగా, తెల్లగా, చాలా అందంగా ఉంటారు. అన్నింటికన్నా వాళ్ళు అందంగా మాట్లాడే మాట ఏంటో తెలుసా "భయ్యా" అని, ఆ పిలుపులో వైబ్రేషన్ ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పైనోళ్ళంతా చూడటానికి అంతర్జాతీయ మేదావులలాగా ఉంటారు. వాళ్ళు ప్రవర్తించే తీరు కుడా, కంప్యూటర్ కనిపెట్టింది మేమే అనట్లు ఉంటుంది. కానీ పొట్ట పొడిస్తే ఏ ఒక్కడికీ(ఒకరిద్దరు మినహా) హిందీ తప్ప, మిగితా అక్షరం ముక్క రాదు.

ఇక్కడ మీకు ఒక తమాషా సంఘటన చెప్పాలి. అప్పుడు క్రికెట్ ప్రపంచ పోటీలు జరుగుతున్నాయి. అదే సమయానికి మా కార్యాలయం వారి ఆర్దిక లావాదేవీలను కొన్నాళ్ళు నిలిపివేయాలని, న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నెల జీతాలు సమయానికి అందకపోవచ్చు అని చెప్పారు. మనోళ్ళు క్రికెట్లో ఇరగదీస్తున్నారని, మా కార్యాలయంలో పెద్ద పెద్ద తెరలు వేసి మరీ క్రికెట్ ఆటను చూపించారు. నాకు టి.వి. లేదు గనుక నేను కూడా వెళ్ళాను. అక్కడ పైనోళ్ళంతా "జీతేగా బయి జీతేగా, ఇండియా జీతేగా" అని పెద్దగా అరుస్తున్నారు. నెననుకున్ననూ.., "మాకు జీతాలు ఇవ్వండి, ఇండియా గెలుస్తుంది" అని అరుస్తున్నరేమో అని అనుకున్నా. తర్వాత ఎవడో స్నేహితుడిని అడిగితే వాడు నవ్వలేక, ఏడవలేక, దాని అర్ధం చెప్పాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

ఇలా ఆ పయినోళ్ళ దెబ్బకి హిందీ మాట్లాడలేక, ఆంగ్లంలో మాట్లాడి, మాట్లాడి, తెలుగు మర్చిపోతానేమో అని భయమేసింది. అందుకే ఇలా రాయడం మొదలెట్టా. పనిలో పని నా కసి కూడా తీర్చుకుంటున్నాను.

14 comments:

 1. నాకైతే పైనోళ్ళను చూస్తే జాలేస్తుంది, మనమనుకోండీ మనం ఫోనులో గర్లుఫ్రెండుతో తెలుగు మాట్లాడాలనుకోండి పక్కన తెలుగోడు లేడు అని మాత్రమే confirm చేసుకోని గంటలు గంటలు రెచ్చిపోవచ్చు. అదే వీళ్లకా అవకశంలేదుగా అందుకు. :)

  ReplyDelete
 2. Painunchi vachina ammailu sunnam kottina godalla, colgate paste la, KAAKI RETTALA chala andanga untaru... :D :D :D
  Bhayya ane pilupu lo vibration untundi... =))

  Malli kummesav poo...

  --Jayanth.

  ReplyDelete
 3. @ Indian Minerva: బాగా చెప్పారు, కాకపోతే, మనము అని నన్ను కలపకండి, నాకు కనీసం ఒక్క "girl friend" కూడా లేదు.

  ReplyDelete
 4. మహానుభావా... మనము అంటే అది జనరల్‌గా అన్నమాట. నేనూ నీబాపతే అంతేగానీ "పాంచాలుడు" లాగా నాకేమీ "పాంచ్ ఆలు"లు (ఐదు భార్యలు/గర్లు ఫ్రెండులు) లేరు.

  ReplyDelete
 5. @Indian Minerva: ఆ... ఉన్నా మాత్రం, మాకు చెప్తారా??? మీ ఫొనుకు అయ్యే ఖర్చు చూస్తే కానీ అర్ధం కాదు, అస్సలు సంగతి.

  ReplyDelete
 6. @గురూజీ : ఈ మధ్య దూర వాణి పరికరానికి ఖర్చు పెట్టే లెక్కని పట్టి కూడా చెప్పలేకుండా ఉన్నాము.. అందరూ మీ లాగ అదేదో "కార్పొరేట్ యుజర్ గ్రూప్" అని చెప్పి ఖర్చు లేకుండానే ఎవరికి తెలియనివ్వకుండానె ఆ విధంగా మిమ్మల్ని అనుసరిస్తూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు .....

  ReplyDelete
 7. Ram Anniyyaa.....Jitega bhai jitega india jeetegaa ni nuvvu artham chesukunna teeru chaduvutunte...asalu navvu control chesukolekapoya.....Very funy..keep it up...Excellent posts....

  ReplyDelete
 8. అధ్భుతమైన హాస్యం. చక్కటి పరిశీలన (?!). మీ బుర్రని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి.

  ఆకునూరి మురళీకృష్ణ.

  ReplyDelete
  Replies
  1. సాదారణంగా, తెలివి తక్కువ వాళ్ళని, "నీ బుర్ర మ్యూజియంలో పెట్టాలి" అంటుంటారు, మీరు ఆ ఉద్దేశ్యంతో అనలేదుకదా మురళీ కృష్ణగారు??

   Delete
 9. అయ్యో రామా !! మీకలా అర్థమైందా? క్షమించాలి. మీ వ్యాసాలు చదివి మనసారా నవ్వుకుంటున్నాను. ఇన్ని తెలివితేటలు మీకెలా వచ్చాయో అన్న ఆశ్చర్యంతో అలా అన్నాను.

  ఆకునూరి మురళీకృష్ణ

  ReplyDelete
  Replies
  1. అయ్యో కృష్ణా!!! ఈ మాత్రం దానికి క్షమాపణలు ఎందుకులేండి? తెలివితేటలు లేవు గనుకనే ఇలా రాస్తున్నాను, అవే ఉంటే ఈ పాటికి 24 గంటలు పనితోనే సరిపోయేది

   Delete
 10. నాకర్థమైనది ఏమిటంటే, నేనెన్ని చెప్పినా మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరదని ! బాగుంది. ఇలాగే కొనసాగండి. అన్నట్టు మీరు చెప్పిన జీవితసారం -2 చాలా బాగుంది.

  ఆకునూరి మురళీకృష్ణ

  ReplyDelete
  Replies
  1. హ హ హ... ధన్యవాదాలు మురళీ కృష్ణగారు

   Delete