మీ అందరికీ నా పేరు అద్దంకి అనంతరామయ్యగా తెలుసు. అసలా పేరు నాకు ఎలా వచ్చిందో ముందుగా మీకు చెప్పాలి. మా తాతగారు (కంగారు పడకండి వంశ వృక్షం బయటకు తీయటంలేదు) అద్దంకి రామారావు గారు. మా తాతమ్మ పేరు శ్రీ అద్దంకి అనంతలక్ష్మమ్మ గారు. కాబట్టి మా తాతమ్మ పేరులోని "అనంత" అనే మొదటి సగం, మా తాతగారి పేరులోని మొదటి సగం "రామయ్య" అని కలిపారు. దానితోటి మొత్తం "అద్దంకి అనంతరామయ్య". ఇక్కడే అస్సలు కధ మొదలు అయ్యింది.
పేరులోని మొత్తం అక్షరాలు కలిపితే, శాస్త్రానికి కావాల్సిన అన్ని అంకెలు రాలేదట. అందుకని చివర "పవన్" అని చేర్చారు. అప్పటికీ చాలక పొతే చివరికి "కిరణ్" అని కూడా చేర్చారు. దానితో నా పేరు కొండ వీటి చాంతాడంత అయ్యింది. మొత్తానికి నా పేరు "అద్దంకి అనంతరామయ్య పవన్ కిరణ్" దగ్గర ఆగింది. బడిలో వేసిన తర్వాత పేరు అంతా చెప్పటం ఎందుకని అనంతరామయ్య అని చెప్పాను. ఆంగ్లంలో ఆ పేరుని ఎలా రాయాలో అర్ధం గాక నా తోకని(పేరులోని) కత్తిరించి "అనంతరాం" తో సరిపెట్టారు.
ఇక్కడితో పేరు సమస్య తీరలేదు. ఉద్యోగంలో చేరిన తర్వాత కార్యాలయంలో పైనోళ్ళందరూ (ఉత్తర భారత దేశానికీ చెందినా స్నేహితులు) కలిసి "రామ్ అద్దంకి" గా మార్చేశారు. నా పేరు అనంతరాం అని చెప్పి చూశా, వాళ్ళకి నోరు తిరక్క అడ్డమైన పేర్లతో పిలవటం మొదలు పెట్టారు. వీటన్నిటికన్నా "రామ్ అద్దంకి" అన్న పేరే నయంఅనుకోని, ఆ విదంగా ముందుకు పోతున్నాను. జీవితం..., ముందుగా తోక "అయ్య" పోయింది. తరువాత తల "అనంత" పోయింది. ప్రస్తుతానికి "రామ్ అద్దంకి" మాత్రం మిగిల్చారు.

ఇక ముద్దు పేర్ల విషయానికి వస్తే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు మొదట పెట్టిన ముద్దు పేరు "జండు బామ్". చిన్నప్పుడు నా బుగ్గలు జండు బామ్ రాసి వాచినట్టు ఉంటాయని(ఇప్పుడు అలా లేవులేండి) మా హిందీ పంతులమ్మ పెట్టిన పేరు. తర్వాత తోటి స్నేహితులు పెట్టిన పేరు "పప్పు" అని. నేను మాంసం తినను(ఇప్పటికీ), కేవలం పప్పు తింటానని ఆ పేరు పెట్టారు. ఇంకా కొంత మంది "రాముడు" అని, మా రాధక్క"రామీ" అని, మీ లాంటి భక్తులంతా "రామానంద స్వామి" అని, హరీష్ లాంటి శిష్యులంతా "గురూజీ" అని, చూడబోతే చివరకి నాకు కూడా సహస్ర నామాలు అయ్యేట్టు ఉన్నాయి. కొంత మంది ఎదవల దయ వల్ల, మీకు చెప్పుకోలేని పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.
పేరులో ఏముంది అనుకున్నాను కాని, చూడండి నా ఒక్కడి పేరుకి ఎంత చరిత్ర ఉందో !!!
పేరులో ఏముంది అనుకున్నాను కాని, చూడండి నా ఒక్కడి పేరుకి ఎంత చరిత్ర ఉందో !!!
మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, నాకు తెలిసి, ముందు ఇంటి పేరు తరవాత మన పేరు ఉంటుంది. ఉదాహరణకు "టంగుటూరి ప్రకాశంగారు, అల్లూరి సీతారామరాజు గారు, పొట్టి శ్రీరాములుగారు, నందమూరి తారక రామారావు గారు, అద్దంకి అనంతరామయ్య గారు", ఇలా గొప్ప గొప్ప వారి పేర్లకు ముందు ఇంటి పేర్లు ఉంటాయి తప్ప, "రాజగోపాల్ లగడపాటి గారు, జనార్ధనరెడ్డి నాగం గారు, పెద్ద పిచ్చయ్య బచ్చు గారు" అంటామా?? అంతెందుకు "జీవితా రాజశేఖర్" అంటాము తప్ప "రాజశేఖర్ జీవిత" అనము కదా (:P). ఎక్కడ కూడా మన పేరులో తండ్రుల పేర్లు చేర్చము. కాని ఈ మధ్య ముఖం పుస్తకంలో, కొంత మందికి ఇంటి పేరు లేదా తండ్రుల పేర్లు, అమ్మాయిలు కొంత మంది, తమ భర్తల పేరు, తమ పేరు చివరన చేర్చుకోవటం వెర్రి అయిపొయింది. తల్లి తండ్రుల మీద, తమ తమ భర్తల మీద ప్రేమతో పెట్టుకోవచ్చు అని అనకండి. పేర్లలో చెర్చుకుంటేనే ప్రేమ ఉనట్టా? అది మన సాంప్రదాయం కాదు. దయ చేసి ఇక నయినా మీ పేర్లకు ముందు ఇంటి పేర్లు చేర్చమని మనవి. కాదు కూడదు అంటారా? మీకు ఓదార్పు యాత్ర చేయటం మాత్రం ఖాయం!!
మరి ఏంటి అన్నయ్యా బ్లాగ్ 'ramaddanki' అని పెట్టావు
ReplyDelete@అఞా త: నా పేరు కావాలని ప్రయత్నించాను. కాని ఇది వరకే ఎవరో ఆ పేరుని వాడుతున్నారట! చెసేది లేక ఈ పేరు పెట్ట వలసి వచ్చింది.
ReplyDelete