Saturday, October 29, 2011

కళాబంధు మా శ్రీరామ చందు


ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒక రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. రోజు ఎనిమిది గంటలకు ఈటివిలో చందు పాట పాడుతున్నాడు అనేది సారంశం. తను పాటలు పాడతాడు అని తెలుసు, కానీ టివిలో పాడేంతగా అని అనుకోలేదు.

పూర్వాశ్రమంలో నేను మా బడిలో పాటలు పాడేవాడిని(కంగారు పడకండి, ఇప్పుడు పాడటంలేదు). అబ్బో రోజులే వేరు. నేను పాడుతుంటే చపట్లు కొట్టాలా? లేక నన్ను కొట్టాలా?? అని ఆలోచించే లోపు నేను వేదిక దిగిపోయేవాడిని. ఇప్పుడా ముచ్చటంతా ఎందుకులే కానీ, విషయానికి వద్దాం. ఎక్కడున్నాం? ....... ఎనిమిది గంటలకు టివిలో అనే సరికి అందరం టివిలకి అతుక్కు పోయాము. మనోడు రోజు పాట ఇరగదీశాడు. నా అంత బాగా కాక పోయినా, నేను అనుకున్న దానికన్నా చాలా బాగా పాడాడు. ఒక్కింత బాధ (నేను స్థాయికి వెళ్ళలేక పోయానే అని), ఒక్కింత ఆశ్చర్యం, ఆనందం (మనోడు చాలా బాగా పాడాడు అని).

క్షణం అనిపించింది నేను సంగీతం నేర్చుకుంటే బాగుండేది అని. సహజమే., సచిన్ ని చూసి క్రికెటర్, జే.పి.ని చూసి కలెక్టర్, బాలకృష్ణని చూసి కదానాయకుడిని అవ్వాలనుకున్నా. పాటలు నేర్చుకోవటం మొదలు పెట్టా. పాటకు తగ్గట్టు చేతులు ఊపటం వచ్చింది కానీ, పాడటం మాత్రం రాలేదు.

ప్రతి వారం ఎనిమిదింటికల్లా టివి ముందు వాలి పోయేవాడిని. ఒక్కో వారం ఒక్కో పాటతో దూసుకుపోయాడు. ప్రతి పాటకి తనని తానూ మెరుగు పరుచుకుంటూ ముందుకు పోయాడు. రక రకాల పాటలని తనదైన శైలిలో అధ్బుతంగా పాడాడు.

క్రమంలో ఎన్నో మధురమైన పాటలు పాడాడు. నవరసాల్ని పండించాడు. ముఖ్యంగా అలనాటి ఆణిముత్యం, ఘంటసాల గారి "రసిక రాజ తగు వారము కామా?" అనే పాట పాడుతున్నంత సేపు ఊపిరి బిగబట్టి విన్నాను. క్షణంలో అనుకున్నా నేనింక తన స్నేహితుడిని కాను, కేవలం అతని లక్షలాది అభిమానుల్లో ఒకడిని అని. రోజే నాకు అనిపించింది., ఏదో ఒక రోజు సంగీత సామ్రాజ్యంలో తను ఉన్నత స్థానానికి వెళతాడు అని. నా లాంటి లక్షలాది అభిమానులని సంపాదిస్తాడు అని.

అలా ఎన్నో కార్యక్రమాలలో విజేతగా నిలిచి, సినీ నేపధ్య గానాన్ని మొదలు పెట్టాడు. "అష్ట చెమ్మ" లాంటి చిత్రాలలో పాడి మంచి పేరు సంపాదించాడు. మణి శర్మ, కీరవాణి గారి లాంటి గొప్ప సంగీత దర్శకుల దగ్గర పని చేశాడు. అయినా, ఇంకా ఏదో సాదించాలన్న తపన, ఇంకా నేర్చుకోవాలి అన్న కసి, మిగితా గాయకుల నుంచి అతనిని వేరు చేసింది. క్రమంలోనే ఉత్తర భారతంలో అడుగు పెట్టి, "ఇండియన్ ఐడల్ - 5" కార్యక్రమానికి వెళ్లి, అక్కడ విజేతగా ఆవిర్భవించాడు. దక్షిణ భారత దేశం నుండి కార్యక్రమంలో గెలిచిన మొట్ట మొదటి గాయకుడు అయ్యాడు.

తెలుగు వాడి సత్తా ప్రపంచానికి మరోసారి చాటాడు అనటం మాత్రం అతిశయోక్తి కాదు. "క్వాజ మేరె క్వాజ " అనే పాటకు పాకిస్తాన్లో సైతం అభిమానులను సంపాదించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు, తను సాదించింది ఏంటో? తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మానం అందుకున్నాడు. కళాబంధు బిరుదాంకితుడయ్యాడు. ప్రపంచం నలుమూలల తన గానామృతాన్ని వినిపించాడు. "హాలివుడ్" కి సైతం తన స్వరాన్ని పరిచయం చేశాడు. "కామన్ వెల్త్ క్రీడల" ముగింపు వేడుకల్లో అందరినీ అలరించాడు.

మనిషి ఉన్నతమైన వాడు అని చెప్పాలంటే అతను సాదించిన దానికన్నా, అతని ప్రవర్తన చూచి చెప్పాలి. ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించినా., ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నా, మనిషి మాత్రం మారలేదు. అదే చిరున్నవ్వు, అదే ఆప్యాయత, అదే చికాకు (:P). మంచి గాయకుడిగానే కాదు అంతకు మించి మంచి స్నేహితుడిగా నేను తనని గుర్తిస్తా.

( అనంతరామ్, శ్రీరామ్)
ఇలానే తను ఇంకెన్నో సాదించాలని, తన గానామృతంతో అందరినీ అలరించాలని కోరుకుంటూ.., పనిలో పనిగా ఒక చిన్న కవితని మనోడికి అంకితం ఇస్తున్నాను, కంగారు పడకుండా కానివ్వండి.
------------------------------------------------------------------------------------------------------------
తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటిన మిత్రమా! శ్రీరామ చంద్రమా!

ప్రతి హృదయమనే "నోట్ బుక్"ని నీ పాటలనే అక్షరాలతో "బోణి" చేశావు. నీ "కత్తి"లాంటి గొంతు తో అందరిని "తీన్ మార్" ఆడిస్తున్నావు. "ఆపిల్" పండు లాంటి అమ్మాయిలంతా, నీ గానామృతంలో మునిగి "వస్తాడు నా రాజు" అని, "అష్టాచెమ్మ" ఆడుతూ నిరీక్షిస్తున్నారు. నువ్విప్పుడు కేవలం మా చందువి కాదు, "అందరి బంధువి". ఇలా నీ "ప్రయాణం" ఆసాంతం హాయిగా సాగాలని, నీ పాటల "జల్లు" "కోతిమూక" మీద ఎల్లప్పుడూ కురవాలని, "బద్రీనాధుని" ఆశీస్సులు నీకు సదా ఉండాలని, ఆకాంక్షిస్తూ.......
నీ మిత్రుడు ,
అద్దంకి అనంతరామయ్య
------------------------------------------------------------------------------------------------------------
(గమనిక : ఎరుపు రంగులలో ఉన్నవి శ్రీరామచంద్ర పాడిన పాటలు గల చిత్రాలు.)

17 comments:

 1. Nice one Ram.. Nenu kuda anukuntunna., ipudu nannu navvistunnatte., nuvvu kuda edo oka roju Prapancham lo andarni navvistavani, navvinchalanii ashistuu.... :)

  Btw., pick of the post - 'chethulu oopadam ochindi kaadu paata paadam raledu..' :D

  --Jayanth

  ReplyDelete
 2. Talent Andariloo vunthundhiii... Ne talent Clearly evident above Anantha Ram...

  ReplyDelete
 3. @vkrish: ఎదో మీ అభిమానం!!!! :D

  ReplyDelete
 4. good one Ram garu!

  you got a really talented and celebrity friend!
  he is indeed one great singer.
  happy for you about that.

  your post is nice.
  happy for us about that :-)

  ReplyDelete
 5. Hay Ram...nuvvu rasina paata sriram paadalani maa abhilasha...Nuvvu kuda oka rachayita gaa prapancha vyaptamga abhimanulni sampadinchalani naa korika...Jayam kalugugaka...

  ReplyDelete
 6. @శివ అన్న: నేను రాసిన పాటలు శ్రీరాం చేత ఇది వరకే పాడించాను, ఇక మీ లాంటి పెద్దవాళ్ళ అశీస్సులతో తప్పకుండ జయం కలుగుతుందని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 7. Chala bagundi.. Chivari kavitha naaku chala nachindi.

  ReplyDelete
 8. @ chinz world : dhanyavaadalu :D

  ReplyDelete
 9. శ్రీరాం గొప్పగాయకుడేకాడు వ్యక్తి కూడా అని మీ పోస్ట్ చదవకముందే తెలుసుకున్నాను; ఆయన బాడి లాంగువేజ్తో :-)

  ReplyDelete
 10. పూర్వాశ్రమంలో నేను మా బడిలో పాటలు పాడేవాడిని(కంగారు పడకండి, ఇప్పుడు పాడటంలేదు). అబ్బో ఆ రోజులే వేరు. నేను పాడుతుంటే చపట్లు కొట్టాలా? లేక నన్ను కొట్టాలా?? అని ఆలోచించే లోపు నేను వేదిక దిగిపోయేవాడిని.

  and

  పాటకు తగ్గట్టు చేతులు ఊపటం వచ్చింది కానీ, పాడటం మాత్రం రాలేదు

  both are too funny ra Anantharam :)

  ReplyDelete
  Replies
  1. @రాఘవేంద్ర : ధన్యవాదాలు సొదరా

   Delete
 11. అభినందనలు ఆనంతరాం గారూ. మొదటిసారి ఇవాళ మీ బ్లాగు చూసాను. చాలా విభిన్నంగా వుంది అభినందనలు. మీ వ్యాసాలు, బాలు గారి హాయి హాయి పాటని ఆనందించాను. (మొదటి సారి ఈ పాట విన్నాను. ఏ సినిమాలొనిది అని ఆడిగితే కొడతారేమో? వద్దులెండి)

  శుభాకాంక్షలతో,

  ఆకునూరి మురళీకృష్ణ

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మురళీ కృష్ణ గారు., ఆ పాట తారక రాముడు సినిమాలోనిది

   Delete