Tuesday, November 12, 2019

మేలుకో తెలుగోడా

వారం, పది రోజుల వ్యవధిలో రెండు పాటలు విడుదల అయ్యాయి. రెండిటినీ మన సీతారాముడే రాశాడు. రెండిటినీ థమన్ స్వరపరిచాడు.

మొదటిది : సామాజ వరగమన

పాట పాడేప్పుడు , భాష మీద అవగాహన లేకుండా, అస్తవ్యస్తంగా పాడటం ఎంతవరకు సమంజసం? వివేకంతో మ్యూజిక్ చేయండి. చేసింది సరిగ్గా పాడించండి.

"నీ కాల్లని పట్టుకు వదలనన్నది చూడే నా కల్లు"

పాడుకోండి ఇక చాలు.

ఇక్కడ పాట అంత అద్భుతంగా రాశారు, ఎవరండీ ఇది పాడింది? ఏమి చేస్తారండీ వీళ్ళు? 'ళ' కి 'ళ'  ఒత్తు పెడితే 'ళ్ళ' అని పలకాలి కానీ 'ల్ల' పలికితే ఎలా?

ఎందుకు పుడతారో తెలియదండీ మనుషులు కొంతమంది. Basic sense ఉండదు మనుషుల దగ్గర

ఓకే చరణానికి వెళదాం. పల్లవి అయిపోయిందండి. వినటం నా వల్ల కాదు, చరణంలోకి వెళదాం.

వినే  మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.  కాళ్ళకు, కళ్ళకు, కల్లుకు తేడా ఉంటుంది కదండీ? ల కు, ళ  కు తేడా తెలియదా?  శాస్త్రి గారు రాసేప్పుడు అన్నీ కరెక్టుగా రాస్తారు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ హర్ట్ అయిపోతారు. సరిగ్గా పాడటం మాత్రం చేత కాదు. 

తగలపెట్టండి సార్, థమన్ గారు  

నా గాలే తగిలినా , నా నీడే తరిమినా, ఉలకవా పలకవా వామా

సారీ, పలకవా భామా అయితే పలకవా వామా అని ఇష్టం వచ్చిన భాషలో పాడాడు. 

నేను కోపదారి మనిషినని తెలుసు. చూడండి అక్కడేమి రాసుందో. మీరు పాడించి ప్రయోజనం ఏముంది సార్. భామా అనుంది అక్కడ. శాస్త్రిగారు రాసింది ఒకటైతే , అక్కడ ఒక్కటుంది. 

ఏమిలా, ప్రపంచంలో ప్రతివాడు అవతలి వాడి  భాషను కరెక్ట్ చేయచ్చు అనుకుంటాడు. వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ముందు అక్కడ ఏమి పాడాడో వినండి. 

మూడు ఖరాబు అవుతుంది.  దాని రిఫ్లెక్షన్ మొత్తం నా పనిలో రిఫ్లెక్ట్ అవుతుంది. 

"ఎంతో బతిమాలినా, ఇంతేనా .... "

నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ పాట వింటే ఏంటి , వినకపోతే ఏంటి ? ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి .... 

అర్ధం కాని వాళ్ళు , ఈ వీడియో చూసి , మళ్ళీ చదవండి. అర్ధం అవుతుంది అని ఆశిస్తున్నాను. 

అన్నంలో ఆవకాయ కలిపి తింటుంటే, పంటి కిందకు రాయి వచ్చినట్టు ఉంది ఆ పాట. తప్పు బియ్యం ఏరిన వాడిదా? వండిన వాడిదా? వడ్డించిన వాడిదా? అనేది వాళ్ళకే తెలియాలి. 


పైన చెప్పిన ఆవకాయలో, కమ్మని నెయ్యి వేసుకొని తిన్నంత కమ్మగా ఉంది. మహానుభావుడు అలా పాడాడు. అలా రాశాడు.  భాషంటూ లేని భావాలేవో అంటూనే, భాషలోని భావాన్ని అందంగా పలికించాడు. 

సరిగ్గా నేను పుట్టిన ఏడాది, వీళ్ళిద్దరూ కలిసి పాడటం ప్రారంభించారు. 33+ సంవత్సరాల తర్వాత కూడా, పాట రాయటంలో,పాడటంలో తియ్యదనం పెరిగిందే తప్ప తగ్గలేదు. 

"చిరునామా లేని లేఖంటి నా గానం, చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈ నాటికి " 

అనగానే , శాస్త్రిగారు వాన సినిమాలో రాసిన "నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ, నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ" అన్న పంక్తులు గుర్తుకు వచ్చాయి.
  
"మందహాసాలు చిలికే పరాగాలతో" అన్నప్పుడు లీలగా చేసిన దరహాసం,
"రెప్పల్లో వాలే మొహాల భారంతో " అన్నప్పుడు వినిపించే భారం, 
"హాయిగా అలసిపోతున్న ఆహాలతో " అన్నప్పుడు హాయిగా, ఆహా అనిపించటం బాలుడికే చెల్లింది. 

ఇక శాస్త్రి గారి గురించి చెప్పేదేముంది, ముప్పైల్లోనే అరవై ఏళ్ళ  అంత అనుభంతో రాసిన మనిషికి, అరవైలో ముప్ఫైగా రాయటం పెద్ద లెక్కా? 

As it is థమన్  ఈ పాటను స్ఫూర్తిగా తీసుకున్నాడో లేదో తెలియదు కానీ, ఒక మంచి పాటను అందించాడు. బాబు థమన్, నిన్ను మేము ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటున్నాము. నువ్వు అక్కడికి రావు. ఇకనైనా ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకు. నీకు బ్రేక్ ఇవ్వటానికి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. All the best! 

No comments:

Post a Comment