మొత్తానికి ఎంటెక్ చదువు'కొనటం' పూర్తి అయ్యింది. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. "వేలకు వేలు పోశాము, మంచి మార్కులు రాకపోయినా పరవాలేదు, కనీసం పరీక్షలలో తప్పకుండా, పూర్తి చేసి పుణ్యం కట్టుకోరా" అని మా నాన్న తెగ మెచ్చుకొనేవారు. చివరికి మా నాన్న కళ్లలో ఆనందం కోసం అయినా పూర్తి చేయాలని, కంకణం కట్టుకోకుండానే పూర్తి చేశా. నా స్నేహితులు చాలా మంది అడిగారు, "ఎందుకు పనికొస్తుందిరా నీ ఎంటెక్?" అని. చుట్టపక్కాలు కొంతమంది "ఆఫీసులో జీతం ఏమైనా పెంచుతారా??" అని అడిగారు.
"రేపు పెళ్ళికి శుభలేఖలో వేయించుకోవచ్చు" అని కొంతమంది, "ఇప్పుడలా వేయించటంలేదు. అదంతా పాత కాలపు పద్దతి" అని ఇంకొంత మంది, ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖండించారు. ప్రస్తుతానికి ఆ విషయం అలా ప్రక్కన పెడదాం. మొన్ననే 'బిజినెస్ మాన్' అనే తెలుగు చిత్రం చూశాను, అరడజను బూతులు, డజను హత్యలు ఉన్నపటికినీ చిత్రం మొత్తం మీద బాగుంది. మహేష్ బాబు చాలా బాగా చేశాడు. అయినా మహేష్ బాబు అందగాడు, మహా అందగాడు, రాజకుమారుడు అంటారు., మీసాలు తీసేసి, రెండు చొక్కాలు వేసుకొని, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నేను కుడా ఎత్తు అడుగు తక్కువైనా, అంతకన్నాఅందంగానే ఉంటాను. పోనీలే మహేష్ బాబు దారికి అడ్డం రావటం ఎందుకులే అని, నేనే చిత్రాలలోకి రాలేదు.
విషయానికి వస్తే, చిత్రాలలో ఈ మధ్య హింస మరీ ఎక్కువ అయ్యింది. ఒక్కో చిత్రంలో కధానాయకుడు సగటున వంద నుంచి నూటయాభై మందిని చంపితే కాని చిత్రానికి 'శుభం' ముక్క పడటంలేదు (ఇప్పుడు వస్తున్న చిత్రాల చివర శుభం ముక్కలు చూపించటం కుడా ఆపి వేసినట్టున్నారు). కధానాయకుడు ఎంత కౄరంగా ప్రతి నాయకుడిని చంపితే, చిత్రం అంత బాగా ఆడుతుంది.
కొన్ని చిత్రాలలో కౄరమైన ప్రతి నాయకులను చూస్తే, నాకు మా కార్యాలయంలో, నా పై అధికారులు గుర్తొస్తారు. ఈ ప్రతినాయకులు ఉత్తి పుణ్యానికి తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న వారిని సైతం చంపేస్తుంటారు. మా పై అధికారులు కుడా అంతే ఉత్తి పుణ్యానికి నన్ను తిడుతూ ఉంటారు, వీళ్ళను కూడా చిత్రాలలోకి పంపిస్తే బాగా రాణిస్తారు, మేము కుడా ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాము. ఈ రకంగా చిత్రాలలో చూపించే హింస, చూసే ప్రజల మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుందని నా అభిప్రాయం.
ఉదాహరణకు, మా అన్నయగారి అబ్బాయి, మా అన్న దగ్గరికి వచ్చి, "నాన్న, నాకు ఒక తాడు, ఒక రైలు, రైలు పట్టాలు, ఒక పెద్ద బిల్డింగ్ కొనివ్వవా??", అని కసిగా అడిగాడు. నాలుగు, ఐదు సంవత్సరాలు ఉంటాయేమో బుడ్డోడికి, ఇవ్వన్ని ఎందుకురా? అని అడిగితే మహేష్ బాబు ఆట ఆడుకోవటానికి అని చెప్పాడు. వివరాలలోకి వెళ్తే, మావాడు 'అతడు' చిత్రాన్ని అరడజను సార్లు చూశాడు. మీకు గుర్తుంటే, అందులో మహేష్ బాబు ఒక ఎత్తైన మేడ మీద నుండి, తాడు సహాయంతో, వేగంగా కదిలే రైలు మీదకి దూకుతాడు. ఇప్పుడు అడిగినవన్నీ కొనిస్తే., మనోడు కుడా మహేష్ బాబు లాగా ఆ విన్యాసాన్ని చెయ్యాలని ఉవ్విల్లూరుతున్నాడు.
ఇంకోరోజు తుపాకి కొనివ్వమని గొడవచేస్తుంటే, ఒక చిన్న తుపాకి కొనిచ్చారు. కాసేపటికే కోపంగా వచ్చి, "నాన్న ఈ తుపాకితో కాలుస్తుంటే, ఎవ్వరికీ రక్తం కారటంలేదు. రక్తం కారే తుపాకి కొనివ్వవా?" అని గోల చేశాడు. ఇదంతా కేవలం చిత్రాల ప్రభావం కాక ఇంకేమిటి? మొన్న "భక్తి" ఛానల్ చూస్తుంటే అందులో ఒక బాబాగారు, "మనిషి సాటి మనిషి ప్రేమించాలి" అని చెప్పారు. ఆ విదంగా, హాయిగా, చిత్రాలలో కధానాయకుడు కుడా ప్రతినాయకులను (విలన్లను) ప్రేమిస్తే ఎంత బాగుంటుంది?? ఈ "'చిత్ర' హింస" ఎప్పటికి తగ్గుతుందో ఏంటో??
WAAMMO NEEKORIKALU CHOOSTE NAVVESTUNDI.. ;-)
ReplyDeleteకోరికలే తప్ప, అవి జరగవు కదా
Delete"repu pelliki subhaleka lo veyinchochu"...."Ippudala cheyatam ledu. adantha patha kalam paddathi" !! :D
ReplyDeleteEvaraa maata annadi., maa guru garu, pujyulu, vishwa vikhyatha 'rasa samrat' K. Raghavendra rao "B.A" gaaru inka bathike unnaru., vaari paddathi kuda inka bathike undi., vaari apples, oranges, potatoes bathikunnatha kalam idi bathike untundi...
M.Tech chesaka neeku baaga chadastam ekkuvaindi mama, lekapothe businessman bavundatam enti? (free ticket aaa)
"Railu, RAILU PATTALU, building" konivvavaa.. :D :D
--Jayanth
జయంత్ అన్నా, నీ వాలకం చూస్తుంటే, రాఘవేంద్రరావును మించి పోయి, పనస పండ్లు, గుమ్మడి కాయలు వేయించేట్టు ఉన్నావు.నీకు ఆ చిత్రం నచ్చలేదా? కౄరత్వం చాలలేదా?
Delete"Janda paathenge" thappa inkemi nachale!
Deleteఇక్కడ నేనే కాదు, ఇంకా చాలా మంది బాగుంది అన్నారు. ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు
DeleteArtham kaaledemo! ;)
Deleteఅది మాత్రం నిజం, నాకు కుడా సరిగ్గా అర్దం కాలేదు
DeleteEra rendu chokkalu vesi,meesam teeste mahesh babu kante baaguntava. mahesh babu ela untadra milk boy la untadu, nuvvi milk iche gedhala untav. aapara nee sollu
Deleteనీకు కుళ్ళురా నేనంటే
Deleteబాగుంది
ReplyDeleteidigo ananth blog color koncham light color lo ki marchava ??? office lo open chestunte neeli chitrala site anukuntunnaru....
Deleteహ హ హ, ఇదిగో ఇప్పుడే మారుస్తున్నాను, ఈ విషయాన్ని తెలియజేసినందుకు దన్యవాదాలు
Deletemeshaaru.... meeru PM layyaaka mee juniors alaa anukokundaa chuskukte pedda achievement ae... got it
ReplyDeleteఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నన్ను ర్యాగింగ్ చేశారు. కాని నేను రెండవ సంవత్సరంలో ఎవరినీ ర్యాగింగ్ చేయలెదు, తెలుసా!!!
Deleteకధానాయకుడు కుడా ప్రతినాయకులను (విలన్లను) ప్రేమిస్తే కధానాయికతో పాటు ప్రేక్షకులు కూడా డిసప్పోయింట్ అవుతారు ;) నాకు మీ అన్నయ్యగారి అబ్బాయి ఎంత నచ్చేసాడో!
ReplyDeleteఎదో మాట వరసకు అన్నాను తప్పించి, నిజంగా అలా జరుగుతుందా నా పిచ్చి కాకపోతె., మా అన్నయగారి అబ్బాయికి మీ ముద్దులు తప్పక తెలియజేస్తాను. మరి మీరు వాడికి ఏమి కొనిస్తారు? కత్తి, గొడ్డలి లాంటివి కొనివ్వాల్సి ఉంటుంది.
Deleteతప్పకుండాను! కత్తి, గొడ్డలేనా? గునపం, సుత్తి, గడ్డ పార, అన్నిటితో పాటు మిమ్మల్ని కూడా అదే గదిలో పెడతాను;) పాపం చంటోడు (అదే మీ అన్నయ్య గారి అబ్బాయి) వాటిని వాడాలి కదా ;)
Deleteఈ రకంగా, నా శీర్షికల నుండి తప్పించుకోవలనుకుంటున్నారా? ఆ పప్పులేమి ఉడకవు
Delete