ఈ శీర్షిక కొన్ని వేల రూపాయలు ఖరీదు చేస్తుంది. కాని నేను మంచోడిని కాబట్టి, చచ్చే చవకగా, ఉచితంగా అందిస్తున్నాను. షరతులు వర్తించవు. కావాలంటే చూసుకోండి, పైన ఎక్కడా కూడా చుక్క పెట్టలేదు. ఇంతకూ ఏమిటా వేలకి వేలు ఖరీదు చేసే అంశం అనుకుంటున్నారా?? ఆ విషయం చెప్పే ముందు, మనం తీసుకుందాం చిన్న బ్రేక్.
బ్రేక్ తర్వాత మళ్లీ స్వాగతం. చాలా మంది ఆంగ్లం సరిగ్గా మాట్లాడాలి అని వేలకు వేలకు పోసి నేర్చుకుంటారు. వేలతో పాటు కొన్ని నెలల కాలాన్ని వృధా చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ శీర్షికని ఉచితంగా అంకితం ఇస్తున్నా. కేవలం పది నిముషాలలో పైసా ఖర్చు లేకుండా ఆంగ్లం నేర్చుకోండి. ఇవాల్టికి ముందుగా కొన్ని ముఖ్యమైన పదాలు నేర్పుతాను. వాటితో మీరు ఆంగ్లంలో అందంగా మాట్లాడచ్చు.
నేను ఇది వరకే చెప్పినట్టు, ఔచ్, ఊప్స్, లాంటి చిన్న చిన్న పదాలైతే, పోకిరిలో మహేష్ బుల్లెట్లు వాడినట్టు మీరుకూడా ఎవరికీ లెక్క చెప్పకుండా విచ్చల విడిగా వాడుకోవచ్చు. ఇలాంటి పదాలు ఒక పది పదిహేను నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే.
మొదటగా 'U know'. ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ విషయం గురించి మీకు తెలియక పోయినా మాట్లాడాలి అంటే ఈ పదం బాగా ఉపయోగ పడుతుంది. ప్రతి పది మాటలకి ఒకసారి 'U know' అని వేసుకోవచ్చు. మీకు ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే, క్రికెట్ అయిపోయిన తర్వాత, బహుమతి ప్రధాన కార్యక్రమంలో మన ఆటగాళ్ళు మాట్లాడేది వింటే మీకే అర్ధం అవుతుంది, ఈ పదం ఎంత బాగా ఉపయోగించచ్చో అని. నాతో మాట్లాడేప్పుడు చాలా మంది 'U know' అని వాడుతుంటారు. "నాకు తెలిస్తే ఇంకా నువ్వేందిరా చెప్పేది" అని మనసులో అనుకుంటా.
రెండవది 'I mean'. నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రావటంలేదు, సమయానికి ఆ పదాలు గుర్తుకు రావటంలేదు అన్నప్పుడు 'I mean' అని వాడుకోవచ్చు. చెప్పిందే మళ్లీ చెప్పేవాళ్ళకి ఈ పదం మహబాగా ఉపయోగ పడుతుంది.
మీరు ఆంగ్లంలో అబద్దం ఆడాలి అనుకున్నారు. కాని ఎదుటి వాళ్ళు నమ్మరేమో అన్న అనుమానం వచ్చిందంటే, అలాంటి సందర్భంలో ఉపయోగ పడే పదం 'actually'. అలా అని చెప్పి మిగితా సమయంలో వాడ కూడదు అని ఏమి లేదు. ఎండాకాలం ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు మంచినీళ్ళు తాగినట్టు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పదం వాడుకోవచ్చు.
నేను ఇది వరకే చెప్పినట్టు, ఔచ్, ఊప్స్, లాంటి చిన్న చిన్న పదాలైతే, పోకిరిలో మహేష్ బుల్లెట్లు వాడినట్టు మీరుకూడా ఎవరికీ లెక్క చెప్పకుండా విచ్చల విడిగా వాడుకోవచ్చు. ఇలాంటి పదాలు ఒక పది పదిహేను నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే.
ఆంగ్లం అంటే గుర్తొచ్చింది, ఉదయం నువ్వు-నేను చిత్రం చూశాను. ఆ చిత్రం ఇవాల్టి రోజున తీసుంటే, అందులో పాటలు మార్చి"బెంగుళూరు బుల్లా మేము బాంగిల్స్ వాళ్ళం కాదా? నీ హ్యాండ్ షో లేదా , మా బ్యాంగిల్ 'పుట్ట'లేదా? బెంగుళూరే బుల్లా మాది బాంగిల్స్ వాళ్ళమే బుల్లా మేము" అని రాస్తారేమో.
ఇంకా మీకు ఎక్కువ ఆంగ్లం మాట్లాడాలి అనుకుంటే, డబ్బులు కట్టక తప్పదు. ఎంతో కాదు, కేవలం 5000 రూపాయలు కడితే పాలన్న కన్నా బాగా మాట్లాడేట్టు ఆంగ్లం నేర్పిస్తా. షరతులు వర్తించవు. కావాలంటే చూడండి 5000 మీద చుక్క పెట్టలేదు. గమనిక: 5000లతో ఆంగ్లం నేర్చుకున్న వాళ్లకు, అదనంగా తెలుగు కుడా నేర్పబడును, అది కుడా పూర్తి ఉచితంగా. త్వరపడండి, అందమైన అమ్మాయిలకు ప్రత్యేక శ్రద్ద తీసుకోనబడును, రాయితీ కుడా ఇవ్వబడును.
బాగా చెప్పారు. కాని మీరు తెలుగు ఉచితం గా నేర్పుతాను అంటే ఎవరూ రారేమో!!. ఈ రోజుల్లో తెలుగు మాట్లాడినా, నేర్చుకున్నా చులకన భావం వుంది జనాల్లో..ప్చ్..
ReplyDeleteమహ బాగా చెప్పారు. మునుపు ఆంగ్లం రాదు అంటే చులకనగా చూసేవారు, రాను రాను తెలుగు వచ్చు అంటే చులకనగా చూస్తున్నారు
Deleteయూ నో.. బాగా రాసారండీ. యాక్చువల్లీ నాకు భలే నచ్చింది. :D (నిజంగానేనండీ!)
ReplyDeleteమీరు ఆంగ్లంలో భలే మాట్లాడుతున్నారే
Deleteఆంగ్లం ఇందాకే నేర్చుకున్నానండీ.. మీ టపా చదివి. ఇన్నాళ్ళూ తెలుగులోనే బతికేసాను. :D
Deleteరాయితీలున్నాయన్నారు కదా అని మీ ట్యూషన్ లో చేరానన్నమాట. :)
రాయతీలు ఇవ్వటానికి ఒక షరతు కుడా పెట్టాను, అందరికీ కాదు, కేవలం అందమయిన అమ్మాయిలకు మాత్రమే :P
Deleteఅయితే నాకు రాయితీ ఉన్నట్టా? లేనట్టా? ;)
Deleteరాయితీ ఉన్నదీ లేనిదీ మీ మీదనే ఆధారపడి ఉంది. :P
Deleteమీ టపా..ఎలా ఉందంటే ఐ మీన్, అక్చువల్లీ....యునో.. ప్రెటి గుడ్..
ReplyDeleteమీలానే రాష్ట్రంలో అందరూ చక్కగా ఆంగ్లంలో మాట్లాడాలి అనేదే నా కొరిక
Delete10 ఏళ్ళు ఆన్ సైట్ లో ఉన్నా నేర్చుకోలేని విషయాలు ఊరకే నేర్పిచేస్తున్నారు ... :-)
ReplyDeleteఇంకా నేర్చుకోవాలన్న తపన, 5000 రూపాయలు ఉంటే ఇంకా చాలా నేర్పిస్తా
Deletebeau... :)
ReplyDeleteadirindandi.
ReplyDelete