మొత్తానికి రామ్@శృతి.కామ్ ఇప్పటి వరకు అయితే అందరూ 'బాగుంది' అంటున్నారు. వచ్చిన సమస్యల్లా, "అది నీ కధే కదా?" అని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తే, " ఎవరు రా ఆ శృతి? మాకు ఎప్పుడూ చెప్పలేదు?" కొంతమంది నిలదీశారు. మొదట ఇలాంటి వాటికి చిరునవ్వే సమాధానం అనుకున్నాను. కానీ ఖండించక పొతే ఖాయం చేసుకునే ప్రమాదం ఉందనిపించింది. అందుకే ఈ శీర్షికాభిముఖంగా ఖండిస్తున్నాను. అందులో నా పేరు, ఊరు తప్ప మిగితాదంతా కేవలం కల్పితం మాత్రమే అని ఏది గుద్ది అయినా చెప్పగలను.
ఒక వేళ నేను రాసినది అంతా కాసేపు, నా కధనే అనుకుందాము. అలాంటప్పుడు నాకు కధలు రాసే ఓపిక, తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి? అస్సలు అమ్మాయి (లు) అంతలా ఇష్టపడే అంత దృశ్యం నాకు లేదు.
ఇంక 'శృతి' విషయానికి వద్దాం. నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో, 'పోకిరి' చిత్రం విడుదల అయినప్పుడు చాలా సార్లు చూశాను. అప్పుడు బాగానే నచ్చింది. బహుశా ఆ చిత్రం నుంచే మొదలు అనుకుంటా, మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మనోభావాలు దెబ్బ తినే విదంగా చూపించటం. అందులో బ్రహ్మానందాన్ని మా మనోభావాలు దెబ్బ తినే విదంగా చూపించారని, నాకు ఉద్యోగం వచ్చాక కానీ అర్ధం కాలేదు.
అందులో బ్రహ్మానందం, ఇలియానా వెంట 'శృతి, శృతి, శృతి' అని వెంట పడితే నవ్వని వారు లేరు. అలాంటి పరాభవానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే నా కధలో అమ్మాయికి శృతి అని పేరు పెట్టాను. నేను కధ రాస్తూ వేరెవరో కధానాయకుడిగా ఎందుకు అని నా పేరే పెడితే, ఈ పాడు ప్రపంచం నన్నే అనుమానిస్తుందా?
పుస్తకం రాయటం అయితే రాయగలిగాను కానీ, దానిని పాఠకుల దగ్గరకి మాత్రం ఎలా తీసుకువెళ్ళాలి అనేది పెద్ద సమస్య అయిపొయింది. అందుకని చివరగా చెప్పొచ్చేది ఏంటంటే? మీరు చదివితే, మీ స్నేహితులకి ముఖం పుస్తకం ద్వారా చదవమని చెప్పండి. మీరు చదవకపోతే, ముందు చదివి తర్వాత మీ స్నేహితులకి చెప్పండి. ఈ క్రింది లింక్ కి వెళ్లి రామ్@శృతి.కామ్ ని చదవగలరు