ఈ టపా కేవలం పురుషులకు మాత్రమే! మహిళలు ఇక్కడితో ఆపేయాల్సిందిగా కోరుతున్నాను.
"చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో" అని చీర విలువ గురించి చాలా చక్కగా చెప్పారు, కవి చంద్రబోసు. కానీ లుంగీ మాత్రం ఏమి పాపం చేసింది? లుంగీ మీద ఎందుకీ సీత కన్ను? చీరతో లుంగీకి కొన్ని వేల సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కానీ లుంగీకి మాత్రం, చీరకు వచ్చినంత గుర్తింపు రాలేదన్నది సత్యం. అందుకే ఆ లోటుని కొంతైనా భర్తీ చేయటానికి ఈ పాట రాశాను. మీరు కూడా లుంగీ గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరుకుంటున్నా...
లుంగీలోని గొప్పతనం తెలుసుకో
ఈ లుంగీ కట్టి మగతనం పెంచుకో
వెటకారమనే దారంతో చేసింది లుంగీ
ఆనందమనే రంగులనే అద్దింది లుంగీ
సౌకర్యమనే మగ్గంపై నేసింది లుంగీ
సౌకర్యమనే మగ్గంపై నేసింది లుంగీ
మడిపంచతో నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
పంచకట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలక్ష్మిని కురిపించును పంటలు
ఎగుడు కట్టుతో పడకటింట చేరితే
గుండె జారి పోతుంది అమ్మడు
దొర కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
జలుబులో ఉన్నప్పుడు నీ ముక్కును తుడిచేది
చిన్న లుంగీ అంచులోన ఆహ్లాదం ఉన్నది
జలుబులో ఉన్నప్పుడు నీ ముక్కును తుడిచేది
చిన్న లుంగీ అంచులోన ఆహ్లాదం ఉన్నది
పసిపాపలా నిదురపోయినప్పుడు మన లుంగీ ఎగరేను హాయిగా
తుమ్మెదై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ లుంగీగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆలుంగీనే నీ పాలిట వింజామర
వారమైనా బట్టలు ఉతకనప్పుడు ఆ లుంగీనే నీ ఒంటికి గొడుగు
తుమ్మెదై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ లుంగీగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆలుంగీనే నీ పాలిట వింజామర
వారమైనా బట్టలు ఉతకనప్పుడు ఆ లుంగీనే నీ ఒంటికి గొడుగు
విదేశాలలో సైతం నిగర్వంగ ఎగిరేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది