పాటలను కంపు చేసే పోటీలే గనుక ఒలంపిక్స్ లో పెడితే, మన దేశానికి బంగారు పతకం మాత్రం, నా ద్వారా ఖాయం అని తెలియజేసుకుంటున్నాను. 'యమహా నగరి , కలకత్తా పూరి' పాటను , అమెరికా స్టైల్ లో కంపు చేయటం జరిగింది.
న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి
న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి
యమహొ న్యూ జర్సీ … గోల్డెన్ వారధి
న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి
ఒక రామ బంటు నీ రుచినే మరిగెను మరి ...3
మైకేల్ జాక్ పుట్టిన చోటా బీట్ ఇట్ ఆడిన చోట పాడనా తెలుగులో
జన్నీఫర్ పాడిన పాటె, మాడోన ఆడిన ఆట ఆడనీ
ఎందరో వలస వచ్చారీ దేశం బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితొ ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో ||న్యూయార్క్ సిటీ||
ఓ సుందర్ పిచ్చయ్ అయినా - సత్యా నాదెండ్ల అయినా
పాడని ఈ పాటని
రోజంతా రజనీ కిందా రాత్రంతా సూర్యుడికిందా సాగనీ..
పదగురు దేశమే కాని దేశం, ఒక్కరొక్కొక్క వేషం
డాలరే చేసె మైకం తెలుసుకోరా
మంచుకు నెలవట చెమటకు సెలవట
తిథులకు లేటుట అతిథులు లేరట
తోచక చేసే ఎద నస లో ||న్యూయార్క్ సిటీ||
లాస్ ఏంజల్స్ రంగులు అన్నీ , లాస్ వేగాస్ ఒంపులు కొన్ని చూడని
కాసినో ఆటలు అన్నీ, లాంగ్ డ్రైవ్ తో అందాలన్నీ చూడనీ
వినుగురూ…
జిమీ హెండ్రిక్స్ గిటారా, టేలర్ స్విఫ్ట్ కిథారా
N R I కుమారా. కదిలి రారా..
జనగణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుకపికముఖసుఖ రవళులతో..
|| న్యూయార్క్ సిటీ ||
Last 2 lines mathram endukodilesav? ;)
ReplyDeleteraayaleka vadilesa, mahaanubhaavudu Veturi kabatti raasaadu.
Deleteరోజంతా రజనీ కిందా రాత్రంతా సూర్యుడికిందా సాగనీ.. Ee two lines super ga unnai :D
ReplyDeleteThank you :) Indialo andaru padukune timeki ikkada lestunnam, anduke ala raasa, glad you liked it.
Deleteala ani migathani bagaleda ani satairamaku...
ReplyDelete