Tuesday, April 5, 2011

శ్రీఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

      ముందుగా అందరికి శ్రీఖరనామ సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాది ఎన్నో మధుర జ్ఞాపకాలు నింపింది. పోయిన ఏడాది ఉగాది సమయానికి నా m.tech మొదటి సంవత్సర పరీక్షలు మొదలు  అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రాస్తున్న పరీక్షలు. b.tech నాలుగు సంవత్సరాలు లిఖిత, అంకమ్మరావు ఇద్దరు పాపం, నాకు ఏ అనుమానం వచ్చినాగానీ  పరీక్ష రాసేటప్పుడే చెప్పేవారు. ఇప్పుడు పరీక్ష మధ్యలో ఏది అయినా గుర్తుకు రాక పొతే ఎవరు చూపిస్తారు? అని చాలా భయమేసింది. కాని వికృతి నామ సంవత్సరం నాకు మహా బాగా కలిసి వచ్చింది. పరీక్షలు అన్నీ ఎవరి దగ్గరా చూడకుండానే, చాలా బాగా రాసేశాను. ఇలా పరీక్షలు అయిపోయాయో లేదో, వెంటనే ఒకప్పుడు లింగరాజు గారి సంస్థ నుండి పిలుపు వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకే  మా శ్రీరామాచంద్ర ప్రపంచ ప్రసిద్ది పొందాడు. ఇంకా ఇదే ఏడాదిలో హరీష్, మల్లి మామ ఇద్దరూ  బెంగుళూరులో స్థిరపడ్డారు. రాసిన పరీక్షలు అన్నింటిలో ఉత్తీర్ణత సాధించాను. సంవత్సరం ఆసాంతం హాయిగా గడిచి పోయింది. సరిగ్గా ఏడాది ఇంకో రెండు రోజులలో ముగుస్తుందనంగా మన వాళ్ళు క్రికెట్లో జగజ్జేతలుగా ఆవిర్భవించారు. 

       ఇక రేపు ఉగాది పరవదినం అనగా ముందు రోజు రాత్రి., ఆ ఏడాది జరిగిన సంఘటనలు అన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. రాబోయే సంవత్సరం ఎలా ఉండాలో అని రకరకాల ఊహలు నా మదిలో మెదిలాయి. అలా అలొచిస్తూ అలొచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. ఉగాది రోజు, ఉదయం ఆరు గంటలకు ముందే లేచాను.  అప్పటికే నా ఫోనులో అరడజను సంక్షిప్త సందేశాలు ఉండటాన్ని గమనించాను. నా మిత్రులు నా మీద ప్రేమతో అర్ధరాత్రే నాకు సందేశాలు పంపారు. షేక్ స్ఫేరే కి కూడా అర్ధం కాని ఆంగ్లంలో నాకు చక్కగా ఉగాది శుభాకాంక్షలు పంపారు. అచ్చ తెలుగు పండుగ, అందున సంవత్సరాది నాడు, ఆంగ్లంలో, అది కూడా అర్ధరాత్రి సందేశాలు చూసి నాకు చిరాకేసింది. కుక్కతోక వంకర, ఎలుకతోక నలుపు, తెలుగు సినిమా కధలు, వీళ్ల బుద్ధి మారవని నాలో నేనే తిట్టుకున్నాను. 

      ప్రొద్దున్నే నల్లకుంటలోని శంకరుని ఆలయానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మనసు చాల ప్రశాంతంగా ఉంటుంది. పండగ రోజు అందరికి దేవుడు గుర్తొస్తాడు కాబట్టి అందమైన అమ్మాయిలు  ఇంకా అందంగా తయారు అయ్యి గుడికి వచ్చారు. వాళ్ళని చూస్తే, పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఇంకో పక్క అక్కడ అర్చక స్వాములను చూస్తే నేను కూడా సన్యాసం తీసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో రెండూ కుదరవు అని బాదేసింది. అక్కడ తీర్ధ ప్రసాదాలు తీసుకుని, ప్రక్కనే ఉన్న మా అన్నగారింటికి వెళ్ళాను. సాయంత్రం దాకా  మా  అన్నగారి అబ్బాయి, అభిరాముతో ఆడుతూ సమయమే తెలియకుండా పోయింది. మొత్తానికి వికృతి  నామ సంవత్సరంలాగానే, ఖరనామ సంవత్సరంకుడా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను.    

2 comments:

  1. పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఇంకో పక్క అక్కడ అర్చక స్వాములను చూస్తే నేను కూడా సన్యాసం తీసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో రెండూ కుదరవు అని బాదేసింది. ....eka kaalamlo rendu paraspara viruddhamaina baavanalu....pelli, sanyasam (dangerous taughts bhayyo....jeevitham pai vairagyam undhi nee manasulo edo moolana)....kiran stubborn

    ReplyDelete