Sunday, September 18, 2011

జీవిత సారం 2 (అమ్మాయి, జీవితం రెండూ రెండే)

జీవిత సారం 1 లో మీకు జీవితం గురించి, దానికి ఆవకాయతో ఉన్న అనుభందం గురించి చెప్పాను. దానికి కొనసాగింపు ఈ శీర్షికలో చెప్పబోతున్నాను. 
  
  మా కార్యాలయం మొత్తం ఐదు అంతస్తుల భవనం. నేను పని చేసేది నాలుగో అంతస్తులో. రోజూ ఉదయాన్నే లిఫ్ట్లో నాతో పాటుగా చాలా మంది అందమైన అమ్మాయిలు ఎక్కుతారు. రెండవ అంతస్తులో కొంతమంది, మూడో అంతస్తులో మరి కొంతమంది దిగుతారు. నన్ను నాలుగో అంతస్తులో దించి, మిగిలిన ఒకరిద్దరు అందమైన అమ్మాయిలు ఐదో అంతస్తులోకి వెళ్తారు. నాతో నాలుగో అంతస్తులోకి మాత్రం, నలుగురు ఐదుగురు పిల్లల తల్లులు, నాలుగు ఐదు సార్లు పెళ్లిలు ఐన వాళ్ళు వస్తుంటారు (నా ఉదేశ్యం పెళ్ళయి నాలుగు ఐదు సంవత్సరాలు అయినోళ్ళు అని). జీవితంలో ఇలాంటివన్నీ సహజం.

    ఉదాహరణకు, ఒక రోజు రాత్రి పదిన్నరకు మా సుబ్బన్న సికింద్రాబాద్లో రైలు అందుకోవాలి అంటేనూ, ఈ హైదరాబాదులోని దారులలో రద్దీని(ట్రాఫిక్) నమ్మలేము అని ఎనిమిదున్నరకే కుకట్ పల్లిలో బస్సు ఎక్కించా. జీవితం.... తొమ్మిది గంట కొట్టే సరికి సికింద్రాబాద్ చేరినట్టు ఫోను చేశాడు. పదిన్నరకు రావాల్సిన రైలు ఆ రోజు పన్నెండింటికి వచ్చిందట!! పాపం సుబ్బన్న, మూడు గంటలు ఏంచేయాలో తోచక అవస్తపడ్డాడు. అదే ఆలస్యంగా బయలుదేరుంటే ఖచితంగా ఆ రైలు పదిన్నరకు వచ్చేది. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరాము  అనుకోండి, మనం వెళ్ళిన ప్రతి కూడలి(జంక్షన్) దగ్గరా, ఎరుపు రంగు (రెడ్ సిగ్నల్) దర్శనమిస్తుంది. 

పరీక్ష ముందు రోజు(మాత్రమే) శ్రద్దగా చదవటం మనందరికీ అలవాటు. ఆ రోజు ఏదైతే ప్రశ్న కష్టంగా ఉండి వదిలేస్తామో, అదే ప్రశ్న, ప్రశ్నాపత్రంలో  తాటి కాయంత అక్షరాలతో, సబరిమలయిలో సంక్రాంతి పర్వదినాన "మకర జ్యోతి" కనిపించినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏమ్చేస్తాం? మకర జ్యోతికి పెట్టినట్టు, ప్రశ్నాపత్రంకి   కూడా దండం పెట్టుకోని, మనకు తోచిన జవాబు రాసి వస్తామనుకోండి, అది వేరే విషయం.

ఎవడో చెప్పాడు, పన్నీరు ఎక్కువ తింటే ఒళ్ళు వస్తుందని. ఆ రోజునుండి పన్నీరు తినని రొజు లేదు. అయినా పొట్ట తప్పిస్తే ఒళ్ళు రావటంలేదు. మా స్నేహితుడొకడు ఒళ్ళు తగ్గాలని రోజుకి ఒకసారే మితంగా భోజనం చేస్తున్నాడు. ఒళ్ళు నీరసపడటం తప్పించి సన్నపడటంలేదు. 

అదేంటో నేను ఏ చిత్రం మొదటి రోజున చూసినా, ఆ చిత్రం ఖచ్చితంగా సోది చిత్రాల జాబితాలో చిరస్తాయిగా నిలిచిపోతుంది. ఆదివారం క్రికెట్ ఉంది, టెండూల్కర్ ఆట చూద్దామని కూర్చుంటామా! ఆ రోజే ఏదో ముఖ్యమైన పనున్నట్టు మన టెండూల్కర్ అన్న ఇలా వచ్చి అలా పోతాడు. అప్పటికీ నాన్న తిడుతూనే ఉంటారు, "నువ్వు చూడమాకురా వాళ్ళు సరిగ్గా ఆడరు" అని. అన్నట్టుగానే నేను చూడటం మొదలుపెట్టగానే మనోళ్ళు ఒక క్రమశిక్షణతో, ఒక  వరుస క్రమంలో అవుట్ అవుతుంటారు. 

ఇంతెందుకు, నిన్నటి దాకా వానాకాలం, వర్షం పడుతుందేమో అని గొడుగు తీసుకెళ్తే, భరించలేనంత ఎండ కాసేది. అదే బట్టలు ఉతికి ఆరేస్తే మాత్రం, దిక్కుమాలిన వర్షం ముంచుకొచ్చింది. జీవితం!!!!!!!! ఇది చూసిన మా పక్కింటి ఆవిడ, ప్రొద్దున్నే వచ్చి "బాబు అనంతరాము, ఈ రోజు ఒడియాలు, మిరపకాయలు ఎండ  పెట్టుకోవాలి  అనుకుంటున్నా, నువ్వు మాత్రం బట్టలు ఉత్తకుండా, కాస్త గొడుగు తీసుకొని అలా బజారుకి వెళ్లిరా బాబు ", అని బతిమిలాడింది.        

అందుకనే ఈ రామానంద స్వామి ఏమంటాడంటే "అమ్మాయి, జీవితం రెండూ రెండే, వాటి మాట మనం వినాల్సిందే తప్ప, మన మాటలు అవి వినవు గాక వినవు".  రాబోయే శీర్షికలలో జీవితం సారం గురించి మరింత చెబుతాను., అప్పటి దాకా, ఈ రామానంద స్వామి ఆశీస్సులు మీకు సదా ఉంటాయని తెలియజేస్తున్నాను..... సశేషం...  

10 comments:

  1. Mama nuvvu devudivi ra.... :D :D
    --Jayanth

    ReplyDelete
  2. @జయంత్: ఎదో అన్నా నీ అభిమానం

    ReplyDelete
  3. "అమ్మాయి, జీవితం రెండూ రెండే, వాటి మాట మనం వినాల్సిందే తప్ప, మన మాటలు అవి వినవు గాక వినవు"---- ఎవరు ఆ అమ్మాయి అనంత్???????

    ReplyDelete
  4. ఎదో మాట వరుసకు రాశాను రాకేష్, అయినా నీ అంత దృశ్యం నాకు లేదు కదా

    ReplyDelete
  5. @రాకేష్: గురుజీ అలాగే అంటుంటారు.. చట్టం తన పని తాను చేసుకుపోయినట్లు.. చెసే పనులు చెస్తూనే ఉంటారు.. అందుకని గురుజి మాటలు వినాలి కాని నమ్మకూడదు.. అంతే కదా గురుజీ

    ReplyDelete
  6. హరీష్ : బాగా చెప్పావ్....

    అనంత్....నాదో చిన్న విన్నపం....మన ఇంజనీరింగ్ కళాశాలలో నువ్వు ఎక్కు పెట్టిన బాణాలని రెండు ఇక్కడ కూడా వదిలితే చదివి తరిస్తాం...

    ReplyDelete
  7. @ రాకే ష్: తప్పకుండ సమయం వచ్చినప్పుడు, ఆ విషయాలని కూడా ఖండిద్దాం .

    ReplyDelete
  8. @ హరేష్: తాటిని తన్నే వాడుంటే, వాడి తల తన్నే వాడుంటాడు , అది నువ్వేరా!!!

    ReplyDelete
  9. Hi Ananth gaaru mee seershikalanee chadivanu chaala chaala baagunnai nijangaa manasuku enthoo santhoshanni kaliginchelaa haaigaa navvukonelaa unnai nijangaa hatsoff

    ReplyDelete