Sunday, November 27, 2011

పెళ్లాలు అంటే????

మా కార్యాలయంలో ఒక సోదరుడు, నాలుగు నెలల క్రితం, పొరపాటున పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు లాక్కో లేక, పీక్కో లేక అల్లాడుతున్నాడు. రోజు ఉదయాన్నే ఏడింటికి కార్యాలయానికి వచ్చి, పని లేకపోయినా, ఏ అర్ధరాత్రో కాని ఇంటికి చేరటం లేదు. అదేంటని అడిగితే, "కాలం కలిసి రాక, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే, అప్పుడు నీకే అర్ధం అవుతుందిలే తమ్ముడు" అని చెప్తుంటాడు.

ఒక రోజు ముఖం నీరసంగా, రోజిటికంటే చిరాకుగా, దిగాలుగా కార్యాలయానికి వచ్చాడు. సరే మనిషి బాగా దిగాలుగా ఉన్నాడు కదా, కాస్త ఊరట కలిగిద్దాం అని, కాఫీ తాగిద్దామని తీసుకెళ్ళాను. కూర్చొని కాఫీ చేతులో పట్టుకుని, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే, పెళ్లి చేసుకోవటం ఎంత పొరపాటో, చేసుకుంటే ఎంత బాదపడాల్సి వస్తుందో చెప్తూ, పనిలో పని, నన్ను మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని సలహా ఇచ్చాడు.

ఇంతలో ఆ ప్రక్కనే ఉన్న టి.విలో ఒక పాట చూసి, అతని ముఖం ఎర్రగా అయ్యింది. ఆవేశంతో ఊగిపోయాడు. అది గోపీచంద్, ప్రియమణి కలిసి నటించిన "గోలీమార్" అనే హిందీ పేరుతో వచ్చిన తెలుగు చలన చిత్రం. "మగాళ్ళు అంటె మాయగాళ్లె, ప్రేమంటె ఏమిటో తెలీదే" అనే పాట వింటుంటే, అతనున్న పరిస్థితిలో ఆ మాత్రం కోపం రావటం సహజం. ఆ పాట రాసినతని దగ్గరి నుంచి, ఆ చలన చిత్రం చూసిన వాళ్ళందరిని తిట్టటం మొదలు పెట్టాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం హత్యలు చేస్తున్న ఈ రోజులలో, నాతో పాటు పని చేసే, ఆ అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా చేయాలి అనిపించి, అదే పాటను మార్చి రాశాను. అది ఇప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

అతి ముఖ్య మనవి: ఏదో సరదాకి ఈ పాట రాశాను. అస్సలు నేను రాసినదానిలో ఎంత నిజం ఉందో తెలియదు, ఎందుకంటే నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఈ మాత్రం దానికి, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

పల్లవి||
పెళ్లాలు అంటే పిశాచాలే, మంచి అంటే ఏమిటో తెలీదే,
బుఱ్ఱంత భోంచేస్తూ ఉంటారే!! వీళ్ళు కూడా ఇంతే!!
ఆడాళ్ళ ధ్యాసంత సొమ్ము మీదే, గమ్ముగా గంటైన ఉండరంతే,
ఆడాళ్ళ మెదడు ఆవగింజంతే, వీళ్ళు కూడా ఇంతే .....

చరణం||
కాస్తంత ప్రశాంతత కోరుకుంటాం, కూసంత టైమిస్తే పారి పోతాం,
పెళ్ళాల పోరేంటో, పిచ్చేంటో, మాటేంటో, నడకేంటో, ఏమో ఏంటో
మీకు నచ్చినట్టు మేము నడిచినా, మా జీతమంతా పోసి ఇచ్చినా ఇదింతే., వీళ్ళు కూడా ఇంతే
||పల్లవి||
చరణం||
చెప్పిన చోటుకల్లా తీసుకెళ్తూ ఉంటాం. అడ్డమైనవన్నీ కొనిస్తూ ఉంటాం.
పెళ్ళాల సుత్తేంటో, నస్సేంటొ, కస్సేంటో, బుస్సేంటో, ఏమో ఏంటో
మీతో ఏడడుగులు వేసినా, ఎన్ని వేల సార్లు అలా వేసినా, మీరింతే

మళ్లీ చెప్తున్నాను, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

18 comments:

 1. Hehe.. :)
  Mundu thondara paddadu.,
  tarvata badha paddadu.,
  karma kaali nee kantlo paddadu.,
  ippudu aame chadivindante road meeda padathadu.!!

  btw line of the blog - "Aaa paata raasinatani nundi aaa cinema chusina vallandarni thittadu!" :D

  --Jayanth

  ReplyDelete
 2. balagangadhra tilak12/6/11, 7:34 PM

  నాయనా మీనాన్నతో చెప్పాను
  ఆపనిలోనే వున్నారు
  తొందరలో నీ కధ వ్రాద్ధువు
  అప్పుడు ఒకటికి నాలుగుసార్లు చదువుతాము చదివిస్తాము
  ...... యర్రా

  ReplyDelete
 3. @ybgtilak :ఏదో అఙానంతొ రాశాను బాబాయి. ఈ మాత్రం దానికి మా నాన్నకి చెప్పలా??

  ReplyDelete
 4. అయ్యొయ్యో ఇప్పుడేలా, పల్లవి చదవంగానే టీవీ9 కి ఫోనుకొట్టేశా! వాళ్ళిప్పుడు మీ బ్లాగుకే వస్తున్నారు!! :)

  good parody, BTW

  ReplyDelete
 5. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు :D

  ReplyDelete
 6. @Bhaskar: anubhavam lekapoina edo aaa vidamga munduku poya :P

  ReplyDelete
 7. baga chepparu

  ReplyDelete
 8. oyyy!!! aa pellaala list lo nee frends ammaayilu kudaa unnaaru gurtu pettuko .... mahilaa sanghaalu akkarledu memu chaalu

  ReplyDelete
  Replies
  1. @విద్య : మీ వారు చెప్తేను, నీ గురించే ఇది రాసింది. నీ వల్ల మిగితా వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్నది.

   Delete
 9. అస్సలు బాలేదు (మావారికి ఈ పోస్ట్ మాత్రం చూపించను)ఇది మీ బ్లాగ్ లిస్ట్ లో లేకుండా చేసే ఉపాయమేమన్నా ఉందా?

  ReplyDelete
  Replies
  1. అస్సలు లేదు, మీ వారికి ఈ పోస్టు చూపించే మార్గం ఏదైనా ఉందా?

   Delete
 10. oyy ram mi abbayilu emaina silent ga untaara.any way mi novel superb nice attempt iam also s/w engr.the way u narrated the story is awesome.

  ReplyDelete