Sunday, January 8, 2012

జానకి నా ప్రియసఖి

మనలో 'అంజలి అంజలి పుష్పాంజలి' అనే పాట విననివారుండరు . నేను విన్నప్పుడు అందులో చాలా పదాలు నాకు అర్ధం కాలేదు. లాభం లేదని ఆలస్యం చేయకుండా ఆ పాటను పాడు చేసి మళ్లీ రాశాను. నా శక్తి కొలది పాటను పాడు చేశాను. కాకపోతే అంజలి అనే అమ్మాయితో నాకు పరిచయం లేదు. ఎవరి మీద రాయాలి అని ఆలోచిస్తుంటే, రాముడికి సరి అయిన జోడి జానకి కదా అనిపించింది., అందుకని జానకి మీద పాట రాశాను.

పల్లవి :
బాబు ||
  జానకి జానకి నా ప్రియసఖి --- (2)
నిను వదిలి పోలేనే ఏనాటికి
నీతోనే నేనుంట ముమ్మాటికి
నా ప్రాణం వదిలేస్త నీ మాటకి
                      నువ్వు పల్లవవ్వాలి నా పాటకి...      ||జానకి||

ఎందుకు నీ పేరునే పదే పిలుస్తుందని
నా పెదవి అడిగిందిలా, ఈ చిన్ని మనసుని
ఎందుకు నీ కోసమే పదే వెతుకుతుందని
కనురెప్ప అడిగిందిలా నా కంటి పాపని

ఎదలో నీ రూపం మెదలినది
ప్రతి అడుగు నీ వైపే కదిలినది
జానకి జానకి నీకిక దాసుని

నీ బుగ్గలో ఉన్న ఆ సొట్టకి
నీ నడుములో ఉన్న ఆ ఒంపుకి
నీ కురులలో ఉన్న ఆ నలుపుకి
                   నీ కళ్ళతో చేసే ఆ మాయకి.....          ||జానకి||

పాప||
గుండెలో నా ప్రేమనే ఎలా తెలుపాలని
ఎదుటనే ఉన్నా మరి మాటే రాదని
చల్లని ఈ గాలిలో నిను చేరాలని 
వెచ్చని కౌగిళ్లలో ఒదిగుండాలని

వలచా నువ్వే నా సర్వమని
మదిలో నీ ప్రేమే పదిలమని  
జానకి జానకి నీకిక ప్రేయసి

నా మనసులో ఉన్న నీ బొమ్మకి
నా తోడు నీవేలే ఈ జన్మకి
నా ముద్దు మురిపాలు నీ చెంతకి
                     నీ చిలిపి చిరునామా ఈ జానకి     ||జానకి||

బాబు||
జాబిల్లికైనా సరే మచ్చొకటి ఉందని
నీ అంత అందం మరి లేనే లేదని
వేసవిలో వానలా నువ్వొస్తావని 
వేచాను నీరాకకు నిదురే మాని 

వేసే ప్రతి అడుగు నీ వైపే 
   వచ్చే ప్రతి తలపు నీ వలపే    
                          జానకి జానకి జాగిక దేనికి      ||నిను వదిలి||  

6 comments:

  1. హహహ మీ పేరడీ బాగుంది!నేను పాడేసుకున్నాను కూడా!

    ReplyDelete
  2. @రసఞ: ఆ పాడిన పాట ఏదో నాకు పంపితే, విని తరిస్తాము కదా

    ReplyDelete
  3. @రాజేష్ మారం: :D

    ReplyDelete
  4. Patalu padu cheyyaku ra blogs rayi bagunnayi kada evaryina bagolevu ani cheppara......

    ReplyDelete
    Replies
    1. @Naresh: ఇంత వరకు పాటలు బాగా లేవు, అని కూడా ఎవరూ చెప్పలేదు. అందుకే రాశా. ఈ ఒక్కసారికి "వీడి పాపాన, వీడు పోతాడు " అనుకోని, క్షమించి వదిలేయి

      Delete