"కావాలి ప్రశ్నలకే జవాబులు" అని అన్నాడో సినీ కవి. చాలా ప్రశ్నలకు జవాబుకన్నా ఓపిక కావాలి. జీవితంలోని ప్రతి అంకంలో మనకు కొన్ని ప్రశ్నలు పదే పదే ఎదురు పడుతుంటాయి. ఉదాహరణకు "బాబు, ఏ తరగతి చదువుతున్నావు?", "పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి?","ఎంసెట్ ఎంత ర్యాంకు వచ్చింది?", "ఇంజనీరింగ్ ఎక్కడ చదువుతున్నావు?", "ఏమిచేస్తున్నావు? ఉద్యోగం ఏమైనా వచ్చిందా?", "ఎక్కడ పని చేస్తున్నావు?, జీతం ఎంత వస్తుంది?", "పెళ్లి ఎప్పుడు?", "పెళ్లి చేసుకుంటున్నావా? కట్నం ఎంత?", "పిల్లలు ఎంత మంది?", "పిల్లలు ఏ బడిలో చదువుతున్నారు? ఏ తరగతిలో చదువుతున్నారు", ఇలా చెప్పుకుంటూ పొతే ఈ కుశల ప్రశ్నలకి అంతే లేదు.
ఇలాంటి సాదారణ ప్రశ్నలు కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు గుండు చేయించుకుని ఎవరికైనా ఎదురుపడితే, "ఎక్కడిది ఈ గుండు? తిరుపతికి వెళ్ళావా?" అని అడుగుతారు. మనం అవును/ కాదు అని చెప్పేలోపే "ప్రసాదం ఏది?" అని కూడా అడుగుతారు. కొత్త చొక్కా వేసుకున్న రోజు పుట్టిన రోజా అని, గడ్డం పెంచితే ప్రేమ విఫలమయ్యిందా అని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా వరకు మనం వేసే ప్రశ్నలు ఎదుటి వారిని తెగ ఇబ్బంది పెడుతుంటాయి, బాద కలిగిస్తాయి.
ఉదాహరణకు........, నాకు అప్పుడు ఏడు సంవత్సరాలు అనుకుంటా, ఒక రోజు మా అమ్మని భయపెడదామని, కుర్చీ మీదనుండి అమ్మ మీదకి దూకబోయాను, అమ్మకేమి తెలుసు? నేను ఇలాంటి సాహస కౄత్యాలు చేస్తున్నానని, తను పక్కకు పోయింది. అలా ఎగిరిన నేను, భూఆకర్షణ శక్తి వల్ల కిందకు పడ్డాను. ఆ దూకుడికి నా చెయ్యి విరిగి, మెలికలు తిరిగి పోయింది.
మా వీధిలోని జనమంతా నా ఏడుపుకి, మా ఇంటి ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడో అన్నగారు చనిపొయినప్పుడు వచ్చారు అంతమంది జనం, తరువాత నా చెయ్యి విరిగినప్పుడు వచ్చారు. ఒంగోలు తీసుకుపోయి పిండి కట్టు కట్టించారు. నా చెయ్యి విరగటానికి ప్రశ్నకి ఎమిటా సంభందం అంటారా??
చెయ్యికి కట్టు కట్టించి, ఇంటికి తీసుకువచ్చారు. చెయ్యి విరిగితే విరిగింది కానీ, ఆ వేళ ఒక గొప్ప శుభవార్త విన్నాను. ఒక రెండు నెలలు బడికి వెళ్ళక్కర్లేదు అని. మొదటి రోజు మా పక్క వీధిలో ఉండే తెలిసిన వాళ్ళు ఒక అరడజను అరటి పండ్లు తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారో, అనుకునేలోపుగా, "బాబు చెయ్యి విరిగిందని విన్నాము, ఎలా ఉంది ఇప్పుడు?" అని అడిగారు. చెయ్యి విరిగితే ఎవరికైనా హాయిగా ఉంటుందా? అని మనస్సులో తిట్టుకున్నాను. అక్కడితో మొదలైయిన ప్రశ్నల పరపంపర "ఎలా విరిగింది, ఎక్కడ కట్టు కట్టించారు? కట్టు ఎన్ని రోజులు ఉంచాలి?" ఇలా సాగిపోయింది.
అలా రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురు ఇంటికి రావటం, "అయ్యో బాబుకు చెయ్యి విరిగిందట!!" అని ఓదార్పు యాత్ర మొదలెట్టటం అలవాటు అయిపోయింది (చెంపలు నిమరటం, పెరుగాన్నాలు లేకుండానే). మూడో రోజు నుండి, ఇంటి బయట కూరగాయల వాడు వచ్చినా సరే, నా చెయ్యి చరిత్ర చెప్పటం మొదలు పెట్టాను. వాళ్ళు ప్రశ్న అడగటం, నేను అవే జవాబులు చెప్పటం, అలవాటయి పోయింది. నా చెయ్యి విరిగిన బాధకన్నా, వాళ్ళ ప్రశ్నలతో బాధ రెట్టింపు అయ్యేది.
అలా రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురు ఇంటికి రావటం, "అయ్యో బాబుకు చెయ్యి విరిగిందట!!" అని ఓదార్పు యాత్ర మొదలెట్టటం అలవాటు అయిపోయింది (చెంపలు నిమరటం, పెరుగాన్నాలు లేకుండానే). మూడో రోజు నుండి, ఇంటి బయట కూరగాయల వాడు వచ్చినా సరే, నా చెయ్యి చరిత్ర చెప్పటం మొదలు పెట్టాను. వాళ్ళు ప్రశ్న అడగటం, నేను అవే జవాబులు చెప్పటం, అలవాటయి పోయింది. నా చెయ్యి విరిగిన బాధకన్నా, వాళ్ళ ప్రశ్నలతో బాధ రెట్టింపు అయ్యేది.
చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, " ప్రశ్నించటం మాని, ముందు ప్రేమించండి, అప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు రావు" అని ఆర్యా చిత్రంలో అర్జున్ బాబు చెప్పినట్టు, మీరు ఎవరినైనా ప్రశ్నించే ముందు ప్రేమించక పోయినా పర్వాలేదు,కానీ ఒక నిముషం ఆలోచించండి. అస్సలు ఆ ప్రశ్నకి విలువ ఉందా? అది అవతలి వాళ్ళను బాద పెట్టకుండా ఉంటుందా? అని అలోచించి అడగండి.కొత్తగా పెళ్లై భాదల్లో ఉన్నోడిని, ఏరా పెళ్లి చేసుకున్నావట కదా అంటే ఎంత బాదగా ఉంటుంది? జగనన్న అంతటి వానికే తప్పలేదు ఈ ప్రశ్నల గోల. అప్పటికీ ఇదే విషయాన్ని నేను లక్ష్మీ నారాయణ అన్నకి కుడా చెప్పాను. వింటే కదా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు.
finishing touch hilarious :)
ReplyDelete@purna :)
Deleteadirindi kaani konni prasnalu adagochaa
ReplyDeleteమీ పేరు చెప్పి, ఆ తర్వాత అడగాలనుకున్న ప్రశ్నలు అడగచ్చు .
Deleteprashninchatam maani preminchandi... :D
ReplyDeleteNuvvu 7 samvatsarala vayasulone maa jagan anna ni minchi poyava., vaadu kuda ilaane vere valla amma la meeda paddadanta... :P
--JB
Anta maata anesav enti JB, aa anna mundu nenenta??? Odarchatamlo guinness record pedite, mana annake vastundi :p
Deleteanna tharuvathe evaraina.........
ReplyDeleteintaki evaru aa anna?
Deleteenti ee madya tv lu chudadam leda ram.........
ReplyDeleteendukala adugutnnaru???
Delete