ఒక ఇంట్లో మూడు సంవత్సరాల బాబు, బంతి ఆట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఎదురుగా ఉన్న గడపను తట్టుకొని కింద పడ్డాడు. నొప్పితో పెద్ద పెట్టున ఏడుపు మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని ఆ బాబు వాళ్ళ నీలాకాశం పరుగు పరుగున వచ్చాడు (అమ్మంటే వర్షించే మేఘం, నాన్నంటే నీలాకాశం అని తండ్రుల దినం రోజు టివి9 లో చెప్పారులే). పడిపోయిన కొడుకుని లేపి, ఓదార్చటానికి ప్రయత్నించాడు. ఆ తండ్రికి ఓదార్పులో, 'అన్న' అంత అనుభవం లేకపోవటంతో, ఆ బాబు ఎంతకీ ఏడుపు ఆపలేదు.
అంతలో వాళ్ళ నాన్నకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ పిల్లాడిని గడప దగ్గరకు తీసుకువెళ్ళి, "ఈ గడప తగిలే కదా నువ్వు పడ్డది, దీనిని బాగా తందాం", అని ఆ గడపని ఒక కర్ర తీసుకొని తన్నాడు. దీనితో ఆ పిల్లాడు ఏడుపు ఆపేసి నవ్వటం మొదలెట్టాడు. ఈ విషయాన్ని బాగా జీర్ణం చేసుకున్న ఆ పిల్లాడు, తనకు కలిగిన ఆనందం కన్నా, ఎదుటి వాళ్ళ బాదల్లోనే ఎక్కువ ఆనందాన్ని పొందటం అలవాటు చేసుకున్నాడు. ఇదేదో సినిమాలో చూసిన సన్నివేశంలా అనిపిస్తున్నది కదూ, ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే.
ఇలాంటి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక, నాలా సంఘ విద్రోహ శక్తులుగా మారి అందరినీ తిడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కనపడే చోటు "ముఖం పుస్తకం". ఈ రోజుల్లో మంచినీళ్ళ కన్నా జనం ఎక్కువగా వాడుతున్నది కులాన్ని. కులానికి ఒక రాజకీయ వ్యవస్థ, కులానికి ఒక నాయకుడు, కులానికి ఒక కధానాయకుడు అంతెందుకు కులానికో దేవుడు ఉన్నాడు. ఆఖరికి ఈ పిచ్చ అమెరికాలో కూడా ఉన్నది అని, మొన్ననే ఆంధ్రజ్యోతిలో ఆర్కే చెప్పగా విన్నాను. ఈ కులానికి ఉన్న అందమైన పేరు సామాజిక వర్గం.
ఇహ ... ఈ శునకానందం అనేది ఒక విచిత్రమైన జబ్బు. దీని లక్షణాలు ఏంటంటే? ఈ జబ్బు వచ్చిన వాళ్ళు తమ అభిమాన కధానాయకుల మీద ప్రేమ కన్నా, గిట్టని కధానాయకుల మీద కోపం ఎక్కువ. అప్పుడప్పుడు వార్తల్లో ఇదే విషయం మీద తన్నుకొని తలలు పగల గొట్టుకొనే వాళ్ళ గురించి వింటుంటాం.
ఇంకొంతమంది తమ సామాజిక వర్గం కాని కధానాయకుల గురించి నీచంగా రాయటం, వాళ్ళ బొమ్మలే గాక వాళ్ళ కుటుంబ సభ్యుల బొమ్మలను కూడా చెండాలంగా మార్చటం లాంటివి చేస్తుంటారు. వీళ్ళే మన ఈ "శునకానందం" అనే శీర్షికకు కధానాయకులు. ఏ చదువు చట్టుబండలు లేని వాళ్ళు ఇలా చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు కుడా ఇలా చేస్తే, ఇంక ఆ చదువుకి అర్ధం ఏముంది?? ఇలాంటి వాళ్ళ వల్లనే ముఖం పుస్తకం మీద ముఖం మొత్తింది.
కొంత మంది ఉంటారు..... మా హీరో సినిమాకి ఇన్ని కోట్లు వచ్చాయి, ప్లాపు అయినా పాతిక కోట్లు వసూలు చేసింది, అని చంకలు గుద్దుకుంటారు, వీళ్ళకేదో డబ్బులు వస్తునట్టు. అందులో తప్పు ఏమి లేదు. ఎవరి అభిమానం వాళ్ళది.
ఉదాహరణకు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పాతికేళ్ళు ఖర్చుపెట్టి ఎంటెక్ దాకా చదివాడు. తనకు తన సామాజిక వర్గం అంటే ప్రాణం. తనవంతు సామాజిక బాధ్యతగా, మిగిలిన కదానాయకులందరినీ తిడుతూ ముఖం పుస్తకంలో చిత్రాలు పెడుతుంటాడు. అప్పటికీ ఒకసారి చెప్పి చూసా, "నీకు ఇష్టం కాబట్టి నీ కదానాయకుడిని నువ్వు పొగుడు, ఎవరూ వద్దనరు, మిగితా వాళ్ళ మీద పది ఏడవటం ఎందుకురా?" అని. కడుపుకి అన్నం తింటుంటే కదా వినటానికి. ఇలాంటి చేష్టల వల్ల ఇతరులకి ఎంత బాధగా ఉంటుందో కదా. కాబట్టి, ఇకపై పిల్లలు గడప తట్టుకొని పడితే, గడపను కొట్టకండి. ఓ చాక్లెట్, లేదా ఓ బిస్కెట్ కొని పెట్టండి.
ఇప్పుడు ఈ సోదంతా చెప్పటానికి గల కారణం, ఇదే విషయం మీద నేను ఒక చిన్న పల్లవి రాశాను. అది మీకు అంకితమిస్తున్నాను. "ఊసరవెల్లి" చిత్రంలో "నేనంటే నాకూ చాలానే ఇష్టం" అనే పాట రాగంలో.......
చిరు అంటే నాకు చాలానే ఇష్టం, బాలయ్యంటే ఇంకా ఇష్టం,
ఏ సినిమా అయినా చూస్తాను మొత్తం, హీరో ఎవరయితే నాకేం నష్టం,
గద పట్టి పిసికేసే ఏ చిన్ని కద అయినా, బాలయ్య లేకుండా మరి ఆడునా?
చిరు స్టెప్పు వేయించే ఏ చిన్ని ట్యూన్ అయినా చిరంజీవి లేకుండా పాడునా?
శునకానందం అనే శీర్షిక సమాప్తం
well said Ram anniyyaaa....
ReplyDeleteఅక్కడ కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారన్నది ఎంత వరకు నిజమో నువ్వు చెప్పాలి శివన్నా
Deleteహహహ! మీ శునకానందం (అంటే మీరు వ్రాసిన) చదివి చిన్నప్పుడు చదువుకున్న పాఠం ఒకటి గుర్తుకొచ్చింది. ఒకరిని గొప్పగా పొగడడానికి వారి వద్ద మంచి లేకపోతే వారికన్నా చెడ్డ వారిని చూపించి వీడంత వెధవ కాదు అని చూపిస్తారుట. అలా వీరికి కొంచెం మంచి లక్షనాలున్నట్టు కనిపిస్తాయి. బహుశా దానిని ఆధారంగా చేసుకునే వేరే వారిని ఎక్కువగా తిడతారేమో అనిపిస్తుంది. ఏ సినిమా అయినా చూస్తాను మొత్తం, హీరో ఎవరయితే నాకేం నష్టం బాగా చెప్పారండీ. ఏదయినా స్వామీజీ చెప్పాక కాదంటామా ;)
ReplyDeleteమంచి చెప్తే మీకు పాఠం లాగా ఉంది కదా??
Delete"మంచి సందేశం వుందండి"
ReplyDeleteఅదిరింది
ReplyDelete:)
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఎప్పుడు ఏ శీర్షిక చదివినా సమాజం మీద ఉన్న అభిప్రాయాన్ని రవి తేజ ఐతే ఎలా వ్యంగ్యంగా మాట్లాడతాడో , ఎంత ముక్కు సూటిగా మాట్లాడతాడో అలానే ఉంటుంది ....అభినందనలు...మీ కడుపు మంటని ఇలానే తీర్చుకోవాలని కోరుకుంటూ ......సురేష్ ఆలపాటి
ReplyDeleteదన్యవాదాలు సురేష్ గారు :)
DeleteIt's really good and reflection of reality.
Deleteబాగుంది..
ReplyDelete