Sunday, July 1, 2012

సైకిల్ తో తొలకరి


"కరిగా తొలకరిగా రసఝరిగా అణువణువొక చినుకవగా" అని రాశారు సీతారామ శాస్త్రి గారు. అంటే ఏంటో నాకు చిన్నప్పుడు అర్ధం కాలేదు (ఇప్పటికీ పూర్తిగా అర్ధం కాలేదు). ప్రస్తుతానికి ఆ మొత్తానికి అర్ధం పక్కన పెట్టి కేవలం  తొలకరి గురించి ఆలోచిద్దాం. ఈగ సినిమాలాగా, టి.వి లలో ఋతుపవనాలు ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి అని నెల రోజుల నుండి చెప్తూనే ఉన్నారు. రెండింటిలో ఏది ముందు వస్తుంది? వస్తే ఎన్ని రోజులు ఆడుతుంది అని అందరిలో ఉత్కంఠ నెలకొన్నది.

చివరకి అతి కష్టం మీద ఋతుపవనాలు వచ్చేశాయి. కానీ, ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంక ఈగ సినిమా అంటారా? ఇక  పోటీ, రాహులు బాబు పెళ్ళి, ఈ సినిమా విడుదల మధ్య ఉంటుందని చెప్పాలి. రెండింటిలో ఏది ముందు అవుతుందో?  వానాకాలం రొచ్చు, బురదా అని చికాకు పడతాము కానీ, అస్సలు ప్రకృతి  అందాలు చూడాలంటే ఈ తొలకరి సమయంలోనే చూడగలము.

రాష్ట్రంలో సైకిల్ పరిస్థితి ఏమంత బాగోలేదు, ఎలాగైనా సైకిల్ ని ఆదరించాలి అని, ఈ మధ్యనే రొజూ ఉదయం పూట సైకిల్ తొక్కటం ప్రారభించాను. పగలంతా ట్రాఫిక్ తో హోరేత్తిపోయే హైదరాబాద్  దారులన్నీ, ఉదయం పూట మాత్రం ప్రశాంతంగా, పారే గోదావరిని తలపిస్తాయి( ఏదో మాట వరసకు పోల్చా, అలా అని రోడ్డు మీదకు పొతే కొట్టుకుపోతారేమో అని భయపడకండి) . ఉదయాన్నే చల్లని గాలిలో,చిరు జల్లులలో తెలుగు సినిమాలలో వచ్చిన వర్షం  పాటలు వింటూ ఒక అరగంట సైకిల్ తొక్కుతుంటే మనస్సు, శరీరం రెండూ, రోజంతా ఉల్లాసంగా ఉంటున్నాయి. మీరు నమ్మరు గానీ, హైదరాబాద్లో ఊఠీని చూశాననుకోండి.  ఇదేదో బాగుంది అనిపించి, రెండు మూడు సార్లు కార్యాలయానికి కుడా సైకిల్ మీద వెళ్లాను.

"ఏంటి రామ్? సైకిల్ మీద వచ్చావా?"అని అడిగారు. సైకిల్ మీద వచ్చి సంచలనాలు శౄష్టించిన చరిత్ర మరచిపోయారో లేక సైకిల్ మీద ఇంకెవడూ రాలేడనుకున్నారో నాకు అర్ధం కాలేదు. "ఒళ్ళు తగ్గించటానికా?" అని కొందరు, స్టైల్ గా ఇంగ్లిష్ వచ్చినోళ్ళు "ఎకో ఫ్రెండ్లీనా రామ్?"అని కొందరు ( బహుశా  సైకిల్ ఎకో ఫ్రెండ్లీ ఆనేనేమో, అన్నగారిని ప్రజలు 1983లో గెలిపించింది), "డబ్బులు పొదుపు చేయటానికా? " అని ఎవరి అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు.

హైదరాబాద్ దారులలో సైకిల్ తొక్కితే, మన జీవితానికి అవసరమైన చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ దారులన్నీ కొండలు ఎక్కుతున్నట్టు, దిగుతున్నట్టు ఉంటాయి. సైకిల్ తో ఎత్తు ఎక్కేప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అంత  కష్టపడి ఎక్కాక  దిగేటప్పుడు హాయిగా ఉంటుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఇదే గుర్తు పెట్టుకోవాలి. ఆ కష్టకాలాన్ని ఓపికతో, దైర్యంతో, సైకిల్ తో మనం నెట్టుకు రాగలిగితే, ఆ తరువాత హాయిగా ఉంటుంది. చూశారా , సైకిల్ తొక్కితే నా జ్ఞాన బల్బు ఎలా వెలిగిపోయిందో??

ఎండాకాలం అంతా, వర్షాలు పడేదాక ఎండలు ఎండలు అని గగ్గోలు పెడతాం, తీరా వర్షాలు మొదలయిన నాలుగు రోజులకే వర్షాలను తిడతాం. వర్షం పల్లెవెలుగు బస్సు లాంటిది. అవసరం ఉన్నప్పుడు కురవక పోగా, అవసరం లేనప్పుడు దంచి కొడుతుంది. వస్తే వరదలు లేదంటే కరువు. ఈ సంవత్సరం అయినా వర్షాలు సరిగ్గా కురవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

10 comments:

 1. bhagundandi mee cycle yathra, konasaginchandi,
  thank you.

  ReplyDelete
 2. "జ్ఞాన బల్బు ఎలా వెలిగిపోయిందో??" -- :)

  ReplyDelete
 3. mookaalu kadilindi kadara andukey veligindemo.

  ReplyDelete
  Replies
  1. మూకలు కదలటం ఏంటా? అని నీ కవి హ్రుదయం అర్ధం కాక కాసేపు ఆలోచించా,మోకాలు కదలటం అని తరువాత అర్ధం అయ్యింది. నీ దగ్గర తెలుగు నేర్చుకోవాలని ఉందిరా? వీలుంటే నేర్పించు

   Delete
 4. Appude cycle ekkesava! :-)

  JB

  ReplyDelete
  Replies
  1. ఎక్కక తప్పలేదు జయంత్ :)

   Delete
 5. Replies
  1. nenu CM aite, edo oka murder case pettinchi, ninnu lopaliki toyistaa :P

   Delete