నేను క్రితం శీర్షికలో చెప్పినట్టు, రాహుల్ అన్న పెళ్ళితో, పెట్టుకోకుండా ఈగ వచ్చేసింది. అతి కష్టం మీద శనివారానికి ఒక టికెట్టు సంపాదించాను. ఉదయం పదకొండు గంటల ఆటకని తీసుకున్నాను. శని , ఆది వారాలు ఉదయాన్నే లేవటం అంటే మాటలు కాదు. నేను నిద్ర లేచేసరికి తోమిదిన్నర దాటింది. వారంతం అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మీకో విషయం చెప్పాలి. సాఫ్ట్ వేర్ వాళ్ళంతా (అంతా కాకపోయినా నా స్నేహితులు) వారాంతాలలో నాలుగంటే నాలుగే తింగులు (ఇంగులు) చేస్తుంటారు.
అవి వరుసగా 'స్లీపింగ్' , 'ఈటింగి', 'చాట్టింగ్', నాలుగోది అన్నింటికన్నా ముఖ్యమైనది 'నత్తింగ్'. ఇవి కాక నెల మొదట్లో 'షాపింగ్'అనే ఇంకో తింగ్ కుడా అదనంగా చేరుతుంది. అయినా ఈగ గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఇంగులు తగులుకున్నాయి. తొమ్మిదిన్నరకు నిద్రలేచి, పనులన్నీ ముగించుకొని, పలహారం తిని పదిన్నరకల్లా ఆటో ఎక్కాను. 'వర్షం రాకడ, ట్రాఫిక్ పోకడా'చెప్పలేమని ఊరికినే అంటారా? ఆ రోజు ఎందుకో రద్దీ ఎక్కువగా ఉంది.
ఇంతలో ఇద్దరు అమ్మాయిలు ఆటో ఎక్కారు. 'ఆడ లేడీస్ ఎక్కుతున్నారు, కాస్త సర్దుకో అన్న'అని ఆటో వాడు వాళ్లకి మర్యాద చేసి మరీ కూర్చోబెట్టాడు. ఇద్దరూ ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక అమ్మాయి తన ఫోనులోంచి ఏదో తన స్నేహితురాలికి చూపించింది. అది చూచిన ఈ స్నేహితురాలు "వావ్ చొ చ్వీట్" అన్నది. పాపం నత్తేమో అనుకున్నా. తరువాత అర్ధం అయ్యింది అది నత్తి కాదు నంగనాచి అని(అంటే అర్ధం నాకు తెలియదు, ప్రాస బాగుంది అని వాడా).
ఇంక ఆ గోల వినలేక, ఇయర్ ఫోన్సు తీసి పాటలు వినటం మొదలు పెట్టాను. ఇయర్ ఫోను వల్ల ఎన్ని లాభాలో కదా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అరగంటలో సినిమాకి చేరటం మీద నమ్మకం పోయింది. ఇంతలో ఆ అమ్మాయిలు ఆటోను ఆపమన్నారు. ఇద్దరూ దిగాక, ఒక అమ్మాయి తన గోను సంచిలోకి తల పెట్టి డబ్బులు వెతకటం మొదలు పెట్టింది. ఇంకో అమ్మాయి ఎంత అయ్యింది అని అడిగింది. ఆటో వాడు ఇరవయి రూపాయలు అని చెప్పాడు. అది విని, డబ్బులు వెతకటం ఆపి, సంచిలోంచి తల పైకి లేపి, "పద్దెనిమిది రూపాయలే కదా" అని ఆటోవాడితో గొడవకు దిగింది. "ఇందాకటి దాకా సోది చెప్పుకునే బదులు డబ్బులు తీసి పెట్టుకుంటే పోయేది కదా. ఎక్కడెక్కడి తింగరోళ్ళంతా నాకే కనపడతారు" అని మనసులో తిట్టుకున్నాను. మొత్తానికి ఆ ఆర్దిక లావాదేవి పూర్తి చేసుకొని ఆటో మళ్లీ బయలుదేరింది.
నేను వెళ్ళేసరికి పావుగంట ఆట అయిపోయింది. "రెడ్డొచ్చె మొదలెట్టె " అనుకోవటానికి ఇది రాజుల కాలం కాదు, నేను రెడ్డిగారిని అంతకన్నా కాదు. నాని బతికే ఉన్నాడు కాబట్టి 'ఈగ'ఇంకా రాలేదని అర్ధం అయ్యింది. నా పక్కన కూర్చున్న స్నేహితుడు, సినిమా చూస్తున్నంత సేపు, ప్రతి పది నిముషాలకు ఒకసారి, ఏదో కుట్టినట్టు అరుస్తాడు, మళ్లీ నిశబ్దంగా కూర్చుంటాడు. సినిమా అయిపోయాక ఏమైంది అని అడిగాను. "నొప్పి ఏమీ లేదురా, చెంప మీద చెయ్యి పెట్టుకొని అబ్బా అని అరిస్తే, సమంతా తెరలోంచి బయటకొచ్చి 'నీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా?' అని అడుగుతుందేమో అన్న ఆశతో అరిచానురా" అని చెప్పాడు.
రాజమోళి సినిమా అంటే చెప్పేదేముంది. చాలా బాగా తీశాడు. నాకు ఈ సినిమా చూడక ముందే చాలా అనుమానాలు వచ్చాయి. వాటన్నింటికి జక్కన్న సమాదానం చెప్పేశాడు. కాకపోతే ఆ ప్రతినాయకుడిని చూస్తేనే నాకు జాలి వేసింది. మనుషులనే నిముషాలలో చంపుతున్న ఈ రోజుల్లో, చిన్న ఈగని చంపటానికి ఎన్ని అవస్తలు పడ్డాడో బిడ్డ పాపం. ఈ సినిమా చూశాక, నాకు కుడా ఈగలంటే భయం వేస్తుంది. పోయిన జన్మలో దానికి ఏమైనా అపకారం చేస్తే పగబట్టి వచ్చిందేమో అని. ఇదే నిజమని జనాలు నమ్మితే, రేపటి నుండి పాముని చంపినట్టు, ఈగ కనపడ్డా నలుగురు గుమ్మికూడి కర్రలతో ఈగలను చంపుతారేమో? అస్సలే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి 900 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఈ సమంతా లాంటి అమ్మాయిలంతా ఈగలను దోమలను ప్రేమిస్తే,, నాలాంటి పెళ్లి కావాల్సిన వాళ్ళ పరిస్తితి ఏమికాను?
nanganaachi ante NANGE NAACHE ata nagnanga m naatyam chesevaaru ani. sigguleni vaarani . telugu lo inkolaa ipoyindi enduko.post super.
ReplyDeleteఅయ్యో, ఆ మాటకు అంత అర్ధం ఉన్నదా?? పోనీలెండి, వాడేశాము కదా, అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు.
Deleteచో చ్వీట్
ReplyDeleteధన్యవాదాలు ఫణిగారు
DeleteAdi nathi kaadu nanganaachi... :D
ReplyDelete-JB
ఈగను నువ్వు చూశావా జయంత్???
DeleteYea ikkada theatre lo vesaru one show! super movie!
Deletemanchi commedy
ReplyDeletebhale vaare . eega elaa vndo chepparenti?
ReplyDeleteఈగకేమండి, చక్కగా ఉంది
DeleteTomorrow i will see the picture defiantly.
ReplyDeleteతప్పక చూడండి.
DeleteDefiantly we will see the picture tommorrow
ReplyDeletebaava nuvvu trivikram srinivas ni edo oka roju thokkesthav chudu
ReplyDeleteతివిక్రమును తొక్కటం పక్కన పెడితే, నువ్వు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అని అర్ధం అయ్యింది.
Deletepani pata leni purushudu puranallo emi jarigindi ramayya ani adigadanta nee lantodu okadu ( enduku ila annav ra ani adakku coment cheyali anipincchi edo okati rasesa)
ReplyDeleteఅర్ధం కాకుండా చెప్తున్నావు, కొంపతీసి నువ్వు కూడక కిరణ్ అన్న బహిరంగ సభకు వెళ్ళొచ్చావా ఎంటి?
DeleteSuper !!!
ReplyDeletethnx :)
Deletesuper ananth
ReplyDeleteఎదో నీ అభిమానం వెంకటేష్
Delete