Saturday, October 6, 2012

పెళ్లి చూపులు

ప్రేమంటే కాదో ఫ్యాషన్, పెళ్ళికి అది స్టార్టింగ్ స్టేషన్ అని అన్నాడో సినీ కవి. ప్రేమించే మనస్సు ఉన్నవాళ్ళకి ఇది సరిగ్గా సరిపోతుంది, కానీ ప్రేమించే స్తోమత లేని నా లాంటి వాళ్ళ పెళ్ళికి స్టార్టింగ్ స్టేషన్ ఏంటి??? ఆలోచించండి? మీకు తట్టే ఒకే ఒక్క స్టేషన్ పేరు, పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల గురించే నేనిప్పుడు చర్చించబోతున్నాను.  

ఒక అబ్బాయికిగానీ, అమ్మాయికిగానీ పెళ్లి చేసేయాలి అని ఇంట్లో వాళ్ళు ఒక బలహీన క్షణాన అనుకుంటారు. వరసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ గొడవా లేకుండా కానిచ్చేస్తారు. వీళ్ళతో మనకు ఎలాంటి సమస్య లేదు. అలా ఎవరూ లేకపోతే, పిల్లలకు పెళ్లి చేయాలి  అన్న విషయాన్ని చుట్టపక్కాలకు దండోరా వేస్తారు, ఆంగ్లంలో వృత్తం పెద్దది అయితే, ఫలానా వాళ్ళ సంబంధం ఉందని చెప్తారు. ముందు ఫోటో చూపించి, ఆ తరువాత జాతకాలు చూపించి, నచ్చితే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. 

ఈ మధ్య కాలంలో అయితే, అబ్బాయినీ, అమ్మాయినీ ఏదో ఒక రెస్టారెంటులోనో , లేదంటే ఏదైనా ఉద్యానవనంలోనో కలవమంటారు. వాళ్ళు కలిసి, మాట్లాడుకొని, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని (చేసుకున్నాము అనుకోని) ఏదో ఒక విషయం తెల్చుతారు. వీళ్ళతో కూడా ఎటువంటి సమస్యా లేదు. 

ఇప్పుడు తరతరాలుగా చూస్తున్న పెళ్లి చూపుల దగ్గరకు వెళ్దాం. సినిమాలలో చూపించినట్టు, ఏదో ఒక శనివారమో, లేదో ఆదివారమో, అమ్మాయి ఇంటికి (ఉంటే సొంత కారులో లేదంటే అద్దె కారులో) వెళ్తారు. ముందు తిను బండారాలు రావటం, తర్వాత అమ్మాయి రావటం ఇలా, సినిమాల్లో చూపించినట్టే జరిగిపోతుంది. మధ్య మధ్యలో నా లాంటి వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కూడా వినపడుతుంటాయి. ఎవరో ఒక పెద్ద మనిషి కలగ చేసుకొని, అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోనివ్వండి అని చెప్తారు. ఇద్దరికీ కాసేపు ఏకాంతాన్ని ప్రసాదిస్తారు. 

ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అప్పటిదాకా  ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని, పది నిముషాలు మాట్లాడి నచ్చిందో లేదో చెప్పటం సాధ్యమేనా? అలాగని గంటలు గంటలు మాట్లాడాలి అని అడగలేము కదా. అస్సలు ఆ పది నిముషాలు అయినా ఏమి మాట్లాడాలి? అందునా నా లాంటి భయస్తుడు, నోట్లో నాలుక లేని అమాయకుడు ఏమని మాట్లాడగలడు చెప్పండి? ఎలాగూ పెళ్లి చూపులకు ముందుగానే ఇద్దరి వివరాలు చెప్పేస్తారు. ఇంకా అడగటానికి ఏముంటుంది? తెలిసి కూడా అడిగితే పిచ్చి అనుకుంటారు. అలాగని అడగకుండా కూర్చుంటే మెతక అంటారు.

పోనీ పాటలు పాడటం వచ్చా? వంట చేయటం వచ్చా? లాంటి ప్రశ్నలు సినిమాలల్లో బాగుంటాయి కానీ, నిజ జీవితంలో బాగుండవు అని నా అభిప్రాయం. పోనీ మీ అలావాట్లు ఏంటి? అని అడిగితే, నిజాలు చెప్తారు అన్న నమ్మకం ఏమీ లేదు కదా? నేనైతే చెప్పను, అస్సలు అలా చెప్పగలిగే మంచి అలవాట్లు కూడా లేవనుకోండి, అది వేరే విషయం. ఇంక లాభం లేదనుకొని, ఈ విషయంలో పెద్దల సలహా తీసుకుంటే మంచిదనిపించి, చాలా మందిని, చాలా పెళ్లి చూపులు అయిన వాళ్ళని వాకబు చేశాను. " రాత్రి తిన్న కూర పేరే గుర్తు లేదు, ఎప్పుడో జరిగిన పెళ్లి చూపులు ఎవడికి గుర్తుంటాయి?" అని కసురుకున్నారు. ఇంకొంత మంది, " పెళ్లి చూపులలో అబ్బాయిలు మాట్లాడే రోజులు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు కేవలం అమ్మాయిలు మాట్లాడితే వినటమే" అని చెప్పారు. కనీసం ఆ అమ్మాయిలు  ఏమి మాట్లాడతారో చెప్పమని అడిగాను. " నీ అదృష్టం బాగుంటే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నట్టు చెప్తారు. ఇంకొంతమంది, వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటో చెప్తారు. అప్పుడు నీ స్థాయి ఏంటో ఆలోచించుకొని, పెళ్ళా? లేదంటే ఇంకో పెళ్లి చూపులా? అనే విషయం తేల్చుకోవాలి." అని చెప్పారు.

మీరు ఈ విషయం మీద ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే మిక్కిలి సంతోషిస్తాను. ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఈ విషయం మీద  ఇంకా ఆలోచించాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇంకో శీర్షికలో చూద్దాం. నాకు పెళ్లి అయిందాకా ఈ కష్టాలు తప్పవు మరి.

28 comments:

  1. "Abbaiki ammayiki pelli cheseyali ani oka balaheena kshanam lo peddalu nirnayistaru!" :D

    --JB

    ReplyDelete
    Replies
    1. nee pelli choopulu ela jarigayo cheppava JB :P

      Delete
    2. Aatma hatya maha papam! parula hatya inka pedda papam!
      oche nelalo prapanchakam munigi poka pothe aaa pai samvatsaram lo nenu munigi podam ani nischayinchukunna!

      Delete
    3. nenu adigindi enti? nuvvu cheptunnadi enti???

      Delete
  2. ఇప్పుడు ముందులా పెళ్ళిచూపులు అవి అంతగా జరగడంలేదని నా అభిప్రాయమండి.

    ReplyDelete
    Replies
    1. @Padmarpita gaaru: అంతగా జరగని మాట నిజమేకానీ, కొంత వరకు ఉన్నాయి కదా అని రాసాను.

      Delete
  3. "ప్రేమించే స్తోమత లేని నా లాంటి వాళ్ళ పెళ్ళిక" ఈ వాక్యంలో ఏంటో నాకు నానా సందేహాలూ వస్తున్నాయి ;)
    హహహ! నాలుగయిదు పెళ్లి చూపులకెళ్ళి మీరే నాకు చెప్పండి ఎలాంటి ప్రశ్నలడిగి అమ్మాయిలని సెలెక్టు చేసుకుంటారో ;) మనలో మన మాట, ఇప్పుడా పని మీద ఉన్నారా ఏంటి??

    ReplyDelete
    Replies
    1. @రసఙ గారు : ప్రేమించే స్తొమత లేదనటానికి , చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకేలేను :P. నాకు పెళ్ళి చూపులు జరిగితే ఆ అనుభావాలు ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. మొదలుపెట్టమని చెప్పాలి

      Delete
  4. Replies
    1. ధన్యవాదాలు అన్నా

      Delete
  5. anni vivaralu thelusukune velthanantunnaruga anduke oke okka prasna adigeyandi nenu nachchana ani apai em jarigindo matho cheppadam marichi pokande:-)

    ReplyDelete
    Replies
    1. aa maatram adagataaniki pelli choopulu daaka endukandi, photo choosi cheppeste potundi kadaa

      Delete
  6. Baga rasav ram... neeku evarina suchanlu salahalu isthe naku kuda chepu... panikosthayi... :)

    ReplyDelete
    Replies
    1. @లొకేష్ : తప్పకుండారా!! ఇలాంటి వాటికి మనకు ఙానబదిలీలు(knowledge transfer) ఎంతైనా అవసరం

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు నారాయణ స్వామిగారు :)

      Delete
  8. ఉచిత సలహా: ప్రేమించి పెళ్ళి చేసుకోండి.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే ఉన్నది. నేను ఎంతో మందిని ప్రేమించానండి, నన్నే ఎవరూ ప్రేమించలేదు, ప్రేమించటం లేదు.

      Delete
  9. First pelli choopullo Time entha ayindi ani adagandi,ala mata kalapandi

    ReplyDelete
    Replies
    1. ela maata kalapatam anedi samasya kaadu, meeru sarigga ardham chesukunattu leru

      Delete


  10. 1) నీ అదృష్టం బాగుంటే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నట్టు చెప్తారు - Just awesome.

    2) నేను ఎంతో మందిని ప్రేమించానండి, నన్నే ఎవరూ ప్రేమించలేదు! (Me, Same Case)

    3) ప్రస్తుతానికి అయితే ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. మొదలుపెట్టమని చెప్పాలి - Mind blowing.

    Your thought process is hilrious.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుజాతగారు

      Delete
  11. luckyga naku ganta muppai nimishaalu maatlaade avakaasam dorikindi

    ReplyDelete
    Replies
    1. అంత సేపు ఏమి మాట్లాడారండి బాబు? జీవిత చరిత్ర అంతా చెప్పినా పావుగంటకు మించి పట్టదు

      Delete
  12. aa time lone unna meekunna telivi tetalu upayoginchi ame gurinchi telsukovaali.. if u can understand her regular lifestyle, u can more or less judge is she is right for u or not.. ofcourse maree interview laa kaakundaa ame gurinchi telsukovadaniki maximum try cheyandi.. naalaaga andarikee ganta time ivvaranukondi.. but u can try to insist to get atleast 20 min.. :)

    ReplyDelete
    Replies
    1. abooo anni telivitetalu unte, nenu ila blogulu enduku raastanu,

      Delete
    2. meku ani telivitetalu unnavi kabatte meru blog pettaru sir.

      Delete
  13. pelli choopulanevi mana sampradayam alane jaragali peddavallu cheptaru ga ammai elantidi vala family gurinchi koda telsukone anta manchi valu ante ne veltaru ga pelli chopulaki so meru a village lo unna evarinaina adigite a ammai character ento easy ga telsi poddi endukante villages lo prati chinna vishayam telispotundi love lantidi edaina unna telsipotundi naku telsi inte. peddavallu cheppina mata vinadame manaku manchidi.

    ReplyDelete