Wednesday, October 31, 2012

మూడో అడుగు

అక్టోబరు 31 2010, మొదటి సారిగా నేను బ్లాగిన రోజు. ఈ బ్లాగు రాయటం మొదలెట్టి రెండు సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఇది వరకే ఆరంభ శూరత్వంలో చెప్పినట్టు, నాకున్న ఆరంభ శూరత్వానికి రెండేళ్ళ పాటు రాస్తాను అని అనుకోలేదు.రెండేళ్ళలో ఇప్పుడు రాస్తున్న దానితో కలిపి ఎనభై రెండు టపాలు. అంటే శతకానికి చాలా దగ్గర అనమాట!!!

ఎన్ని రాశానన్న దానికన్నా, ఎంత రాశానన్న దానికన్నా, ఎమి రాశానో చూసుకుంటే సంతృప్తిగానే అనిపిస్తుంది. నేనేదో "ఆంధ్ర మహాభారతాన్ని" తెలుగులోకి రాసినట్టు చెప్తున్నానని మీకు అనిపిస్తే క్షమించాలి. ఈ సంధర్భంగా, నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు, శిష్యులందరికీ అశీస్సులు తెలియజేసుకుంటున్నాను.  ఈ బ్లాగు ద్వారా కొన్ని పరిచయాలు, స్నేహాలు ఎర్పడ్డాయి. జయంత్, కృష్ణా, నాగార్జున ఇలా..., చాలా మంచి స్నేహితులు ఏర్పడ్డారు.

మీకు ఈ సందర్భంగా ఒక శుభవార్త చెప్పాలి. ఇక మీదట నేను శీర్షికలు రాయటం ఆపేస్తున్నాను అనుకుండేరు!! అదేమీ కాదు. తొండ ముదిరి ఊసరవల్లి అయ్యినట్టు, చిన్న చిన్న శీర్షికలతో మొదలుపెట్టి, నవల రాసే దాకా వచ్చాను. రెండు మూడు నెలలు కింద, పైన కూర్చొని ఎలాగోలా ఒక నవల పూర్తి చేశాను. 

ఒక సాఫ్ట్ వేర్ కార్యాలయంలో, కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కధను, నాకు తోచినంతలో చూపించే ప్రయత్నం చేశాను. వంద కాగితాలకు సరిపడా రాశాను. తీరా రాశాక అనుమానం వచ్చింది, అస్సలు ఇది ఎవరికైనా అర్ధం అవుతుందా? అని. ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు చూపించాను. వాళ్ళు మొహమాటం కొద్దీ అద్భుతంగా ఉందని కాకుండా నికచ్చిగా కొన్ని మార్పులు చెప్పారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చివరకు కధను ఒక కొల్లిక్కి తెచ్చాను. ఇంకొ నెల రెండు నెలలలొ దానిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ నవల చదివాక, అందరూ నన్ను "నవలా రచయిత అనంతరామయ్య" అని పిలవటం మాత్రం మర్చిపోకండే!!!!

ఈ బ్లాగు రాయటంలో మూడో అడుగు వేస్తూ.... సెలవు 

9 comments:

  1. శుభాకాంక్షలు రామ్ అన్నయ్య .....నీ నవల విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా ...

    ReplyDelete
    Replies
    1. @ శివ అన్న : ధన్యవాదాలు తమ్ముడు

      Delete
  2. Thonda mudiri oosaravelli ayinattuu... :D

    nee navala kosam kaachuku kurchunna... ;)

    ReplyDelete
    Replies
    1. నీ సంతకం లేకపోయినా, నువ్వు చేసే వ్యాఖ్యలను నాకు తెలుసు జయంత్

      Delete
    2. కాకపోతే ఒకటే ఆలోచిస్తున్నాను, నీకు ఆ నవలను ఎలా పంపాలా అని?? జర్మనీలో తెలుగు నవలలు అమ్మరేమో???

      Delete
    3. నవలా రచయిత, గ్రంద కర్త, వేద పడితులు మా అనంతరామయ్యగారూ, నవ్వి ,నవ్వి ఇక నవ్వలేక, పైన చెప్పిన బిరుదులతో మిమ్ము (మా తమ్ముళ్ళుంగార్లైన ) సత్కరిస్తున్నాను.

      Delete
    4. ఫాతిమాగారు : ఫ్లోలో తమ్ముడిని ఎక్కువ పొగిడేశారు :)

      Delete