నిన్న తోచక టి.విలో చానెళ్ళు మారుస్తుంటే, "మౌనమేలనోయి, ఈ మరపురాని రేయి" అనే పాట వస్తున్నది. మొదలే నేను భాను ప్రియ అభిమానిని, అమె చిత్రాలు విడుదల అయిన మొదటి రోజే చూసేవాడిని (ఎదో మాట వరసకు అన్నాను కానీ, నేను పుట్టాక ఆమె తెలుగులో నటించటం ఆపేసింది). భాను ప్రియ పాట కావటంతో ఆ పాటలో లీనం అయ్యి చూస్తున్నాను. చివర్లో తెలిసింది ఏంటంటే ఆమె పేరు భానుప్రియ కాదు, జయప్రద అని. పేరు ఎదైతేనేమి? మనకు మనిషి ముఖ్యం.
ఆ పాటలో జయప్రదను చూశాక, చాలా రొజుల తర్వాత 'ఒక అందమైన అమ్మాయిని చూశాను' అన్న అనుభూతి కలిగింది. ఇవాళ్టి రోజున "అమ్మాయిలం" అని కొంతమంది చెప్తే తప్ప, వాళ్ళు అమ్మాయిలని అర్ధం కాని పరిస్థితి. ఒక రాతి రధం పక్కన, కమల్, జయలిద్దరూ ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు. కమల్ తనని చూస్తే జయ తల పక్కకు తిప్పుకుంటుంది, జయ చూస్తుంటే కమల్ తల పక్కకు తిప్పుకుంటాడు. ఆ దృశ్యం చాలా తమాషాగా అనిపించింది. బహుశా అలా తలలు తిప్పీ తిప్పీ నొప్పి పుట్టిందేమో, ఇద్దరూ కలిసి జయప్రద ఇంటికి బయలుదేరుతారు.
ఇక్కడే ఒక చిన్న దృశ్యం నన్ను కట్టిపడేసింది. జయప్రద ఇంటికి చేరాక, ఆమె నాలుగు మెట్లు ఎక్కి వెనక్కి తిరిగి చూస్తుంది, ఒక అడుగు వెనక్కి వేస్తూ. కమల్ "నేనింక ఇంటికి వెళ్తాను" అనట్టు తల ఊపుతాడు. కమల్ ని కూడా ఇంట్లోకి పిలవాలని ఉన్నా, పిలవలేక, ఎదో చెప్పాలని నోరు తెరిచి, చెప్పలేక ఆగి పొతుంది. "అప్పుడే ఇంటికి వెళ్తావా?" అన్నట్టు జయప్రద ఇచ్చిన ఆ ముఖ కవళిక నిజంగా అధ్బుతం అనిపించింది. అప్పుడు అర్ధం అయ్యింది, విశ్వనాథ్ గారిని అంత గొప్ప దర్శకుడని ఎందుకు అంటారో!!!! ఆ ఒక్క ఐదు క్షణాల దృశ్యం కోసం, ఆ పాటని యూట్యూబ్ లో ఎన్ని సార్లు చూశానో.
అప్పటిదాకా అంత చక్కగా చూపించి,ఆ వెంటనే జయప్రద తన్మయత్వంతో స్నానం చేసే దృశ్యాన్ని చూపించారు(అలా చూడటం తప్పని కళ్ళు మూసుకున్నాను). విశ్వనాథ్ గారు ఇలా ఎందుకు తీశారో అని అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని మా సుబ్బన్నని అడిగితే " ఆయన దర్శకత్వం చేస్తుంటే, కమల్ ఎమైనా వేలు పెట్టాడెమో ?" అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ రొజుల్లొ కధానాయకులకు అంత స్వేఛ లేకపొబట్టేనేమో, కొన్ని అయినా మంచి చిత్రాలు తీయగలిగారు.
మళ్ళీ పాటలోకి వద్దాం. ఆ పాటలొ జయప్రదని ఎంత అందంగా చూపించారో!! "సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట" అంటూ వెనెల్లో జయప్రదను పువ్వుతో పోల్చిన తీరు నాకు బాగా నచ్చింది. పాట చివరకు జయప్రద సొఫాకు తలాంచి కూర్చున్న భంగిమ ఎంత చూడముచ్చటగా ఉంటుందో మాటలతో చెప్పలేను. పాట అంతా చూశాక అనిపించింది ఏంటంటే? ఈ పాటను మళ్ళీ ఎవ్వరూ తీయకూడదు అని. జయప్రద స్నానం చేసే సన్నివేశంలో కూడా అశ్లీలత అనిపించకుండా, కనిపించకుండా తీయటం బహుశా విశ్వనాథ్ గారికే చెల్లిందేమో? ఈ పాట ఈ రొజుల్లొ తీస్తే కళ్ళు మూసుకొని చూడాల్సి వస్తుందేమో అని నా అనుమానం.
ఇంతా చెప్పి మా గురువుగారి గురించి ప్రస్తావించక పొతే మహా పాపం. "పలికే పెదవే ఒణికింది ఎందుకో? ఒణికే పెదవి వెనకాల ఏమిటో?" ఇంత సుందరంగా వేటూరి సుందరరామూర్తి గారు గాక ఇంకెవరు రాయగలరు? జానకిగారు, బాలుగారు గాక ఇంకెవరు పాడగలరు? ఇళయరాజ గురించి వేరే చెప్పేదేముంది? విశ్వనాథ్ గారి గురించి చెప్పాలనుకుంటే, ఒక్క పాటతోనె సరిపోయింది. ఇంకో శీర్షికలో ఇదే విషయం మీద కూర్చుందాము. అంత వరకు సెలవు.......
"ఆయన దర్శకత్వం చేస్తుంటే, కమల్ ఎమైనా వేలు పెట్టాడెమో"
ReplyDeleteకమల్‌హాసనో లేక ప్రడ్యూసరో అయుంటాడులెండి :-) ఒకవేళ విశ్వనాథ్ గారే కమర్షియల్ వ్యాల్యూ ఉండాలి అని తీశారేమో :(
@భాస్కర్ గారు: ఆయన చిత్రాలు ఎలాగూ చూస్తారు గనుక అలాంటివి ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు. మీరనట్టు బహుశా నిర్మాతలు ఒత్తిడి చేశారేమో???
DeleteChaala bagundhi Bhayya
ReplyDeleteధన్యవాదాలు నాగార్జున
DeleteNice one Ram...Sagara Sangamam my all time favourite movie...Enni sarlu chusano naake gurtu ledu...the great vishwanath garu navarasalu palikinchina adbuta chitram...
ReplyDeleteఅవునన్నా, నిజంగా అదొక అధ్బుత చిత్రం
DeleteYedalo vennela,
ReplyDeletevelige kannula,
taarade haayilaa...
Himame kurise chandamama kougita.,
Sumame virise vennelamma vaakita.... :)
--JB
@జయంత్: పోలా... అదిరి పోలా???
Deleteఅద్దంకి అనంతరామయ్య గారూ, ఆ సన్నివేశాన్ని అలా ఎందుకు తీశారో ఆయనే చెప్పారు ఒకసారి. ఒక పవిత్రమైన, ఉదాత్తమైన మహిళ తన భావాలని బాత్రూం లో తప్ప ఇంక ఎక్కడ రహస్యం గా వ్యక్తపరచగలదు అందుకే అలా తీశాను అన్నారు. అది కూడా అసభ్యం గా లేకుండా తీశారు. ఇలాంటిదే ఆపద్భాంధవుడు లో మీనాక్షి మీద కూడా తీశారు ఒక సన్నివేశం.
ReplyDelete@ మాధవ్: ఓహో అవునా? నిజమేనండి, ఎక్కడా అశ్లీలత అనిపించదు, కనిపించదు. ఆయన ఆలోచించకుండా ఎందుకు తీస్తారులేండి?
DeleteAnnayya.. ilaanti songs K Viswanath gaari movies at least okati untundi anukuntunna.. oka Subha Sankalpam, oka Swathi Mutyam, oka Sagara Sangamam..
ReplyDeleteఒకటి, రెండేమి??? ప్రతి పాట కూడా వీనులవిందుగా ఉంటుంది.
DeleteTHAMMUDU, NUV CHESE JOB KI RAASE MAATALAKI EMANNA SAMBANDHAM UNDHA? INTHA TALENT INNALLU EVARU THOKKESAARU?
ReplyDeleteRNEC ONGOLE VAALLA?
@శ్రీధర్ బాబు: నాలుగేళ్లు మీతో కలిసి తిరిగితే, ఎవరూ గుర్తించలేదు., ఒక రకంగా నువ్వే తొక్కెశావు
Deletenenem chesaanu raa abu? naa meedha paddav...........
Deleteఏమీ చేయలేదనే చెప్తున్నాను.
Deleteఇంత సుందరంగా వేటూరి సుందరరామూర్తి గారు గాక ఇంకెవరు రాయగలరు? జానకిగారు, బాలుగారు గాక ఇంకెవరు పాడగలరు? ఇళయరాజ గురించి వేరే చెప్పేదేముంది? అన్నారు.
ReplyDelete"అలా తలలు తిప్పీ తిప్పీ నొప్పి పుట్టిందేమో, ఇద్దరూ కలిసి జయప్రద ఇంటికి బయలుదేరుతారు"...ఇలా అద్దంకి అనంతరామయ్య గారు తప్ప మరెవరు సమీక్షించగలరు? అనిపించింది నాకు.
సమీక్ష, వ్యాఖ్యలూ అన్నీ బాగున్నాయి. మరోసారి అభినందించక తప్పడం లేదు.
ఆకునూరి మురళీకృష్ణ.
ధన్యవాదాలు మురళీ కృష్ణగారు :)
Delete