Monday, February 25, 2013

బాలు, నీకు ఖాయం జైలు

బాల సుబ్రహ్మణ్యాన్ని జైలులో పెట్టాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దానికి కారణం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బుదవారం టి.వి లో వచ్చే పాటల కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంతా బాగానే ఉంటుంది కానీ, వాళ్ళు ఇచ్చే మార్కులే, వేలల్లో ఉండటం కొంచం అతి అనిపిస్తూ ఉంటుంది. 

ఒక రోజు అదే కార్యక్రమం చూస్తుంటే "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాట పాడారు. గురువుగారి పాట, అందునా జాతీయ బహుమతి గెలిచిన పాట కావటంతో జాగ్రత్తగా విన్నాను. కొన్ని నోడ్స్ డైరెక్ట్ గా హిట్ చేయలేదు. శృతి కొన్ని చోట్ల షార్ప్ అయ్యింది. టెంపో అక్కడక్కడ మిస్ అయ్యింది. అతి కోకీల అక్కాయి చెప్పినట్టు ఇంకొంచం పెప్పీగా ఉండచ్చు. సరే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే మొత్తానికి బాగానే పాడారు. 

కాకపోతే ఆ పాట మొదలైన కాసేపటికే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారు. అది చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే ఏమో అనుకోవచ్చు, కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసరికి నాకు మొదట నవ్వొచ్చింది. అస్సలు ఒక పాట అంతలా ఎక్కిళ్ళు పెట్టి ఏడిపించగలదా?? మీరు ఎప్పుడైనా పాటకి ఏడ్చారా?  

మనస్సు కొంచం బాగోలేక (నేను మనిషినే, నాకు కూడా మనోభావాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు దెబ్బ తింటుంటాయి)  యూట్యూబ్ లో, ఇదే కార్యక్రమం చూస్తుంటే, బాలుగారు సినిమాలో పాడిన "హాయి హాయి వెన్నెలమ్మ హాయి" అనే  పాట పాడటం విన్నాను. ఇదివరకు ఈ పాటను, అతి కోకిల అక్కాయి(ఎవరో అర్ధం కాకపోతే నేనేమి చేయలేను) బాలు గారితో చేసిన  ఒక కార్యక్రమంలో, బాలుగారు ఈ పాట పాడగా విన్నాను. వెంటనే బాలుగారు సినిమాలో పాడిన పాటను దిగుమతి చేసుకొని విన్నాను, విన్నాను, అలా వింటూనే ఉన్నాను. మీరు కూడా ఒకసారి తప్పక వినాలి.  ఇది వరకే వినుంటే నా అజ్ఞానాన్ని మన్నించాలి. 

ముఖ్యంగా ఆ పాట , బాధలో ఉన్న ఎవరికైనా సేద తీర్చగల పాట.  

హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి,  హాయి హాయి..., హాయి..., హాయి...,
తియ్య తియ్యనైన పాట పాడనీయి, బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయము చేయమని 
చలువ కురిపించని  ఇలా ఇలా ఈ నా పాటని 

ఎంత బాగా రాశారు శాస్త్రిగారు?? బాధ కలిగించే మంటకు మందును పూసి, చిటికెలో కలతను మాయము చేయమని, అబ్బబ్బబ్బబా  పాట వింటుంటేనే బాధ ఎటుపోయిందో అర్ధం కాలేదు.  ఇదే అనుకుంటే చరణాలు మరీను. 

కనులు తుడిచేలా, ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా, సేవ జేసి సేద తీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది, పొందని నెమ్మది
అని తలచే ఎద సడిని పదమై పలికి మంత్రం వేయని
ఈ పాటని ఈ పాటికి ఓ ఐదు వందల సార్లు వినుంటా!! వెయ్యికి పరుగులు తీస్తున్నా!! ఈ బాల సుబ్రహ్మణ్యం మనల్ని పనులు చేసుకోనివ్వడా?? వేటూరి గారితో అయితే ఒక రోజు అనుకున్నా, ఇతగాడి గురించి రాయాల్సి వస్తే, నిముషానికి అరవై పాటలు గుర్తుకొస్తాయి. అందుకే గుండె అనే జైలులో మనందరికీ ఎప్పుడో బందీ అయిపోయాడు. 

ఇంతకీ నేను ఏ బాధలో ఉండి ఈ పాటను విన్నానో అని ఎవరికైనా తెలుసుకోవాలనుందా??? చెప్పిన ముఖ్యమైన విషయాలన్నింటిని వదిలేసి, ఇటువంటి అనవసరమైన విషయాలను అడిగేవాళ్ళని ఏమంటారో, జల్సా సినిమాలో ఇంకో సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పారు.   


19 comments:

  1. ఇంతకీ ఇక్కడ అవసరమైన విషయం మంచి పాట అందించారు, మాకు ఇంత చెత్త చెప్పడం అవసరమా?

    ReplyDelete
    Replies
    1. ప్రసాదు గారు: ఆ కొంచం చెత్త కూడా లేకుండా, "ఈ పాట బాగుంది, వినండి" అని ఒక్క ముక్కలో చెప్తే ఏమి బాగుంటుంది చెప్పండి. నాకు అస్సలు బాగుండదు

      Delete
  2. నచ్చలేదు Ram :(

    ReplyDelete
  3. అతికోకిల అక్కాయి .. కేక! పాపం మా బుధవారం వాళ్ళు కూడా ఒక్కో పాటకీ వందల్లోనే ఇస్తారు మార్కులు. ఎప్పుడో ఆర్నెల్లనించీ జరుగుతోంది కదా, అలా కూడుకుని కూడుకుని, చివరకి సాగర్ గానికి లెక్కెయ్యడం చేతగాక పొడి అంకెలు చెప్పేటంత పెద్దవైపోయాయి. :)

    ReplyDelete
    Replies
    1. నారాయణ స్వామి గారు : ఆ అంకెలు బట్టీ పట్టలేక పాపం ఎన్ని అవస్తలు పడుతున్నాడో సాగర్ అన్నియ్య. లక్ష ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.

      Delete
  4. అద్దంకి వారు ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు....!!!

    ReplyDelete
    Replies
    1. నేను అంతే, అప్పుడప్పుడు శృతి తప్పుతుంటాను :)

      Delete
  5. కథలు చాల బాగునాయీ నేను ప్రతి కథ చదువుతునన్ను అల్ ది బెస్ట్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మారుతీ కుమార్

      Delete
  6. చాలా బావుందండి... మంచి పాట గుర్తు చేసారు .... ధన్యవాదాలు ....



    సుదీర్
    http://techwaves4u.blogspot.in
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు...

    ReplyDelete
  7. ధన్యవాదాలు సుదీర్ గారు

    ReplyDelete
  8. Addanki gariki chaturlu matrame yekkuva anukunnanu, meeru maaku oka manchi patanu gurtu chesi meeku manchi kuda yekkuve ani nirupinchukunnaru.

    ReplyDelete
    Replies
    1. హహహ... ధన్యవాదాలు గురుప్రసాద్ గారు

      Delete
    2. pata chala bagunndi,

      Delete
  9. hey Ram... Atikokila akkayya evaru..

    ReplyDelete
    Replies
    1. కోకిల అంత బాగా పాడుతూ, ప్రతి దానికి అతి చేసే గాయని, రాష్ట్రంలో ఒక్కళ్ళే ఉన్నారు

      Delete
  10. Ati kokila akkayi - mee creation leka Narayana swamy garida?

    ReplyDelete
    Replies
    1. అతి కోకిల అక్క విషయంలో, క్రెడిట్ అంతా నాకే ఇవ్వాలి అండి, KKK మాత్రం నారాయణ స్వామిగారి ఖాతాలో పడుతుంది

      Delete