Sunday, February 3, 2013

వేటూరిగారితో ఒక రోజు

ఉదయాన్నే నిద్రలేచి మేడ మీద నిలబడి చూస్తే, మొత్తం పొగ మంచుతో కప్పేసి ఉంది. చలికాలం ఒంటికి చలి కోటు ఉండనే ఉన్నది. ఆ మంచు చూసి, నా గదిలోకి వెళ్లి ఒక శాలువా కప్పుకొని బయటకు వచ్చి "ఆమని పాడవే హాయిగా., మూగవై పోకు ఈ వేళా" అని ఎవ్వరికీ వినపడకుండా మూగగా పాడుకున్నాను. కార్యాలయానికి పోయే కాలం దగ్గర పడటంతో స్నానానికి వెళ్లాను. నీళ్ళను చూడగానే గోదావరి, గోదావరి సినిమా, ఆ సినిమాలో పాటలు వెనువెంటనే గుర్తుకు వచ్చేశాయి.

స్నానం చేసి పూజకి కూర్చొని "అస్త్రాయ ఫట్" అనే మంత్రం దగ్గరకు వచ్చే సరికి "నంది కొండ వాగుల్లో" పాట గుర్తుకొచ్చి తెగ ఇబ్బంది పెట్టేసింది. ఇంటి బయటకు రాగానే, ఇంటి ముందు "నందివర్దన" చెట్టుకి రాలి పడిపోయిన పూలను చూసి "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?" అని అడిగాను.

కార్యాలయంలోకి రాగానే "సునేత్ర" అని నా స్నేహితుడు ఎదురు పడ్డాడు. అదేదో విచిత్రం పేరులో మాత్రమే వీడి కళ్ళు బాగుంటాయి. కళ్ళజోడు తీస్తే ఏమీ కనపడదు. ఉద్యోగం చేయటానికి కలకత్తా నుంచి కళ్ళేసుకొని వచ్చాడు. వాడిని చూడగానే, "యమహా నగరి, కలకత్తా పూరి" అని చిరు త్యాగరాజు లాగా పాడుకున్నా. కంప్యూటర్ తీసి చూస్తె, స్నేహితుడు ఒకడు తన పెళ్లి శుభలేఖ పంపాడు, "శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో" పాత పాట  అని పాడుకున్నా. ఇంతలో ఒకమ్మాయి పుట్టిన రోజని చాక్లెట్లు తీసుకు వచ్చింది., అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజనుకున్నాను.

మెల్లగా పనిలో మునిగిపోయాను. కాసేపటికి కొంత మంది పైనోళ్ళు హిందీలో ఏదో గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే నాకు "ఇదేదో గోలగా ఉంది" అనిపించింది. కాసేపటికి వేణు అని నా స్నెహితుడు ఫొను చేశాడు, "వేణువై వచ్చాను భువనానికి..." అనే పాట గుర్తొచ్చింది.

భోజనానికి వెళ్ళేసరికి వంకాయ కూర స్వాగతం పలికింది. "ఆహా ఎమి రుచి, అనరా మైమరచి, తాజా కూరలలొ రాజా ఎవరంటే?? ఇంకా చెప్పాలా?? వంకాయేనండి". అన్నం తిని చల్లగాలి పీల్చుకోవటానికి కార్యలయం బయటకి వచ్చాను. ఒక అందమైన అమ్మాయి ఎదురుపడింది. తనను ఎక్కడో చూసినట్టు గుర్తు, "బహుశా తనని బందరులో చూసి ఉంటా!"

సాయంత్రం కార్యాలయం నుండి బయలుదేరి వస్తుంటే, అస్తమిస్తున్న ఎర్రని సూర్యుడిని చూడగానే "అకాశాన  సూర్యుడుండడు సంధ్య వేళకే" అని అర్ధం అయ్యింది.ఆ రోజు పౌర్ణమి తర్వత రెండో రోజు అనుకుంటా, వెన్నెల ధార కురుస్తున్నది. "ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ","మౌలమేలనోయి ఈ మరపు రాని రేయి","వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా?","మల్లెలు పూసే, వెన్నెల కాసే","కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి"ఇలా ఎన్నో పాడుకున్నాను.ఇలా ఒక రోజులో, వేటూరిగారి కలం నుండి జాలువారిన ఎన్నో పాటలు గుర్తుకు వచ్చాయి.

18 comments:

  1. చాలా బాగుంది అద్దంకి అనంతరామయ్య :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగార్జునా

      Delete
  2. సూపర్ అండీ బాబు....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి బాబు :)

      Delete
  3. sunetra ki cheppava ee seershika gurunchi...:-)

    ReplyDelete
    Replies
    1. హ హ హ.. చెప్పానండి అర్చనగారు, నిజమే కదా అన్నాడు :)

      Delete
  4. కుమార్ నండూరి2/7/13, 11:02 AM

    బహుశా...వేటూరి గారి పాటలని ఒక రోజు లో కుదించలేమేమో....కానీ మీ ప్రయత్నం అభినందనీయం.....

    ReplyDelete
    Replies
    1. నిజమే ఆయన గురించి చెప్పటానికి ఒక్క రోజు సరిపోదు

      Delete
  5. naaku kevvu keka paata gurtochindi ne post chudagaane ;)

    ReplyDelete
  6. Replies
    1. ధన్యవాదాలండి నారాయణ స్వామిగారు

      Delete
  7. అభినందనీయం.....

    ReplyDelete