Thursday, March 28, 2013

చంద్రం మామ

వెతకాలేకానీ, కష్టాలలో కుడా సుఖాలని వెతుక్కోవచ్చు. సాదారణంగా ఎండాకాలం అంటేనే జనాలు భయపడుతుంటారు. కానీ నాకు మాత్రం సంవత్సరంలో ఎనిమిది నెలలు ఎండాకాలం, నాలుగు నెలలు వర్షాకాలం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో పొందే అతి గొప్ప  సుఖం, ఆరు బయట నిద్రపోవటం.

నాలుగు గోడల మధ్య నాలుగు రెక్కల ఫ్యానును చూస్తూ నిద్రపోవటం అలవాటైన తరువాత, ఆరు బయట లెక్కకు అందని చుక్కలని లెక్కేస్తూ పడుకునే అదృష్టం, అందునా హైదరాబాదు లాంటి మహానగరంలో, ఎంతమందికి దొరుకుతుంది? అస్సలు ఆ ఆలోచన ఎంతమందికి ఉంటుంది? దేవుని దయ వల్ల, ఆరు బయట మేడ మీద నిద్రపోయే అదృష్టం నాకు దక్కుతున్నందుకు ఆనందిస్తున్నాను. ఇదే విషయాన్ని నా స్నేహితుడొకడికి చెప్తేను, "ఆరు బయట ఎలా నిద్రపడుతుంది రా? దోమలు కుట్టటంలేదా" అని అడిగాడు.  ఈ ఎండలకు మనుషులే బ్రతకలేక పోతున్నారు, ఇంక దోమలెక్కడ ఉంటాయి చెప్పండి  

అందునా పౌర్ణమికి నాలుగు రోజులు అటు, ఇటు, వెన్నెలను ఆశ్వాదిస్తూ పడుకుంటే ...., అది మాటలలో చెప్పలేని ఆనందం. నిన్న పౌర్ణమి నాడు చంద్రం మామని చూస్తూ పడుకున్నాను. చంద్రుని మీద పాటలు ఒక దాని తర్వాత ఒకటి గుర్తుకు వచ్చాయి. పురాతన కాలం నాటి "కలువకు చంద్రుడు ఎంతో దూరం" నుండి నిన్న, మొన్న చంద్రుడి మీద విడుదలైన పాటల వరకు, పదిహేనుకు పైగా గుర్తుకు వచ్చాయి. వాటన్నింటినీ పాడుకుంటూ, చంద మామనే చూస్తూ, నిద్రలోకి జారే ప్రయత్నం చేశాను.

మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, రామాయణం చెప్తూ, "ఈ సృష్టిలో మూడింటిని ఎంత చూసినా, ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అవి 1. ఏనుగు, 2. సముద్రం, 3. నిండు చంద్రుడు" అని సెలవిచ్చారు. నిజమే ఈ చంద్రుడిని ఎంత సేపు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. తదేకంగా చూస్తునప్పుడు నా దృష్టి చంద్రుడిలో ఉన్న మచ్చపై పడింది. "చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా?" అని శాస్త్రి గారు రాశారు. కానీ నాకేందుకో ఆ ఆకారం కుందేలు లాగా అనిపించదు. తల్లి ఒడిలో చంటి పిల్లాడు నిద్రపోతునట్టు ఉంటుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంటుండగా, "అల్లుడూ" అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఈ సమయంలో ఎవరా అని కళ్ళు తెరచి చూస్తే, ఆకాశంలో చంద్రుడు మాయమయ్యాడు, ఎదురుగా ఒకతను, సర్వాభరణములతో ప్రత్యక్షం అయ్యాడు. "ఎవరు మీరు?" అని అడిగాను. "నేను అల్లుడూ, చందమామని" అని చెప్పటంతో అవాక్కయాను.

కొద్దిగా ధైర్యాన్ని కూడగట్టుకొని, "పౌర్ణమి రోజున పైన ఉండకుండా కిందకి వచ్చారేంటి స్వామి? అప్రైసల్స్ లేవు కదా, పని ఎగ్గొట్టినా ఏమీ కాదన్న ధైర్యమా?" అని అడిగాను. "ఏమి చెప్పమంటావు రామా? ఈ మధ్య పరిస్థితులు ఎమీ బాగోలేవు. పాటలు రాసుకోవటానికి, పండగలు జరుపుకోవటానికి తప్ప నేనెందుకూ ఉపయోగపడటం లేదు. బొత్తిగా పట్టించుకునే వారే లేరు.అప్పుడప్పుడు నీ లాంటి పని పాటా లేనోళ్ళు తప్ప ఎవ్వరూ పలకరించటం లేదు" అని బాధను వ్యక్తపరిచాడు. ఏమో అనుకున్నాను, చంద్రం మామకి చమత్కారం ఎక్కువే.., చంద్ర మండలంలో కుడా త్రివిక్రం సినిమాలు ప్రదర్శిస్తున్నారు కాబోలు??  

 "నిజమే స్వామీ,ఈ మధ్య మేమంతా పుస్తకాలకు, ముఖం పుస్తకాలకు పట్టించుకుంటున్నామే తప్ప ప్రకృతిని పెద్దగా పట్టించుకోవటం లేదు. అన్నట్టు, మీకు మాత్రమే కాదు, మీ పేరు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు, దానికి బాబుగారు, కెసియార్ గారే సాక్షి" అన్నటంతో, ఆయను కూడా దీర్ఘంగా నిట్టూర్చారు.  "స్వామీ, నీ పైన కూడా స్థలాలు అమ్ముతున్నారని విన్నాను, నిజమేనా??" అని అడిగాను. "నిజమే నాయనా, కాకపోతే అక్కడ కూడా భూం పడిపోయింది. బొత్తిగా బేరాలు లేవు" అన్నారు.

"ఇంతకీ మీ అక్కా, బావా ఎలా ఉన్నారు?" అని అడిగాను. "వారెవరు నాయనా?" అన్నారు. "'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' కదా, ఆ అమ్మకు తమ్ముడివి కాబట్టే నిన్ను అందరూ మామ అంటారేమో అనుకున్నాను, క్షమించండి స్వామీ" అన్నాను. "వారికేమి నాయనా, మొన్న శివరాత్రికి కొద్దిగా అలసిపోయారు, ఇప్పుడు జనాలు మర్చిపోయారు కదా, బాగానే ఉన్నారు. ముఖం పుస్తకం అని ఇందాక ఏదో అన్నావు, కైలాసంలో పరమేశ్వరుడు కూడా దీని గురించే చెప్తూ ఉంటారు., దానిని ఒక్కసారి చూడాలని ఉంది" అని అనటంతో రెండో సారి అవాక్కయ్యాను.శివుడు కూడా ముఖం పుస్తకం వాడతాడు అని తెలియక, "పది నిముషాలలో శివుని ఫొటో లైక్ చేయండి, అదృష్టం వరిస్తుంది" అని ఫొటో కనపడినా , నేను లైక్ చేయలేదు, ఈ విషయం శివుడు మనసులో పెట్టుకుంటాడెమో. "మీ మంచికోసమే చెప్తున్నాను, ముఖం పుస్తకం గురించి మర్చిపో మామా, ఒకసారి తగులుకుంటె ఇక మీకు ప్రతి రోజూ అమావాస్యే" అని హెచ్చరించటంతో ఊరుకున్నాడు.  

మా మధ్య పెరిగిన పరిచయాన్ని అలుసుగా తీసుకొని, "మామా నీకు పెళ్ళి ఈడుకి వచ్చిన కూతురు ఉంటె చెప్పు, ఇప్పటికే వయసు మించిపోతుంది అంటున్నారు" అని అడిగానో లేదో, మళ్ళీ ఆకాశాన చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, తెలివిగల్ల మారాజు.

30 comments:

  1. Super Ram :) Chaala Bagundhi :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగార్జున

      Delete
  2. chala bagundi ra. so funny. intaki mama pillani istanannada leda...

    ReplyDelete
    Replies
    1. పిల్లను ఇచ్చేవాడైతే ఎందుకు మాయం అవుతాడు???

      Delete
  3. chandamaama kuthuru kaavaalaa maa oori kurraadaa

    ReplyDelete
    Replies
    1. ఆశ పడటంలో తప్పు లేదు కదా

      Delete
  4. అమ్మా, ఏకంగా చెంద్రుడి కూతురికే గేలమేద్దామనే! ఎక్కడైనా మావగానీ ఇక్కడ కాదంటాడు! భలే సరదాగా ఉంది. కొంచెం ఈకల్స్ పీకింగ్స్ - లక్ష్మీ చంద్రుడూ ఇద్దరూ క్షీరసాగర మథనంలోనుంచి పుట్టారు కాబట్టి చంద్రుడికి అక్కా బావా అంటే లక్ష్మీనారాయణులు అవ్వాలి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నారాయణ స్వామిగారు, నేను అంత దూరం ఆలోచించలేదు, ఏదో కుర్రతనంతో రాశాను, "ఈ వారం శాస్త్ర కూనీ" అని నా బ్లాగుని షేర్ చేయకండే...,

      Delete
  5. Replies
    1. ధన్యవాదాలు బావగారు

      Delete
  6. Replies
    1. ధన్యవాదాలు రావుగారు

      Delete
  7. రామయ్యా !!! అదిరిందయ్యా !!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అవినాష్

      Delete
  8. mee chamatkaaram adbhutam. endaakaalaamlo aaru bayata challati gaalilo nidriste vachhe sukhaaanni enni kotlu petti konna raadu. chandamaama digi vachi maatlaadatam chaala haasya bharitam gaa undi.

    ReplyDelete
  9. మీరు హాస్యం రాయటం మానకండి, అది అందరికీ అబ్బే విద్య కాదు,

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ఫాతిమా గారు

      Delete
  10. Replies
    1. enta nachite maatram, rendu sarlu nice annala, nenante enta prema ra neeku

      Delete
  11. Super Anantha Ram

    ReplyDelete
  12. అసలెలా వస్తాయి రామయ్య గారు మీకిలాంటి కవిత్వాలు ....
    "కవిత్వం మీకు క(ళ )లాఖాన్ తో పెట్టిన విద్య"....చంద్రం మామ కాకపోయినా ఓ మంచి వ్యాపార ఐస్కాంతం లాంటి మామ దొరక్కపోడులే...చంద్రం మామ పోస్టింగ్ కి నా అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ఏదో అలా కుదిరిపోయింది

      Delete
  13. chala bavundi ram me blog

    ReplyDelete