"విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" అని మహానుభావుడు విశ్వనాధ సత్యన్నారాయణ గారి నవల చదివితే అర్ధం అయ్యింది, ఇంగ్లీషు నీతి లేని భాష అని. భాషలకు కూడా నీతీ జాతీ ఉంటాయా అనే కదా మీ అనుమానం. అస్సలు "నీతి" అనే పదానికి సమానమైన పదమే ఆంగ్ల భాషలో లేదట!!! ఎప్పుడో 1960లో రాసిన నవల. ఈ రొజుకి కూడా ఆ నవల చదవాల్సిన అవసరం ఉంది. ఆంగ్లం మోజులో పడి మనం ఏ తప్పు చేస్తున్నమో అందులో చమత్కారంగా చెప్పారు విశ్వనాథ వారు. ఆ నవల చదివాక ఎంగ్లీషు (నాకెందుకో ఇంగ్లీషు కన్నా ఎంగ్లీషే బాగుంది)భాష ఎంత అస్తవ్యస్తమైన భాషో అర్ధం అయ్యింది. మెమెప్పుడో చిన్నప్పుడు చదివామురా ఆ నవల, అనే వాళ్ళు నన్ను క్షమించాలి. చదవని వాళ్ళుంటే, నా తొక్కలో శీర్షిక చదవక పోయినా పర్వాలేదు, ముందు వెళ్ళి ఆ నవల చదవండి.
పోయిన నెల, వరసకు మామయ్య అయిన ఒక మామయ్యని కలిశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వెళ్ళి పలకరించి పరిచయం చేసుకున్నా. "ఆ చూస్తున్నా రా, ఎప్పుడూ ఫేస్ బుక్ లో తెలుగులోనే రాస్తుంటావ్, ఏంటి సంగతి? ఇంగ్లీషులో కూడా రాస్తూ ఉండు (నీకు ఇంగ్లీషు వస్తే)" అని అన్నారు. ఆ తర్వాత నేను కూడా చాలా సేపు ఇంగ్లీషులో ఆలొచించా, నేను ఇంగ్లీషులో ఎందుకు రాయకూడదు అని.
ఇలా శీర్షికలు కాకుండా ఎదైనా కవిత, కవితని ఇంగ్లీషులో ఎమంటారో నాకు తెలియదు, అయినా పర్లేదు ఇంగ్లీషులో రాయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. మీరు నమ్మరు, కవితలకు ఆస్కార్ లాంటి పురస్కారాలు ఎమైనా ఉంటే, అవన్నీ ఈ కవితకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ మామయ్య కళ్ళల్లో ఆనందం కోసం ఈ కవితను మీ ముందు ఉంచుతున్నా
In front it's you, in the heart as well as you
everywhere i see you, i cant forget you
everywhere i see you, i cant forget you
my heart hardly forgets, even then loving you is the crime,
is the reason for this wound
you wont let this wound heal, nor get out of my heart
time isn't favor for me, death isn't near to me
can't become a mad fellow
i was afraid of dreams, i was away from sleep, disturbed a lot
dreams lasts only seconds, truth is the hell forever
wonder if dream comes true, can truth be a dream
does love has this strength.....
నేను ఇది ఎలా రాశానో, ఈ పాటికి మీకు అర్ధం అయిపోయి ఉండాలి. అర్ధం కాకపోతే తెలుగులో మార్చి మళ్ళీ ఆలోచించండి, సులభంగా అర్ధం అయిపోతుంది. ఇప్పటికైనా అర్ధం అయితే, నేను ఎలా రాశానో చెప్పండి
edutaa neeve., edalona neeve..
ReplyDeleteBagundi!
--JB
Nice catch Jayanth
Deletechala nice. In deed nicest. Thanks Kottapali garu, for sharing.
ReplyDeleteThanks Sujata garu
Deleteఐ టూ రెడ్ దట్ నావల్ రీసెంట్లీ... వెరీ గ్రేటు యాండ్ ఎక్సెలెంటు
ReplyDeletewonderful
ReplyDeletewonderful
ReplyDeleteఏ భాషైనా భావాల్ని వ్యక్తీకరించే ఒక సాధనం మాత్రమే. ప్రపంచమంతా ఒక భాష మాట్లాడటం లేదు. ఒక భాష గొప్ప ఇంకొక భాష తక్కువ అనేమీ ఉండదు. ఆ భాషనుపయోగించి మనమేమి చెయ్యగలుగుతున్నామనేదానిమీదే ఒక జాతి గొప్పతనం ఆధారపడిఉంటుందన్నది నా అభిప్రాయం :)
ReplyDelete~సూర్యుడు :-)
Baaga cheppav sooreedu
Delete