అనుకోకుండా ఈ సాలూరి వారి పాట, మళ్ళీ వినటం జరిగింది. వెంటనే కంపు చేయటం కూడా జరిగిపోయింది.
పేకాట , పెళ్లి రెండూ ఒకటే! పెళ్ళాడినా , పేకాడినా, దెబ్బ తినటం మాత్రం ఖాయం అని తెలుసు. కానీ ఆడకుండా ఉండలేని బలహీనత. ఈ పాట, పెళ్లైన ప్రతి మగ మూగ జీవానికి అంకితం
అయ్యయ్యో వీడికి పెళ్ళై పోయెనే
అయయ్యో లైఫే ఖాళీ ఆయెనే
అయ్యయ్యో వీడికి పెళ్ళై పోయెనే
అయయ్యో లైఫే ఖాళీ ఆయెనే
freedom అంతా పోయింది
సర్వ నాశనం జరిగింది
freedom అంతా పోయింది
సర్వ నాశనం జరిగింది
పెళ్లాం మేడలో తాళితో మొదలై
తిరుక్షవరమై పోతుంది ||అయ్యయ్యో||
x
ఏడు కొండలా ఎంకన్న బాబుకే
తప్పలేదు భాయీ
మ్యారేజ్ తిప్పలెన్నో భాయీ
నువు నన్ను ఆపలేదు భాయీ
అది నా తప్పుగాదురోయి
తెలివి తక్కువగ
పీటలెక్కి నువ్వు దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ ||అయ్యయ్యో||
కాశి యాత్రకే గమ్మున పోయిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
కాశి యాత్రకే గమ్మున పోయిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కగ మోక్షం చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ ||అయ్యయ్యో||
గెలుపూ ఓటమి దైవాధీనం
అన్న మాట తప్పు
ఆలితో ఆడి గెల్వలేవు
బయటకు చెప్పి తిరుగలేవు
ఇంట్లో కూడ ఉండ లేవు
కోర్టునడిగితే దెబ్బతో
నీకు విడాకులే వచ్చుఁ
భరణం దెబ్బ తగలవచ్చుఁ
చివరకు బొచ్చె మిగలవచ్చు ||అయ్యయ్యో||
True experienced person sharing his experience
ReplyDeleteHaha, adem ledu sir
Delete