"అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు" అనే నానుడి మనం చాలా సార్లు వినుంటాం. మనం ఓడినప్పుడు కన్నా పక్కనోడు గెలిచినప్పుడు మనకు బాధ ఎక్కువ. మన జీవితంలో అనేక సందర్భాలలో ఇలాంటివి మామూలే. నిజమే, కానీ ఇక్కడ ఊర్లో జనాల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? అని అడగచ్చు . అక్కడికే వస్తున్నా. మా ఊర్లో ఒక ఆమె వుంది. చాల మంచి మనిషి. నన్ను రోజు పలకరిస్తుంది. పలకరించిన ప్రతి సారి "ఏమి చేస్తున్నావ్ బాబు?" అని అడుగుతుంది.అక్కడ ఆమెతో పాటు ఉన్న ఇంకో నలుగురికి చెప్తుంది, "ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చేసాడు, ఉద్యోగం కూడా వచ్చింది. " అని. వాళ్ళు కూడా అడుగుతారు, " ఎప్పుడు వెళ్తున్నావ్ బాబు ఉద్యోగానికి? " అని. అలా అడగటం తప్పు కాదు. కానీ అప్పుడు నేను ఉన్న పరిస్తితుల్లో ఎవరికైనా కోపం వస్తుంది. అలా వాళ్ళు అడగటం, నేను తప్పించుకోవటం, ఇలా రెండు సంవత్సరాలు అడుగుతూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఒకటా? రెండా? ఇంకో మాస్టారు ఉన్నారు., తాతల నాటి వ్యాపారం చేసుకుంటూ ఊర్లో లక్షలు సంపాదిస్తుంటాడు. మహానుభావుడు., పోయే వాడిని ఆపి మరీ, "ఏరా! రావు గారి అబ్బాయికి అదేదో కంపనీలో ఉద్యోగం వచ్చింది అటగా?, నీకు రాలేదా?", అని ఒక పది మంది ముందు అరిచి మరీ చెప్తాడు. ఇంకో బాబుగారు ఉన్నాడు. ఇతనికి పడటం, లేవటం మాత్రమే తెలుసు. " ఏరా మార్కెట్ పడిందంట? ఉద్యోగాలు రావంట? ఏంటి పరిస్తితి", "మార్కెట్ లేచింది? మీకు ఉద్యోగాలు వస్తాయా ఇప్పుడైనా?" అని తెగ బాద పడి పోతుంటాడు. ఒక పక్క ఏమి చేయాలో అర్ధం కాక నా ఏడుపులో నేనుంటే, "అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు" అన్న చందాన ఇంకా చికాకు ఎక్కువ అయ్యేది. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా రకాలుగా చావ గొట్టారు. ఇలాంటి పరిస్తితుల్లో కూడా నేను ఒకటిన్నర సంవత్సరాలు వీళ్ళ మధ్య దైర్యంగా తిరిగాను అంటే., నాకు ఎంత దైర్యం కావాలి చెప్పండి? ..............సశేషం.......
నా శీర్షికలలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రం కాదు., ఖఛ్చితంగా ఎవరినో ఒకరిని ఉద్దేసించి రాసినవే!!!
Subscribe to:
Post Comments (Atom)
-
పైత్యం ఎక్కువ అయ్యి, ఏదో తెలీక, ఏమి చేయాలో తెలీక ఒక పోడ్కాస్ట్ చేయాలనుకున్నాం. నా స్నేహితుడు రహ్మాన్ తో కలిసి పాటలు, పుస్తకాలు, క్రికెట్,...
-
"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపో...
-
ఒక ఇంట్లో మూడు సంవత్సరాల బాబు, బంతి ఆట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఎదురుగా ఉన్న గడపను తట్టుకొని కింద పడ్డాడు. నొప్పితో పెద్ద ...
No comments:
Post a Comment