మాత్రు దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ
మన జీవితంలో మనల్ని అత్యంత ప్రభావితం చేసే వాళ్ళలో తల్లి తండ్రుల తర్వాత గురువులదే. జీవితంలో ప్రతి విజయం వెనక గురువుల ప్రోత్సాహం, ఆశీసులు తప్పనిసరి. అందుకే మనం గురువుని దేవునితో పోలుస్తాము. ఎంతటి గొప్పవారు అయినా తమ గురువుల ముందు ఎప్పటికీ చిన్నవారే. ఉదాహరణకు యాభై శతకాలు చేసిన సచిన్ కూడా తన గురువుల వల్లే సాదించ గలిగాను అంటాడు.ఇది అక్షర సత్యం. మన జీవిత గమనాన్ని మార్చటానికి అ ఒక్క గురువుగారు చాలు. నా దృష్టిలో గురువు అంటే రామాయణం తో సమానం. రామాయణాన్ని మనం ఎన్నో కోణాలలో చదవచ్చు. ఒక తండ్రి కొడుకుల కధగా, ఒక అన్న తమ్ముల కధగా, ఒక గురు శిష్యుల కధగా, ఒక భార్య భర్తల కధగా ఇలా ఎన్నో కోణాలలో చదవచ్చు. అలానే గురువు నుండి కూడా మనం అనేక కోణాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. ఇవాల్టి రోజున చదువు నేర్పే వారందరూ గురువులు అని నేను అనుకోను. చాలా కొద్ది మంది మాత్రమే విద్యార్దుల జీవితాలను ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నారు. నాకు అలాంటి గురువులు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. సినిమాల్లో ఈ మధ్య గురువులను ఎంత హ్యేయంగా చూపిస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. మీకు చిన్ననాటి ఒక సంఘటన చెప్పాలి. నేను మా నాన్న ఒక రోజు పెళ్ళికి వెళ్ళాం. ఒకతను మా నాన్నను, "మీకు ఎంత మంది పిల్లలు?" అని అడిగాడు. మా నాన్న 450 మంది అని చెప్పాడు. అతను కంగారుపడ్డాడు. మా నాన్న దగ్గర అప్పుడు 450 మంది చదువుకుంటున్నారు. పిల్లలు అంటే ముందుగా ఆలోచించేది వాళ్ళ గురించే. మీకు నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువులు మీకు ఎంతో మంది ఉండి ఉంటారు. వాళ్ళని ఒకసారి కలిసి కృతఙ్ఞతలు చెప్పండి.అంతకన్నా వాళ్ళకు కావాల్సిన గురుదక్షిణ ఇంకొకటి లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఉపాద్యాయుడిని అవ్వాలి అని కోరిక. ఇప్పటికీ ఆ కోరిక అలానే ఉంది. ఆ కోరికే ఈ రోజు నన్ను ఈ శీర్షిక రాయటానికి ప్రేరేపించింది.
..........సశేషం.......
Ninnu maatram Krishna Mohan baaga prabavitham chesi untadu........
ReplyDeletekrishna mohan evaru ra? KK sir aaa
ReplyDeleteya...mana KK....
ReplyDelete