అప్పుడు సమయం అర్ధ రాత్రి ఒంటిగంట అయిందనుకుంటా, కొత్తగా కొనుకున్న బండి మీద సరదాగా బయటకి వెళ్దామని బండి తీశా. చిన్నగా ఆ బండి మీద అలా వెల్తూ ఉన్నాను. చలి కాలం పిల్ల గాలులు చిన్నగా సందడి చేస్తున్నాయి. ఆ వీది దీపాల వెలుతురులో నగరం ఎంతో అందంగా వుంది. నాకు బాగా నచ్చిన తెలుగు పాటలు వింటూ వేగం పెంచాను.
అంతలో దూరంగా ఒక అందమైన అమ్మాయి కనపడింది. బండి ఆపమంటూ సైగ చేస్తున్నది. బండి నా ప్రమేయం లేకుండానే ఆగిపోయింది. తనతో పాటు ఎవరూ లేరు. ఒంటరిగా ఆ మంచులో తను మగధీర చిత్రంలో కాజల్ లాగా వుంది. తన బండి చెడిపోయింది, "కొంచం ఇంటి దగ్గర దిగబెడతార? " అని అడిగింది. తన గొంతులో ఏదో మాయ వుంది. అ క్షణంలో నాకు గాలిలో తేలుతునట్టు అనిపించింది. అందమైన అమ్మాయి ఒంటరిగా బండి ఎక్కుతానంటే కాదని చెప్పటానికి నాకేమన్న పిచ్చా? తను నా బండి వెనక కూర్చుంటే ప్రపంచం అంతా నా వెనక ఉనట్టు అనిపించింది.
అసలు అప్పుడు నా భావాలను మాటలలో చెప్పలేను. అ క్షణం అలానే ఆగిపోవాలని అనిపించింది. అందుకే చాల తక్కువ వేగంతో నెమ్మదిగా వెళ్తున్న. నా పేరు స్వప్న అని చెప్పింది. నా పేరు చెప్పాను. అలా కబుర్లు మొదలు పెట్టాము. "మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే", అని చెప్పింది. ఆ క్షణం తెలుగు సినిమా కధానాయకుడు కూడా నా ముందు ఎంత అనిపించింది. ఇంతలో ఎక్కడి నుంచో పెద్ద శబ్దం వినిపించింది. నిద్ర లేచి చూస్తే, అది నా ఫోన్ నుంచి వచ్చిన శబ్దం. ఎవడో నాకు సంక్షిప్త సందేశాన్ని(తెలుగులో దానినే SMS అంటారు) పంపించాడు. అప్పుడు అర్ధం అయింది అదంతా కల అని. తన పేరు ఏమని చెప్పింది? స్వప్న అని కదూ., అంటే "కల" అనే కదా? తన తప్పు ఏమీ లేదులే, తను నిజమే చెప్పింది. అయినా అమ్మాయి నా బండి ఎక్కటం ఏంటి? అసలు నాకు బండి వుంటే కదా. అంతా కల. మనకు అంతే ప్రాప్తం అని బాదేసింది. జీవితంలో ఇలాంటివి అన్ని మాములే అనిపించింది. కల పొతే పోయింది, "ఇంత అర్ధరాత్రి ఎవడు సందేశం(SMS) పంపాడో?", అని ఆదుర్దాగా చూశాను. అది చూడగానే నాకు చావాలి లేక పొతే పంపిన వాడిని చంపాలి అనేంత కోపం వచ్చింది.ఆ సందేశం ఏంటంటే.,
"కాకి కావు కావు అన్నది,
కుక్క కాలు ఎత్తింది,
కప్పు గంతులు వేసింది,
కళ్ళు మూసుకొని నిద్రపో మిత్రమా, శుభరాత్రి."
ఇది అందులో ఉన్న సందేశం. అర్ధ రాత్రి నిద్ర పొతూ కమ్మని కలల్లో విహరిస్తుంటే., అలాంటి వాడిని నిద్ర లేపి మరీ "శుభరాత్రి" చెప్పటం అవసరమా? అర్ధ రాత్రి అంకమ్మ శివాలు అంటే ఇదే మరీ. ఆ వెధవకి పని పాట ఉండదు. నాకు కూడా లేదనుకోండి., పైసాకో సందేశం పంపే వీలు వుంటుంది. ఇంకేముంది ఇలాంటి టంపే(తిరగతిప్పి) పనులతో పైశాచిక అనందం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవడు ఏడ్చాడు వాడిని శుభరాత్రి చెప్పమని? చివరగా నేను చెప్పదలచుకుంది ఏంటంటే, తోచక పొతే రామాయణం చదవండి, లేదంటే నీళ్ళు లేని బావిలో కూర్చొని పాటలు పాడుకోండి., అంతే కానీ ఎదుటి వాళ్ళని ఇలాంటి పిచ్చి పిచ్చి సందేశాలతో నరకం చూపించద్దు. మీకు కూడా ఇలాంటి బాదలు ఏమైనా ఉంటె వెంటనే వాళ్ళ మొహం మీదనే చెప్పేసేయండి. హాయిగా అమ్మాయితో బండి మీద ఉండాల్సిన వాడిని, దరిద్రుడు, వాడి పాపాన వాడె పోతాడు.,
kekka post ram
ReplyDeleteThnx lalita garu
ReplyDeletepratidi nee gurinchi anukunte ela raki, nuvvu ala messages pampistunte, nee meeda anuko, ea post okallani vudesinchindi kadu, ala chese prati jeffaki ankitam...,
ReplyDeletevorey hatsoff ra
ReplyDeletene lo chala pedda rachayitha vunnadu ra
keep goin
@rajesh: krutagnatalu
ReplyDeleteOrey Nenu Nikanna EDAVANI ra
ReplyDeletechaala bagundi content.
ReplyDelete