నేను నా కార్యాలయానికి చేరుకోవటానికి ఇరవై నిముషాలు పడుతుంది. నేను సాదారణంగా త్రిచక్ర వాహనం లో వెళ్తుంటాను. చక్రాలు మూడే కానీ అందులో ఏడు ఎనిమిది మందిని ఎక్కిస్తాడు. పాపం లేక పొతే పెరిగిన ధరలకు వాహనాన్నే కాదు ఇంటి బండిని కూడా తోలలేడు.అంత మంది ఎక్కితే, కూర్చోవటానికే చోటు ఉండదు. ఎలాగోలా సర్దుకుని కూర్చోవటమే కష్టం. ఐతే అప్పుడప్పుడు కొంత మంది అమ్మాయిలూ వింతగా ఉంటారు. ఉదాహరణకు ఒక రోజు యదావిదిగా కార్యాలయానికి బయలుదేరాను. అంతలో ఒక అమ్మాయి మొహం నిండా ఒక కిలో అవి, ఇవి పూసుకొని, ఒక సంచి బుజాన వేసుకుని, ఇంకో పుస్తకం చేతిలో పెట్టుకొని నేను ఉన్న బండిలో ఎక్కింది.ఎక్కి ఎక్కగానే పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టింది.
నాకు ఒక్కసారిగా మతి పోయింది. ఒక ప్రక్క కూర్చోవాటానికే గతి లేదు, పైగా ఆ గతుకుల బండి ఉయాల ఊగినట్టు ఊగుతోంది. ఒక పక్క గోల, ఇంకోపక్క పెద్దగా పాటలు, అయినా ఆ పాప చెక్కు చెదరని ఏకాగ్రతతో, అకుంటిత దీక్షతో, అలుపెరగని పోరులా చదువుతుంది. నాకు అప్పుడు అనిపించింది "ఇక్కడే ఇలా చదువుతుంటే, అస్సలు అమ్మాయిలు ఇళ్ళల్లో ఏమి చేస్తుంటారు?", అని. ఇలా చదివితే ప్రతి ఒకళ్ళు ఒక వివేకానంద అవుతారు అనిపించింది. ఇంకా సమయానికి వర్షాలు కురుస్తున్నాయి అంటే దానికి ఇలాంటి అమ్మాయిలే కారణం అనుకున్న. ఇంతలో ఏదో మోగింది. చూస్తె తన ఫోను. ఆమెకో సందేశం వచ్చింది. నా బోటి అమాయకుడు ఎవడో పంపి ఉంటాడు., పనా? పాటా? ఇక చూడు నేను బండి దిగిందాక, ఒకటే గోల. ఆ మాత్రం దానికి పుస్తకం తీయటం ఎందుకు? మూయటం ఎందుకు? అప్పుడు అనిపించింది., 2012 కలియుగం అంతం అంటే కాదా మరి? ఇంతకీ వీడికి ఎందుకు ఇంత కడుపు మంట అని అనుకుంటున్నారా? ఆ అమ్మాయికి సందేశం పంపింది నేను కాదు కదా. అందుకని.
No comments:
Post a Comment