Friday, January 7, 2011

S/W ఇంజనీర్ మనోభావాలు

"మా మనోభావాలు దెబ్బ తిన్నాయి", ఈ మాట మనం కనీసం రోజుకి ఒకసారి వింటూఉంటాం. మనోభావాలు అంటే ఆషామాషి  వ్యవహారం కాదు. మనోభావాలు దెబ్బ తీస్తే చాల విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మనోభావాల కారణంగా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చరిత్రలో అనేకం.,  ప్రతి వ్యక్తికీ మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలు దెబ్బతింటే తట్టుకోవటం ఎంతటి వాడికైనా కష్టం. ఎన్ని సినిమాలు కేవలం మనోభావాలు దెబ్బ తిన్న కారణంగా గొడవలు జరిగాయో మనం చూస్తున్నాం.  కాకపోతే ఈ మనోభావాలు ఒకొక్కరికి ఒక్కోలా ఉంటాయి. నా మనోభావాలు కూడా చాల సార్లు దెబ్బ తిన్నాయ్. 

 మీలో చాల మంది "కిక్" సినిమా చూసే ఉంటారు.  అందులో రవితేజ మొదట s/w ఇంజనీర్. లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా కిక్ లేని కారణంగా వదిలేస్తాడు. తర్వాత చిన్న పిల్లలు కోసం కోట్ల రూపాయల్ని చెమట పట్టకుండా, చొక్కా మడత పడకుండా కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇలియానా కోసం పోలీసు అవుతాడు. అవ్వాలి కుడా., ఆ మాత్రం చేయకపోతే తెలుగు సినిమా హీరో ఎలా అవుతాడు? ఇక్కడ ఒక ఉద్యోగం రావటానికే చస్తుంటే మన కదనాయకుడికి వద్దన్నా ఉద్యోగాలు. ఉద్యోగం ఎందుకు మానేశాడు అంటే., "లక్షలు లక్షలు జీతం ఇస్తున్నారు కదా అని ఆ డబ్బా కంపూటర్ల ముందు గంటలు తరబడి టిక్కి టిక్కు మని  కూర్చోవటం నా వల్ల కాదు" అంటాడు మనోడు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు నా పీక మీద నా కాలు వేసుకొని తొక్కోని చచ్చిపోదాం అన్నంత కోపం వచ్చింది. ఇక్కడ ఒక వైపు ఆ S/W ఉద్యోగమే రాక అమీర్పేట్లో సంవత్సరాలు తరబడి విశ్వప్రయత్నం చేస్తుంటే., డబ్బా కంపూటర్లు, తొక్కలో ఉద్యోగం అంటాడా? పోకిరిలో బ్రహ్మానందం, సింహ లో ఆలి ఇలా ప్రతి సినిమాలో S/W ఇంజనీర్ల మనోభావాలతో ఆడుకున్నారు.


అప్పుడప్పుడు నాకు భాదేస్తుంది. ఈ రోజుల్లో S/W ఇంజనీర్లకు విలువ లేకుండా పోయింది. ప్రతి కుక్క S/W ఇంజనీర్ అవుతుంది., ప్రతి కుక్క అమెరికా పోతుంటే విలువ ఎక్కడుంది అని అంటున్నారు. పోనీ ఒకవేళ ఈ ఉద్యోగం మనేదాం అనుకుంటే, ఇంతకన్నా మంచి ఉద్యోగం నాకు తెలిసి అయితే లేదు. ప్రపంచం మొత్తం మన తట్టు చూస్తూ వుందంటే దానికి కారణం మనం IT రంగంలో చూపిస్తున్న పురోగతి వల్లే కానీ, పైన చెప్పిన వెధవ సినిమాల వల్ల కాదు కదా., ఇలాంటి వాళ్ళ ఏడుపు వల్ల దిష్టి తగిలి ఇప్పటికి రెండు సార్లు పడి లేచింది. పడినప్పుడు ప్రతి వాడు వెటకారంగా అడిగేవాడే, "ఏరా S/W పడింది అంటగా?" కనీసం పిల్లని ఇవ్వటానికి కూడా ఎవరూ ముందుకి రాలేదు. అదే పరిస్తితి  బాగుంటే పిలిచి పిల్లని ఇస్తున్నారు(నా గురించి కాదు, ఉదాహరణగా చెప్పా.,).
.....సశేషం.....

20 comments:

 1. parledhura.. bagane improvement vachchindhi.. thappulu lekunda rasthunnav.. ;)

  ReplyDelete
 2. chalA bAgunnAyi mI sIrshikalu... E rojE oka snehituni dwara telisindi.. chaduvutu unte pAtavi kuda chadavali anukuni inka ratrantha chaduvutu unnA... palletUru vAllam patnam vaste unde anubhUtulu, hindi pAtalu, mandi mantanAlu abbO adbhutam... mari pogidestunnAnani kAdu gani E madhya telugu chadivi chAnnallavadamemo mayamarachipoyanu... ilage inka enno rAstu andarini alaristU eppudU anandam ga undalani korukuntU... oka snehiturAlu...Sushmita...

  ReplyDelete
 3. Thnx sushmita., mee lanti vallu protsahiste inkaaa inkaaa himsistuune unta...,

  ReplyDelete
 4. chala baga rasarandi RAM garu...

  ReplyDelete
 5. Sooper RAM ... Chaala baaga raasav ..

  ReplyDelete
 6. chalu bagundi ram....inka ilantivi rasthuu vundu...prathyekamga eee sirshika mathram chala bagundi...:)

  ReplyDelete
 7. @archana: krutagnatalandi, meeru twaraga america vellalani asisttunnanu :P

  ReplyDelete
 8. chala rojula tarvata purthiga telugu lo unna oka shirshika chadivanu... Dhanyavadamulu Guruji..

  ReplyDelete
 9. nice to read it. i second your thoughts.

  ReplyDelete
 10. :) Sasesham annaaru. Where is the rest ?

  ReplyDelete
  Replies
  1. ఎవరైనా అడిగితే రాయాలి అని ఆగాను, మీరు ఇప్పుడు అడిగారు కదా!! తప్పకుండా రాస్తాను సుజాతగారు :)

   Delete
 11. bagundi annai but inkoncham length and dept unte adhurs...........

  ReplyDelete
 12. ఈ సినిమా వాళ్ళు వాడె ప్రతీ పరికరం సాఫ్ట్ వేర్ లేనిదే పని చేయదు. వీళ్ళు సినిమా ఎడిట్ చెయ్యాలి అన్నా, అడోబ్ సాఫ్ట్ వేర్ కావలలిసిందే, దాన్ని రాసింది ఎవరు అంటే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరే ... కెమేరా, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ౩డి. ఆఖరికి వీళ్ళు విడుదల చేసే పాటలు, సినిమాల డీవీడీలు గా మారటానికి కారణమైన ఏ సాఫ్ట్ వేర్ అయిన రాసింది ఎవరు ... మాళ్ళీ ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరే ! అన్నింటికి మించి... వీళ్ళకి మ్యాక్ లేనిదే పని జరగదు... దానికి కోడ్ రాసింది మళ్ళీ ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరే ... దానికి నేనే సాక్షం. వీళ్ళకి ప్రీఫ్రొడక్షన్ టూల్స్, స్రిప్ట్ రాయటానికి, పొస్ట్ ప్రొడక్షన్ టూల్స్ అన్ని వాడుతున్నపుడు రాలేదా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ? సినిమాలో హేళన చెయ్యటానికి ముందు ఓక్క సారి అయిన పునఃసమీక్షించుకోలేక పోయారా ఈ సినిమా వాళ్ళు ?

  ReplyDelete
  Replies
  1. నరికేశావు రహమాను, బాగా చెప్పావు

   Delete