Friday, June 3, 2011

జీవితమే ఒక ఆర్కుట్

 అంతర్జాలంలో గంటలు గంటలు గడిపే వాళ్ళకి సుపరిచితమైన పేరు "ఆర్కుట్". చిన్నప్పటి స్నేహితులు నుండి బహు దూరపు బందువుల దాకా అందరినీ కలిపే వేదిక. ఇప్పుడైతే అందరు మొహంపుస్తకం (Facebook) ఎక్కువగా వాడుతున్నారు కాని., నిన్న మొన్నటి దాకా ఆర్కుట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

దూరం ఐన స్నేహితులనే కాకుండా, కొత్త కొత్త స్నేహాలను కూడా పరిచయం చేసింది ఆర్కుట్. ఉదాహరణకు "ఆర్కుట్ లోని పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ ఇంకేదోగా మారి, పిచ్చయ(19), పుల్లమ(18) అనే ప్రేమజంట, పెద్దలను ఎదిరించి, ఫలానా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు(శాస్త్రోక్తంగా)" ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు దినపత్రికలలో చూసే ఉంటారు. ఇప్పుడు ఆర్కుట్ గురించి ఇంత పెద్ద మొత్తంలో రచ్చ ఎందుకు చేస్తున్నాను అంటే, ఆర్కుట్ మీద నేను ఒక పాట రాసానన్నమాట!!!! దానిని ప్రత్యేకంగా మీకోసం శీర్షికలో........

అనట్టు చెప్పటం మర్చిపోయా, పాట "కొండ వీటి దొంగ" చిత్రంలో పాటకి దగ్గరగా ఉంటుంది.

పల్లవి ||
జీవితమే ఒక ఆర్కుట్, సాహసమే ఒక స్క్రాప్ బుక్
బాగా నెట్వర్క్ ఉన్నన్నాళ్ళు ఉండవు మనకే కష్టాలూ
చుట్టాలైన, స్నేహితులైనా అంతా నా వాళ్ళు
ఎవరూ దాగలేరు, యాడ్ కాక ఉండలేరు.
                                                 ||జీవితమే||
చరణం||
జాడే లేని ఎదవల కోసం, సెర్చ్ బటన్ నే యూస్ చేస్తా
ప్రతి ప్రొఫైల్ ను వెతికి వెతికి జాడేంటోనే పట్టేస్తా
ఫ్రెండ్స్ ఐన, నాన్ ఫ్రెండ్స్ ఐన, మెసేజ్ చేయక వదలను రా, వదలను రా
                                                 ||జీవితమే||
చరణం||
ఎప్పుడో చూసిన చిత్రంలోని వీడియోని నే యాడ్ చేస్తా
ప్రతి ఆల్బం తెరచి తెరచి కామెంటే నే చేస్తా
యావత్ ప్రపంచం, అయినది కొంచం , అల్లుకోక ఇక ఉండకు రా, ఉండకు రా
                                                 ||జీవితమే||

1 comment: