Friday, June 17, 2011

పండిత పుత్రః పరమ ..............


1) " మా తాతగారు రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అలాంటి తాతగారి మనుమడిగా పుట్టటం నా పూర్వ జన్మ అదృష్టం." ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. గమనిస్తే ఇప్పుడున్న కధానాయకులలో మూడొంతులు సినీ నేపధ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వారే. ఒక కధానాయకుడి కొడుకు కూడా కధానాయకుడు అవుతున్నాడు.

2) "నాన్నగారు నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు, " మాటలు కూడా మనం వింటూనే ఉంటాం. మీరెప్పుడు వినకపోతే సాక్షి టీవి చూడండి. రాజకీయనాయకుని కొడుకు కుడా రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు.ఇలానే ఒక వ్యాపారి కొడుకు, వ్యాపారి అవుతున్నాడు, వారి వారి రంగాలలో తండ్రికి తగ్గ తనయుల్లాగా దూసుకుపోతున్నారు. కాని ఒక ఉపాధ్యాయుడి కొడుకు మాత్రం ఉపాధ్యాయుడు కావటంలేదు. ఎందుకబ్బా???

"పండిత పుత్రః పరమ సుంఠః " సామెత నిజం అంటారా?? అంటే పండితుల కొడుకులందరూ......?????

నాకు తెలిసి మా నాన్న గారు పండితుడు. అంటే నేను........???

నాకు అప్పుడప్పుడు ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి. కంగారు పడకండి.


సింగ్ లేదా సర్దార్ల మీద మనకు అప్పుడప్పుడు తమాషా సందేశాలు వస్తూ ఉంటాయి. మా స్నేహితుడు ఒకతను అంటాడూ, "సర్దార్లని ఎగతాళి చేయటం సులభమే, కానీ ఒక సర్దార్ లాగా బ్రతకటం కష్టం అని" నిజామే కదా., కాని నేనేమంటానంటే "ఒక ఉపాధ్యాయుడిగా బ్రతకడం సులభం, కాని ఉపాధ్యాయుడి కొడుకుగా బతకటం కష్టం". వీడింతే, శీర్షిక రాయటం మొదలు పెడితే వాడేమి రాస్తాడో వాడికే తెలియదు అని తిట్టుకోకండి. మా(పండిత పుత్రులు) కష్టాలు ఎన్నని చెప్పమంటారు. పాతికేళ్ళ అనుభవంతో రామానంద స్వామి(నేనే) చెప్పేది ఏంటంటే...................


"ఫలానా రావు మాస్టారు గారి అబ్బాయికి పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ", "మాస్టారు గారి అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ ఎంత?" ఇలాంటివన్నీ చాలా సహజంగా వచ్చే ప్రశ్నలు, కానీ జవాబులే చికాకుగా ఉంటాయి. తరగతిలో పాతిక మంది పరీక్షలో తప్పినా పట్టించుకోరు కానీ., పంతులుగారి అబ్బాయికి ఒక్క పరీక్షలో తక్కువ శ్రేణి వచ్చినా అదొక పెద్ద దూమారం అవుతుంది, మామిడి టెంకలో చెప్పినట్లు. బడిలో గంట పాఠం వింటేనే బుర్ర తిరిగిపోతుంది., పది నిముషాలు పంతులుగారు తిడితేనే  తల బొప్పి కడుతుంది. అలాంటిది 24 గంటలూ ఇంట్లో కూడా తిట్లు వినటం ఇంకా ఎంత నరకమో, అనుభవిస్తే తప్ప, చెబితే అర్ధం అయ్యేది తక్కువే.చదువు గురించి ప్రక్క పెడదాం. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. చాలా మంచోడు. రోజుకి పెట్టె కన్నా దూమపానం చేయడు. కానీ అగ్గిపుల్ల వెలిగించటం కూడా ప్రక్కన వాళ్ళకి తెలియకుండా చేస్తాడు. దూమపానం చేస్తున్నంతసేపు ఎవరైనా చూస్తారేమో అన్న భయం. "ఎందుకు రా అంత భయం?" అని అడిగితే, " మా నాన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తారు. ఫలానా పంతులుగారి అబ్బాయి ధూమపానం చేస్తున్నాడు అని అంటే బాగోదు" అని బాధను వ్యక్తం చేశాడు. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకు దూరం ఐన ఎదవని చూస్తె బొమ్మరిల్లు చిత్రంలో కధానాయకుడు సిద్దార్ధ్ గుర్తొచ్చాడు. "అంత బయపడుతూ తాగకపోతే మానేయరా" అని చెప్పా. మాటకు వాడి మనోభావాలు దెబ్బ తినట్టు ఉన్నాయి., రెండంటే రెండు బూతులు తిట్టాడు. ఇలాంటి కష్టాలు అనుభవించిన అందరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.


పంతులుగారి అబ్బాయి అంటే, ఎప్పుడూ మొదటి శ్రేణిలో ఉండాలా? పండిత పుత్రులు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి మాత్రం మనసు ఉండదా??? "చెట్టు మంచిది ఐతే కాయ మంచిది అవుతుంది" మాట నూటికి నూరుపాళ్లు నిజం. కాకపోతే మామిడి చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి కానీ, జామ కాయలు కాయవు కదా. అర్ధం కాలేదా? పంతులుగారి అబ్బాయి అయినంత మాత్రాన వందకు వంద రావాలని ఏమీ లేదు. చెప్పిన పాఠం చెప్పినట్టు బట్టీ వేస్తే కుక్కకి కూడా వంద వస్తాయి. బాగా చదివితే, మాహా ఐతే ఒక s/w ఇంజనీర్ అవుతాడు. కానీ ఇంకో నలుగురు ఇంజనీర్లని తయారు చేయలేడు. నలుగురికీ ఆదర్శ ప్రాయంగా బ్రతికి, నలుగురిని మంచి మార్గంలో నడిపించగలిగితే, అప్పుడే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. అలా చేసిన రోజున అందరూ "పండిత పుత్రః పరమ పూజ్యః" అని అంటారు

గమనిక: ఇవన్నీ కేవలం నా అనుభవాలు మాత్రం కాదు. మా నాన్న ఉపాధ్యాయుడు అయినప్పటికినీ, నన్ను రుద్దింది ఒక్కింత తక్కువే. నా మిత్రుల కష్టాలు విని, కొన్నిటిని స్వయంగా చూచి రాసిన శీర్షిక. లేదంటే,మా నాన్న ఇదంతా చదివితే, బాధ పడే అవకాశం ఉంది. :P  (నాకు అబద్ధాలు ఆడటం రాదు)

7 comments:

 1. avunu mama nijamy ma nana kuda panthuly kani nannu kuda antha baga rudaladu.
  kani nanu eppudu vaka engieering collage lo ponthuluga panichystuna ra

  ReplyDelete
 2. @hareesh: aite nee pillalni edipinchaku :P

  ReplyDelete
 3. ramudu manchi baluda ......?????

  ReplyDelete
 4. mama ninu telugu acharyulu ga oka post epinchali ani undi ra... chala baga raseu....

  ReplyDelete
 5. @pavan: aa teluge sarigga vaste inni tappulato seershikalu enduku raastanu? baaga telugu nerpe badi edanna vunte cheppu cheratanu

  ReplyDelete
 6. @ram addanki== maa naana kuda panthulae....nannu ruddhalae kani expectations ki reach avuthano ledho ani sagam sachipoyetodini (khaleja lo mahesh laga) :-) stubborn kiran

  ReplyDelete
  Replies
  1. ఆ బాధేంటో నాకు తెలుసు సోదరా!!!! అందుకే పైన ఆ విధంగా ఏడ్చింది

   Delete