అందరికీ 65వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం 63,64,65 సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రయోజనం లేకుండా పోతున్నది. రాష్ట్ర పతులు మారుతున్నా రాష్ట్రగతులు మారటం లేదు. దీని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకుండా పోతున్నది.
ఒలంపిక్స్ లో మనకు 6 పతకాలు వచ్చే సరికి అబ్బో అంటున్నారు. చైనాకి మనకన్నా పదిహేను రెట్లు ఎక్కువ వచ్చిన విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఈ విషయమై, నేను తీవ్రంగా ఆలోచించాను, ఇలాంటి క్లిష్ట పరిస్తితుల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి అని. మన దేశానికి కూడా అన్ని పతకాలు రావాలంటే
1) శ్రీ చైతన్య, నారాయణాలలో ఐ.ఐ.టి కి బదులుగా క్రీడల శిక్షణ మొదలు పెట్టాలి.
2) పేకాట, గోలీలాట, కర్రాబిళ్ళ యిత్యాది ఆటలను ఒలంపిక్స్ లో చేర్చాలి.
3) గీంకార్ అన్న నృత్య పోటీలు కాకుండా, క్రీడల పోటీలు పెట్టాలి..., ఇలా చేస్తే ఖచితంగా వచ్చే ఒలంపిక్స్ లో మనకు పెద్ద మొత్తంలో పతకాలు వచ్చే అవకాశం ఉంటుంది అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అప్పుడు టి.వి.లో ఎలా చెప్తారంటే?? " 2016 ఒలంపిక్ పతకాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం, మొత్తం వందలోపు 75 పతకాలు, స్వర్ణం, స్వర్ణం, రజతం, కాంస్యం, స్వర్ణం, రజతం... " అని చూడాల్సి వస్తుంది.
స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని మా కార్యాలయంలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ వంకతో నేను చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రెండు నాటకాలు, నాలుగు పాటలతో జనాలకు నిద్ర పట్టకుండా చేశాను. నంది స్థాయిలో ప్రదర్శన ఇస్తే మా రెడ్డిగారు కుక్కా అని తిట్టారు. కనీసం ఒక్క దానికి కూడా బహుమతి ఇవ్వలేదు. అయినా కళాకారుడికి కావాల్సింది ప్రోత్సాహం కానీ బహుమానాలు కాదని సర్దుకుపోయాను. పనిలో పని ఎప్పటిలాగే నా కీబోర్డు నుండి కొత్త కృతిని మీకు అందిస్తున్నాను.
సాదించిన స్వాతంత్ర్యం, సాదించినది ఏ మాత్రం.
అభివృద్దికి కావాలి పంచతంత్రం,
ప్రత్యేకించి దానికి లేదే సూత్రం,
ఇదే నేటి మన దేశ ముఖచిత్రం.
రాజకీయం అంతా కుళ్ళూ కుతంత్రం,
అవినీతికి ఇదే గొప్ప క్షేత్రం,
నిజాయితీ అనేది ఒక విచిత్రం,
పని జరగదు లేనిదే పచ్చని పత్రం,
ప్రజల బాగుకు లేదు మంత్రం.
ఎవడు అడిగాడు కులం గోత్రం,
అండగా కావాలో నాయక ఛత్రం,
మనకోసం రావాలో కొత్త నక్షత్రం,
వెలుగెత్తి పలకాలి ప్రతి ఒక గాత్రం,
దేశ ప్రగతికి చూపాలి ఆత్రం,
ఈ పాఠం కావాలి మనకిక స్తోత్రం,
వస్తుంది తప్పక ఆ సాయంత్రం,
సాక్షి అవ్వాలి చమర్చే నా నేత్రం
keka
ReplyDeleteధన్యవాదాలు
Deleteచక్కటి పోస్ట్.
ReplyDelete@anrd : ధన్యవాదాలు :)
Delete:):):) "నంది స్థాయిలో ప్రదర్శన ఇస్తే మా రెడ్డిగారు కుక్కా అని తిట్టారు" అయ్యో!!! నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అస్సలు ప్రాస లేకుండా పోయింది మీ రెడ్డి గారికి. నంది - కుక్క ఎక్కడయినా ప్రాసుందా??? ప్చ్ అబ్బే!!!!!! :):)
ReplyDeleteరసఙ గారు: తిట్టేటప్పుడు,ప్రాస ముఖ్యం కాదండి, భావమే ముఖ్యం. నేను మా కార్యాలయంలో కుక్కలా విశ్వాసంగా పనిచెస్తాను అని రెడ్డిగారి భావన అయ్యుండచ్చు.
Deletemanaku nijangane swathantryam ochindani andaru chepthe vinadam, choclatelu iste thinadam thappa., eduti vaadi meeda aadhara padakunda kappu coffee kalupukuni taagadam raadu bhayya...
ReplyDeleteDesham emaipothundo, ela kaapadaloo...
Haa... pathakala sangathiki oste aaa aaraina ochayi sambara padadam, sambar ondukuni thindam!
"raashtrapathulu maaruthunnare thappa raashtra gathulu maaratledu!" :-D
--JB
P.S - Indaake veedhi chivara coffee kottu lo tea kottocha.. ;-)
Jayant : nee lanti valla valle desam abhivrudhi saadinchatamledu. Mundu aa eng Vs SA aapesi IND vs Nz match choodu
DeleteAppudu desham kosam praanalu arpinchina list lo latest addition nene autha...
DeleteAina Mahela Jayawardena lekunda India match chudadam bore bhayya...
@ జయంత్ : నీకు దేశంతో దూరం పెరిగింది, ప్రేమ తగ్గింది.జయవర్దనే లేకపొతే ఏంటి? మనొళ్ళు ఎవడో ఒకడికి లైఫ్ ఇవ్వకుండా పంపే సంస్కారం లేనొళ్ళు కాదు,
Deletehehehe.. :D
Delete