Saturday, May 10, 2014

అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు

క్రొత్తగా పెళ్ళైతే చేసే మొదటి పని .... గుళ్లని, పుణ్య క్షేత్రాలని దర్శించటం. అందులో భాగంగానే, పెళ్లి అయిన మూడో రోజు, సతీ సమేతంగా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లాను. ఏమి అదృష్టమో తెలియదు, వెళ్ళిన ప్రతి సారీ, అమ్మ వారి దర్శనం నిముషాలలో దొరుకుతుంది. ఈ సారి కూడా అలానే 100/- టికెట్టుతో పావు గంటలో దర్శనం చక్కగా అయ్యింది. భవ సాగరాన్ని బాగా ఈదేలా చూడమని అమ్మని వేడుకున్నాను. జనం కూడా పెద్దగా లేకపోవటంతో ప్రశాంతంగా బయటకి వచ్చాను. ప్రశాంతతను కోల్పోయాను.

అమ్మవారి దర్శనం అవ్వగానే... స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయ్యాక, పెద్ద పెద్ద విభూతి బొట్టు పెట్టుకున్న పంతులుగారు అడిగారు, "క్రొత్తగా పెళ్లి అయ్యిందా?" అని. అవునన్నాను. ఆ మాటకు ఆయన కళ్ళల్లో అమితమైన ఆనందాన్ని గమనించాను. నాకు పెళ్లి అయితే ఇతనికేంటా అంత ఆనందం అని అనుమానం వచ్చింది. నా నుదుటున, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి, పేరు, గోత్రం అడిగి మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు. ఒక నిముషం చదివి, ఒక అయిదు వందల నోటు తీసి... నీకు పిల్లలు పుట్టాలని పది మందికి భోజనాలు సమర్పించు అన్నాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నా పేరు మీద అతనే 500 తీశాడేమో అనుకున్నా. ఒక 500 ఇవ్వు అనట్టు సైగ చేసాడు. నేను ఇచ్చాను అనటం కన్నా, అతను లాక్కున్నాడు అంటే బాగుంటుంది. తీర్ధం తీసుకొని బయటకు వచ్చాను.

అమ్మవారు, అయ్యవార్ల దర్శనం అయిపోయింది కదా అని వచ్చిన దారిలోనే బయటకి వెళ్లబోయాను. మధ్యలో ఒకామె నిలబడి.. అటు వైపు ఇంకా గుళ్ళు ఉన్నాయి, అటు నుండి వెళ్ళాలి అన్నది. అక్కడ వరుసగా నాలుగు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. మొదట వినాయక మందిరంలో పూజారిగారు  , అవే ప్రశ్నలు అడిగారు. తీర్ధం ఇచ్చాక ఒక వంద నోటు తీసి నాకు చూపించి, ఇందాక గుళ్ళో చెప్పినట్టే చెప్పి వంద లాకున్నాడు. ఇలా మిగితా మందిరాలలో కూడా వంద కాగితం చూపించటం, నా దగ్గర వంద లాగటం జరిగింది.

ఆ నాలుగు ముగించుకొని బయటకు వచ్చాక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందన్నారు. అక్కడ పంతులుగారికి కాసిన్ని ఎక్కువ మంత్రాలు వచ్చులాగుంది... ఎక్కువ సేపు చదివి, 500 నోటు బయటకు తీసి, నన్ను ఒక 500 ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. నా జేబులో చూస్తే వంద కాగితం మాత్రమే ఉన్నది. చేసేది లేక, నా దగ్గర ఉన్న ఆఖరి వంద కాగితం కూడా పళ్ళెం లో పెట్టి ఇచ్చాను. "నేను 500 అడిగితే, 100 కాగితం ఇస్తావా? నాకు గిట్టుబాటు కాదు. నీ లాంటి వాళ్ళు గుళ్ళకు ఎందుకు వస్తారో?" అన్నట్టు నా వైపు, నీచంగా చూశాడు. చేసేది లేక తల దించుకొని బయటకు వచ్చాను. ఆ విధంగా పంతుళ్ళందరూ కలిసి అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు.

నాకు మొదలే గుళ్లకు వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా చిరాకు. ఇలాంటి సంఘటనలు చూసి ఆ చిరాకు పదింతలు అవుతున్నది. దోచుకోవటం అంటే మరీ ఇలానా??? దీనికి పరిష్కారం లేదా???

15 comments:

 1. గుళ్ళల్లో ఈ మధ్యకాలంలో వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయిందండీ,ప్రతీదీ వ్యాపారమైపోయింది.గుడికి వెళ్ళిన భక్తులకి మంచి దర్శనం అయిందన్న తృప్తి కూడా ఉండనీయట్లేదు ఈ దుర్మార్గులు.

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి, ప్రతిదీ వ్యాపారమైపోయింది

   Delete
 2. బాబూ, బెజవాడ అమ్మవారి గుడి బయట ఎక్కడా చిన్న గుడులకు పోకు, వెళ్ళినా అర్చన చేయించుకోకు. చక్కగా ఆ 1000 రూపాయలతో ఏ చండీ హోమమో చేయించాల్సింది అమ్మవారి గుడిలో!
  ఆ చిన్న గుళ్ళలో పూజారుల మంత్రాలు విన్నావా? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో, సగం తెలుగు సగం సంస్కృతమూనూ, ఏదో ఒక్క భాషలో ఏదవవచ్చు కదా! రెండు భాషలు కలిసి కొన్ని సందర్భాలలో అపార్ధం వచ్చేలా కూడా చెప్పేస్తుంటాడు.
  అలాగే ఆ చిన్న గుళ్ళు‌(శివ కామేశ్వరీ-వినాయకుడు-నటరాజు ఆలయాల బయట) అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు, కనీసం అమ్మవారి వద్ద పెట్టకుండానే తెచ్చి అమ్మేస్తుంటారు!

  ReplyDelete
  Replies
  1. ఈ ముక్క నేను గుడికి వెళ్ళక ముందే చెప్తే బాగుండేది… అయినా, నువ్వు క్రితం వెళ్ళినప్పుడు మర్యాదలు బాగా జరిగాయి అన్నట్టు గుర్తు

   Delete
  2. Vaallalo Chalaa mandi vidya rani vaare. Permanent archakulu bayata karyakramalu oppukuntu tama badulu ilaanti varini gullo kuchobedutu untaru. Vallu valla vakchaturyam to ilaa sampadinchukuntu untaru. Meeku telusa.. Veellu rojuki veyyi kallajuste kani konda digarata.

   Delete
  3. naaku telisi 1000 kudaa takkuve

   Delete
 3. Chalaa porapatu chesaru. Gullalo Yevaraina mee peru gothram adigite o chupu chusi navvukuntu vellipondi. Vallaki ardham aypotundi, valla pappulu udakavani. Inkokka mata kuda matladaru. Durga gude kadu, e gullo ayina inte varasa.

  ReplyDelete
  Replies
  1. అనుభవం వచ్చింది కదా… ఇంక చెప్పను

   Delete
 4. ganeshkv621@gmail.com5/10/14, 3:58 PM

  mee amta kaakapoina naaku komchem bakti vumdi.eppudaina gudi mumdunumchi velutumte, lopaliki veladaamu anukunnamtane naa drusti jebuloni dabbula meedaku velutumdi.dabbulu veyyani baktudini pujaarlu choose choopulu gurthuku vachi bayate dannam pettukoni velataanu.

  ReplyDelete
 5. రహ్మానుద్దీన్ గారి సలహాయే నాదీను. మన వినోదం లాగే మన మనశ్శాంతి కూడా ఇతరులకు వ్యాపారం. పంతుళ్ళు కూడా మనలా సమాజంలో భాగమే. మనకున్న అవసరాలూ, ఆకాంక్షలూ ఉన్నవాళ్ళే. మన ఇన్సెక్యూరిటీలే వాళ్ళకీను. వాళ్ళ మీద కోపం వద్దు. ఆ మంత్రాలేవో నేర్చుకుని మన పూజ మనం మనింట్లో చేసుకోకపోవడం మనదే తప్పు. నేనైతే ఏ గుడికీ వెళ్ళను. శుభ్రంగా నా పూజ నేను చేసుకుంటున్నాను.

  ReplyDelete
 6. Mana desham lo devudlu janalaki bayapadi already kondalu yekke saaru
  ayyina manollu vallani prashamtham ga vunda niyakunda .. akkad kooda business chesthunaru ..

  Collection lo TTD, Bezawada temples yentha strong ga vuntayoo ...ila janalni dochukovatam lo kooda first ye vuntayi ..

  nenu bezawada lo periganu .. mohana vibhudhi pulimi 10, 20 adige panthulani chusanu .. inflation perigindhi .. so I guess 500 is justified :)

  Any ways .. Happy Married Life ..
  500 ke blog update chesthe .. aa tharvatha .. bhava sagaram lo vache vaatiki inka yenni kadhalo , novels oo :)

  ReplyDelete
 7. Wonderful goods from you, man. I've understand your
  stuff previous to and you're just too excellent. I really like what you've acquired here, really like
  what you are stating and the way in which you say it. You make it entertaining and you still take care of to keep it
  smart. I can't wait to read far more from you. This is actually a great web site.


  My blog post ... grow taller 4 idiots

  ReplyDelete