Tuesday, August 21, 2018

ఇంకేం ఇంకేం ఇంకేం చావాలే... చాలే నీ గోలే


" ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే., చాలే చాలే ఇక చాలే " ఈ పాట పెళ్ళికి ముందు పాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే పెళ్లి అయిన తరువాత పాడితే ఎలా ఉంటుందా అని రాయటం (అదే కంపు చేయటం) మొదలు పెట్టాను. అస్సలు చరణాలు మార్చాల్సిన అవసరమే రాలేదు.

పల్లవి ||
ఇంకేం ఇంకేం ఇంకేం చావాలే... చాలే నీ గోలే...
నీకై నువ్వే వచ్చి చచ్చావే .. ఇకపై నా ఖర్మే .. 
గుండెల పైనా పాశం వేశావే .. 
గుమ్మంలోకి నరకం  తెచ్చావే.. 
నువ్ పక్కనుంటే పాకిస్థానేలే.. 
నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే


చరణం || 
ఊహలకు దొరకని బరువా .. 
ఊపిరిని సలపని గొడవా .. 
నా వల్ల కాదని తెలుసా.. 
పెట్టే ప్రతి నసా .. 
నీ కనుల రుస రుస  వరసా.. 
రేపినది మనసున  రభసా.. 
ఉలికి పడు కలలకు బహుశా.. 
ఇది మెలుకువ దశా.. 
నీతోటి నవ్వును ఊహించేశా 
లాగటం కొండకు ఒక పురికొసా 

చరణం || 
మాయలకు కదలని మగువా..
మాటలకు కరగని మదువా..
పంతములు విడువని బిగువా..
జరిగినదడగవా????
నా కథను తెలుపుట సులువా?
జాలిపడి నిమిషము వినవా?
ఎందుకని గడికొక గొడవా?? చెలిమిగ మెలగవా...
నా పేరు తలచితే ఉబికే లావా..
చల్లబడి నను నువు కరుణించేవా?
ఇంకేం ఇంకేం ఇంకేం చావాలే... చాలే నీ గోలే...
నీకై నువ్వే వచ్చి చచ్చావే .. ఇకపై నా ఖర్మే ..

5 comments: