అమ్మాయిలు నాకు అస్సలు అర్ధం కారు. అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళకైనా అర్ధం అవుతుందో లేదో అని నా అనుమానం. రోజు పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఎంతో మంది అమ్మాయిలని చూస్తుంటాము. వాళ్ళల్లో చాల మంది దగ్గర ఫోన్లు ఉంటాయి. ప్రతి అమ్మాయి ఎవరితో ఒకరితో ఫోనులో రోజుకి 24 గంటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ నాకెందుకు ఎవరూ ఫోన్ చేయరు? నాతోనే అనుకున్నా, నా స్నేహితుల్లో చాలా మంది ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలతో మాట్లాడతారు? వాళ్లు అబ్బాయిల నుంచి ఏమేమి లక్షణాలు ఆశిస్తారు? సాదారణంగా ఈ రోజులలో అందమైన అమ్మాయిలు ఎందుకూ పనికిరాని వెధవలనే ఇష్టపడుతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? తప్పు ఎవరి దగ్గర ఉంది? ప్రేమ గుడ్డిది లాంటి కాకమ్మ కబుర్లు పక్కన పెడితే, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.
చాలా మంది చెప్పారు, అమ్మాయిలు బాగా, తమాషాగా మాట్లాడే వాళ్లని ఇష్టపడతారు అని, కాదు బాగా జుత్తు ఉన్న వాళ్లని ఇష్టపడతారు అని కొందరు, మంచి మనసు ఉండాలి అని కొందరు( కొరికి చూస్తె తెలుస్తుందేమో మంచి మనసో కాదో), తెల్లగా ఉంటే ఇష్టపడతారు అని ఇంకొందరు, బాగా చదివే తెలివిగల్ల వాళ్లని ఇష్టపడతారు అని, కాదు కాదు ఆరు పలకల శరీరం ఉండాలి అని, ఇవ్వన్ని కాదు డబ్బు ఉంటె చాలు అని రక రకాలుగా విశ్లేషించారు. ఇక మన విషయానికి వస్తే తమాషాగా మాట్లాడటం చేతగాక పోగా పెడ పెడగా, వెటకారంగా మాట్లాడటం అలవాటు. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత జుత్తు కూడా అంతంత మాత్రంగానే ఉంది, మనసు కూడా ఏమంత మంచిది కాదు, తెల్లగా మహేష్ బాబు లాగా ఉండము, ఇక ఈ జామున చదువు, డబ్బు సంగతి ఎందుకులే, పొట్ట తప్ప పలకలు లేవు. చివరికి ఒక్క లక్షణం కూడా అనుకూలంగా లేదు. ఇక అమ్మాయిలు ఇష్టపడే అవకాశమే లేదు. కాబట్టి రాత్రులు గంటలు గంటలు నిద్ర చెడగొట్టుకొని ఫోనులో మాట్లాడే బాధ లేదు. శని, ఆది వారాలు డబ్బులు ఖర్చు చేసి కాపలా కుక్కలా అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఒక్క ముక్కలో వెధవలం కావాల్సిన పని లేదు.
చిత్రాలలో చూపిస్తుంటారు కదా, కధానాయిక కనపడగాల్నే కధానాయకుడికి వెనక ఒక పది మంది గిటార్, వయలిన్ వాయిస్తునట్టు అనిపిస్తుంది. నాకు ఎంతో మంది అమ్మాయిలని చూసినప్పుడు అలా అనిపించింది, పది మంది కాదు వంద మంది వాయించినట్టు అనిపించింది. కానీ చూసి అక్కడితో వదిలేయాలి. అంతే కాని ప్రేమ పెళ్లి అంటే ఎలా? ఎంత మందినని చేసుకుంటాం. ఇంకొన్ని చిత్రాలలో కధానాయిక పాప గుళ్లో అందంగా భక్తి పాటలు పాడుతుంటుంది. మన కధానాయకుడికి దేవుని మీద నమ్మకం ఉండదు, అదేంటో గుడికి వెళ్తే మనోడికి నామూషి, అందుకని వాడి అమ్మో, అక్కో గుడికి వస్తే తోడుగా వచ్చి బయట నుంచుంటాడు తప్ప గుళ్లోకి రాడు. కానీ కధానాయిక పాప పాట వింటే మాత్రం వస్తాడు. నేను ఎన్ని సార్లు గుడికి పోయినా ఒక్క అమ్మాయి కూడా పాట పాడటం వినలేదు. మీకు ఎవరికైనా అలాంటి గుళ్లు తెలిస్తే నాకు తప్పకుండా చెప్తారు కదూ!!!!! కాలేజీలో ఎంతో అందమైన అమ్మాయిలు ఉంటారు, కానీ ఒక్కళ్లు నా తరగతిలో ఉండే వారు కాదు, అలానే నా కార్యాలయంలో కూడా ఎంతో అందమైన అమ్మాయిలు, కానీ ఏ ఒక్కరూ నాతో కలిసి పనిచేయటంలేదు.
నిన్న నా స్నేహితుడు ఒక తమాషా మాట చెప్పాడు, "ఒక అమ్మాయిని అయితే "ఎవడు నువ్వు ప్రేమించిన వెధవ?" అని అడుగుతారు, అదే అబ్బాయిని అయితే "వెధవ ఎవరూ రా ఆ అమ్మాయి?""అని అడుగుతారుట. అంటే చివరికి మనమే ఎదవలం అనమాట!!!! అంటే అమ్మాయిలు వెధవల్నే ప్రేమిస్తారా? లేక వాళ్లు ప్రేమించిన తర్వాత అబ్బాయిలు వెధవలు అవుతార?? ఇది కూడా నాకు అర్ధం కానీ ప్ర.శ్నే.
కానీ ఫలానా అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి కాదన్నదని, ఆత్మహత్య చేసుకునేవాళ్లని చూస్తే నాకు జాలేస్తుంది. అమ్మాయిలు ఇష్ట పడకపోతే చావాలి అంటే మేము రోజుకు ఒక అరడజను సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అయినా కన్న తల్లితండ్రుల కోసం, పెళ్ళాం పిల్లల కోసం, మనమంటే ప్రాణాలిచ్చే స్నేహితుల కోసమో చావటం అంటే అర్ధం ఉంటుంది కానీ, అమ్మాయి కోసం చావటం ఏంటి? పాకిస్తాన్లో గొడవలు జరిగితే ఆంధ్ర ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనట్టు. అలా చావద్దు అని శంకర దాదా చిత్రంలో చిరంజీవి అన్నయ కూడా చెప్పాడు కదా. ఈ మధ్య అబ్బాయిలకోసం అమ్మాయిలు కూడా పురుగుల మందు తాగుతున్నారని వార్తా పత్రికల్లో చదివా. నా కోసం ఏ అమ్మాయి కనీసం మంచినీళ్ళు కూడా తాగటం లేదు. ప్రేమికుల రోజు కోసమని, ఏదో ఒక బహుమానం కొందాం అనుకున్న, కానీ ఏమి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో అర్ధం కాక ఆగిపోయా!!!
anni bane cheppav ram kani, preminchaledani ammaila ni himsinche vallani, acid lu pose chetta vedavala ni(sari ina mata doraka ledu) marchi poyav
ReplyDeletealanti edavalameeda raayatam dandagani asalu prasthavinchaledu. Alanti vaalla gurinchi maatlaadukovadam anavasaram.
ReplyDeleteSamayam unnappudu thappakunda deeni meeda oka seershika raaddaam.
Keka.....
ReplyDelete