ఈ పాట "ఆజా నాచలె" చిత్రం లోని "ఓ రే పియ"
ఓ నా ప్రియా!!
తోలి చూపులోనే, నను దోచినావే, నీ స్పర్శతోనే మైమరచినానే,
|| ఓ నా ప్రియా ||
చరణం:
ఆకల్లేదే, దాహంలేదే, నీ ప్రేమలో పడ్డాకనే
వయ్యారి నీ వాలుజడతో భందిమ్చకే
హరివిల్లులానీ నడుమూగుతుంటే , అది తడమకుండా నేనుండలేనే,
|| ఓ నా ప్రియా ||
చరణం:
నాకే నేను గుర్తుకురాను, నీ మీదనే నా ఆలోచనే,
సొంతం అవుతా ఇక పై నీకే, దరిచేరవే
ప్రతి ఘడియలోనూ నీ ఊసులేనే, క్షణమైనా నిన్ను విడిచుండలేనే
|| ఓ నా ప్రియా ||
చరణం:
అంతేలేని ఆసలు ఎన్నో, ఉప్పొంగెనే,
సుందరినీ సొగసుతోనే, చంపెయ్యకే
ఏమాయో చేసి, యద గిల్లినావే, ఏ కష్టమైనా , నాతోడు నీవే
|| ఓ నా ప్రియా ||
No comments:
Post a Comment