నేనేంటి? ఈ ప్రశ్ననాకు నేను చాలా సార్లు వేసుకున్నాను. పుట్టిన పాతికేళ్ళ తర్వాత, నేనేంటి అని ప్రశ్నించుకుంటే, అన్ని సార్లు నేనెంత? అనే సమాధానమే వచ్చింది. నేను ఏమి సాధించాను? నేను చాల కలలు కన్నాను. ఏ ఒక్కటి సాధించలేక పోయాను.
చిన్నప్పుడు బాగా పాటలు పాడేవాడిని, ఇప్పుడు పాడితే చంపేస్తాం అంటున్నారు.
కొన్ని రోజులు వైద్యుడిని అవుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు రోగిని అయ్యాను.
కత్తి లాంటి కళాశాలలో చదవాలనుకున్నా, కానీ కాలవ పక్కన కళాశాలలో చదివా.
కలెక్టర్ అవుదామని అనుకున్నా, కార్మికుడిని కూడా కాలేకపోయా.
ప్రజా ప్రతినిదిని అవుదామని అనుకున్నా, కనీసం ఓటు హక్కు కూడా పొందలా.
రక్షకబటుడిని అవుదామని అనుకున్నా, నన్ను నేనే రక్షించుకోలేక పోతున్నా.
ఆరు పలక దేహం పొందాలనుకున్న, అరకిలో పొట్టతో ఉన్నా.
బ్యాంకులో అధికారిని అవుదామని అనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన కాలేకపోయా.
మా కళాశాలలోనే ఉపాధ్యాయుడిని అవుదామని అనుకున్నా,నాలా ఇంకో నలుగురినీ చెడగొట్టటం ఇష్టం లేక ఆగిపోయా,
ఇలా ఎన్నో కలలు కన్నా, కానీ ఏది సాదించలేకపోయా,
కొన్ని కర్మ కాలి అవ్వలేక పోయా, కొన్ని కాలం కలిసి రాక అవ్వలేక పోయా.
కొన్ని బలిసి అవ్వలేకపోయా, కొన్ని బద్దకంతో అవ్వలేకపోయా.
కొన్ని అశక్తితో అవ్వలేకపోయా, కొన్ని అనాసక్తితో అవ్వలేకపోయా.
కానీ మా మిత్రుడు హరీష్ చెప్పిన్నట్టు "ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది, ప్రతి కుక్కకి ఏదో ఒక కళ ఉంటుంది, ఆడిన ఆటలో గెలవటం కన్నా, ఆ ఆట మంచిగా ఆడటం ముఖ్యం. మనకు దేనిలో ప్రావీణ్యం ఉందొ అందులోనే రాణిస్తాం, మనకూ ఒక రోజు ఉంటుంది" . అందరు శ్రీరామా చంద్ర లాగా ఉంటే, అతనికి మిగితా వాళ్ళకి తేడ ఏముంటుంది? అందుకే నా రోజు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నా,
No comments:
Post a Comment