మొన్న ఆ మధ్య ఒక చిన్న పని మీద బెంగళూరు వెళ్లి, పని అయిపోయాక, హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాను. విమానాశ్రయంలో ఒక గంట ఆలస్యంగా నేను ఎక్కాల్సిన విమానం వచ్చింది. అలవాటు ప్రకారం నా మానాన నేను వెళ్లి నాకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్నాను. ఇంతలో నా ప్రక్కన ఎవరో అందమైన అమ్మాయి కూర్చున్నది. తీరా చూస్తే ఆ పాప ఎవరో కాదు., ఇటీవల విడుదల అయ్యి సంచలనం సృష్టించిన "తిక్కలోడు తింగరిది" చలనచిత్రంలో కధానాయిక. దగ్గరగా చూసేసరికి ముందు భయమేసింది. నిధానంగా తేరుకోవటానికి పది నిముషాలు పట్టింది. మీకు తెలిసిన విషయమే., అన్నం లేకపోయినా ఉంటాను కాని, ఏదో ఒకటి మాట్లాడకపోతే నేను బ్రతకలేనని. అందుకే ఆమెతో నన్ను నేను పరిచయం చేసుకున్న., పనిలో పనిగా ఆమెని చాలా ప్రశ్నలు అడిగా. ఆ ముచ్చట్లు అన్నీ, ప్రత్యేకంగా మీ కోసం.,
నేను: నేను మీకు పెద్ద అభిమానినండి. మీ "తిక్కలోడు తింగరిది" చలనచిత్రం అర్ధం కాక పది సార్లు చూశానండి. మీ చిత్రాల కోసం ముక్కు చెవులు కోసుకుంటున్నాను అని, వైద్యులు మీ చిత్రాలు చూడొద్దు అన్నారు. మీరు చాలా అందంగా ఉంటారండి. మీరు అందానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా?
పాప: లేదండి, అందం కోసం నోరు కట్టేసుకోవటం నాకు ఇష్టం ఉండదు, అన్ని తింటాను, కాకపోతే వ్యాయామం చేస్తాను అంతే. నేను: "తిక్కలోడు తింగరిది" చలనచిత్రంలో కధానాయకుడు సంజయ్ తో మీరు చాలా బాగా చేశారండి, ఆయనతొ పని చేయటం ఎలా అనిపించింది?
పాప: తను చాలా సరదా మనిషి. ఒక పెద్ద కథానాయకుడిని అన్న అహం అస్సలు లేదు. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తనతో చేయటం నిజంగా నా అదృష్టం. తన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను.
నేను: మీకు, కధానాయకుడు సంజయ్ మధ్య ఏదో నడుస్తుంది అని అంటున్నారు? ఎంత వరకు నిజం.
పాపా: నేను అస్సలు అలాంటివి పట్టించుకోను. మేము మంచి స్నేహితులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఏమి లేదు. ఈ పత్రికల వాళ్ళు ఏది అనిపిస్తే అది రాస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ నాన్నలకి మాత్రమే నేను సమాధానం చెప్తాను.
నేను: మీ క్రొత్త చిత్రం సంగతులు ఏంటి?
పాప: everyone is very supportive in the unit. The whole set is like a family, I m really gonna miss them all. It just went like a vacation. Director sir gave us so freedom that we dint feel we were shooting.. !!! that too hero Sanjay is an amazing actor and dancer. We had lot of fun together.

నేను: (తెలుగు మాధ్యమం కదా, నాకేమి అర్ధంకాలా!)మొదటి సారి నటించేటప్పుడు ఎలా అనిపించింది?
పాప: నా మొదటి సినిమా "పిచ్చోడి ప్రేమ".., మొదట్లో భయమేసింది. కాని దర్శకుడు, కధానాయకుడు నన్ను బాగా ప్రోత్సహించారు. వాళ్లకి నా కృతఙ్ఞతలు.
నేను: తెలుగు పరిశ్రమ ఎలా ఉంది?
పాప: చాలా బాగుందండి. హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. తెలుగు పరిశ్రమలో అందరు ఆప్యాయంగా చూస్తారు.
నేను: మీరు ఎలాంటి చిత్రాలని ఎంచుకుంటారు?
పాప: ముందు నాకు కథ నచ్చాలి. నా పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను.
నేను: మీరు ఇప్పుడు నెంబర్ వన్ కధానాయిక అంటున్నారు, మీకెలా అనిపిస్తుంది?
పాప: నేను ఇలాంటివి పట్టించుకోను. ఇంకా మంచి పాత్రలు చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వగలను. (ప్రేక్షకులకు దగ్గర అవ్వటం అంటే ఏంటో నాకు అర్ధం కావటంలే??)
నేను: అందాల ఆరబోతకు మీరు సిద్దమేనా?
పాప: అందులో తప్పేముంది., కధకు తగ్గట్టు ఆ మాత్రం అవసరమే.,
నేను: మీకు ఆదర్శం ఎవరు?
పాప: నాకు మా అమ్మే ఆదర్శం.
నేను: హిందీలో నటించ బోతున్నారని విన్నాను?
పాప: నటనకు భాషతో సంబంధం లేదండి. ఏ భాష అయినా, నటన ఒకటే. మంచి కధ దొరికితే ఖచ్చితంగా చేస్తాను.
నేను: వైవాహిక జీవితం గురించి మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళెప్పుడు?
పాప: అప్పుడే నాకు పెళ్ళేంటి? ప్రస్తుతం నా ధ్యాసంతా నటన మీదనే ఉంది. ఇంకా నేను ఎంతో నిరూపించుకోవాలి.
నేను: మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి?

పాప: నన్ను బాగా ప్రేమించే వాడు అయి ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, ముక్కు సూటి వాడై ఉండాలి, ముఖ్యంగా మంచి మనసుండాలి, నన్ను బాగా అర్ధం చేసుకోవాలి.
నేను: మీ భవిష్యత్తు ప్రణాలికలు ఏంటి?
పాప: ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి. గొప్ప పేరు తెచ్చుకోవాలి.
నేను: చాలా సంతోషమండి, ఇక ఉంటా సెలవు.
అప్పటికే హైదరాబాద్ చేరుకున్నాం. విమానం దిగి ఎవరి దారిన వారు వెళ్ళిపోయాం.
ఇంతకీ ఎవరా కధానాయక అని మీకు అనుమానం, అవునా?? మీకు ఇష్టం వచ్చిన కధానాయిక పేరు పెట్టుకోండి. ఎందుకంటే., పాప ఎవరైనా ఇచ్చే సమాధానాలు ఇవే కాబట్టి. నమ్మేశారా?? ఇంత అమ్మయకులు కాబట్టే నా శీర్షికలు చదువుతున్నారు. అయినా విమానం ఎక్కివెళ్లి మరీ చేసేంత రాచకార్యాలు నాకేమున్నాయి? చెప్పండి? ఏదో తమాషాకు చెప్పా. కనీసం ఊహల్లో అయినా విమానంలో విహరిద్దాం అని. మొన్ననే నేను మా హరీష్ ఈ విషయం మాట్లాడుకున్నాం. సాధారణంగా పత్రికలలో అందరు కధానాయికలకు ఒకే ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఒకే లాగ సమాధానమిస్తారు అని. ఎలా ఉంది మన కధానాయిక పాపతో కమ్మని కబుర్లు???
good
ReplyDeleteliked it
ReplyDeletemama chala baga rastunavu ra
ReplyDeletenanu ni serishakalu anni chadivanu
modati prasna ki samaadaanam poorti aye lope naaku sandeham vachindi konchem nijamlaa ledani :-P
ReplyDelete