మైసూరుపాక్ లో మైసూరు ఉంటుందా? బందరు లడ్డులో బందరు ఉంటుందా? అలానే తెలుగు చిత్రాలలో తెలుగు ఉండదు. ఇది సత్యం. ఇటీవల విజయవంతం ఐన రెండు తెలుగు చిత్రాల పేర్లు చెప్పండి? "Mr.Perfect", "100%Love". పేర్లు మాత్రమె ఆంగ్లంలో ఉన్నాయి అనుకుని వెళ్ళాను. కానీ చిత్రం ఆసాంతం ఆంగ్లంలోనే ఉంది. ఆఖరికి పాటలు కూడా ఆంగ్లంలోనే ఉన్నాయి. "Infactuation" అని, నా పిండాకూడని పాటల్లో కూడా ఆంగ్ల పదాలే ఎక్కువ వినపడ్డాయి. ఈ మధ్య ఆంగ్లంలో మాట్లాడటమే అనుకున్నా, పాటలు రాయటం కూడా ఒక వేలంవెర్రి అయ్యింది. తెలుగులో చక్కని పదాలతో రాసే అవకాశం ఉన్నా, రాయటంలేదు. ఉదాహరణకు Mr.Perfect చిత్రంలోని ఈ పాటని చూద్దాం.
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై ride చేసెయ్, rocket లా మనసుని
సై సై సై side చేసెయ్, signals తో ఎం పని?
ఇక hi-way లైన one-way లైన కదలదే బండి तेरे बिना
ఈ పాటని చక్కగా తెలుగులో ఎంత సరళంగా రాయచ్చో చూద్దాం.
ఆకాశం బద్దలైన మోత గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న కాంతి కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై రయ్యిమంటూ, రోజంతా గడవని
సై సై సై సిగ్గు దోచేయ్, సమయంతో ఎం పని?
ఇక ఏదేమైనా, ఎప్పటికైనా కదలదే బండి నువ్వులేకున్న!!
ఇలా తేట తెలుగులో రాస్తే ఎంత బాగుంది? చెప్పండి!!! ప్రాస కలిసింది, ఇక అర్ధం అంటారా? ఎ బూతు రాస్తే ఏంటి చెప్పండి? అందులోనే ఇంకొక చోట
"ఇక daating ఐన fighting ఐన గడవదే రోజు तेरे बिना(తేరే బిన)" అని రాసారు, దాని బదులు
"ఇక సరసం ఐన సమరం ఐన గడవదే రోజు నువ్వు లేకుండా" అని తెలుగులో రాస్తే ఎంత కమ్మగా ఉంది!!!
ఆ तेरे बिना(తేరే బిన) అనే పదం పాటలో చాల సార్లు వాడారు. ప్రతి చోట తెలుగులో మార్చే అవకాశం ఉంది. కానీ రాయరు. అసలు ఆ పాటలో మొత్తం మీద 27 ఆంగ్ల పదాలు ఉన్నాయి. ఈ ఒక్క పాటే కాదు, ఇలా చాలా పాటలు ఉన్నాయి. తేట తెలుగు పాటని ఆంగ్లంతో తాట తీయటంతోటి, తెలుగు కనపడకుండా పోతున్నది.
పై పాట రాసినతని పేరు "అనంత శ్రీరామ్" అట!!!! పేరు ఐతే నా పేరుతొ కల్సింది కాని, నా అంత బాగా రాయాలంటే కష్టం కదా!! ఏదో తనకున్న పరిదిలో, తనకున్న పరిజ్ఞానంతో బాగానే రాసాడు. కాకపోతే తెలుగు పాటగనుక తెలుగులో రాస్తే బాగుండేది.
ఇది ఈ రోజు వచ్చింది కాదు. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు చిరంజీవి మామయ్య చిత్రంలో
"నవ్వింది మల్లె చెండు, నచ్చింది girl friend" అనే పాట మీకు గుర్తుండే ఉంటుంది. దానినే తెలుగులో చక్కగా
" నవ్వింది మల్లె చెండు, నచ్చింది జాంపండు" అని రాస్తే, బాల సుబ్రహ్మణ్యం గారికి పాడటం కష్టమవ్వదు కదా? రాయటం రాకపోతే నాలాంటి వాళ్ళని అడిగితె చెప్తాము కదా!!!!!!!
ఇలా చెప్పుకుంటూ పొతే చాల పాటలు ఉన్నాయి., మొన్నా మధ్య ఒక తెలుగురాని స్నేహితుడితో తెలుగు చిత్రానికి వెళ్ళాము. వాడు మొదట అర్ధం కాదేమో అని భయపడ్డాడు. "నీకు అర్ధం కాకపోతే నన్ను అడగరా చెప్తాను" అన్నాను. వాడు, చిత్రం ఆసాంతం మహా ఐతే ఒకటి రెండు సార్లు నన్ను అడిగి ఉంటాడేమో. ఆ చిత్రంలో కధానాయకుడు ఆస్ట్రేలియాలో ఇంజనీర్. మన కధానాయకుడు ఎక్కడైనా తెలుగులో మాట్లడతే ఈల వేద్దాం అని నా రెండు వెళ్ళు నోట్లో పెట్టుకుని కూర్చున్నాను . వేళ్ళు తడిసి ముద్ద అయ్యాయి తప్ప, మన కదానాయకుడు తెలుగులో మాట్లాడింది లేదు, నేను ఈల వేసింది లేదు. దీన్ని బట్టి అర్ధం అవుతుంది తెలుగు చిత్రాలలో తెలుగు ఎ మాత్రం ఉందో??
ఈ విషయం మీద నేను ఆ దర్శక నిర్మాతలతో మాట్లాడాను. "అనంతరామయ్య గారు, చిత్రాలు నిజ జీవితానికి దగ్గర తీయాలని ప్రయత్నించాము. మన వాళ్ళు తెలుగులో మాట్లాడటం తక్కువే కదా, అదే మా చిత్రంలో చూపించాం" అని అన్నారు.నిజామే కదా., ప్రతి కుక్కకి ఆంగ్లంలో మాట్లాడటం ఒక వెర్రి అయింది.
మొన్నా మధ్య విడుదలైన "కొంచం ఇష్టం కొంచం కష్టం" అనే చిత్రానికి దర్శక నిర్మాతలు తప్ప మిగిలిన వారెవ్వరూ తెలుగువారు కాదని తెల్సి ఆశ్చర్యపోయా. ఎలాగూ మనవాళ్ళకి తెలుగు కధానాయికలు నచ్చరు కాబట్టి కధానాయిక తెలుగు పాప కాదు, అస్సలు తెలుగు రాదు. కధానాయకుడు తెలుగు వాడు కాదు, సంగీత దర్శకుడు తెలుగు వాడు కాదు., అందరు తెలుగు వాళ్ళే ఉండాలా అంటే కాదు కాని, తెలుగు వాళ్ళైతే బాగుంటుంది అంటున్నాను. అంతేలే, తిరుమలలో గుండు చేయించుకొని, కొండ దిగొచ్చి ఎవడైనా తిరుపతిలో దువ్వెన కొంటాడా? జగన్ అన్న బొమ్మ లేకుండా సాక్షి దినపత్రిక వస్తుందా? ఆంగ్లం లేకుండా తెలుగు చిత్రాలు వస్తాయా? నా పిచ్చి కాక పొతే!!!!!
మొన్నా మధ్య విడుదలైన "కొంచం ఇష్టం కొంచం కష్టం" అనే చిత్రానికి దర్శక నిర్మాతలు తప్ప మిగిలిన వారెవ్వరూ తెలుగువారు కాదని తెల్సి ఆశ్చర్యపోయా. ఎలాగూ మనవాళ్ళకి తెలుగు కధానాయికలు నచ్చరు కాబట్టి కధానాయిక తెలుగు పాప కాదు, అస్సలు తెలుగు రాదు. కధానాయకుడు తెలుగు వాడు కాదు, సంగీత దర్శకుడు తెలుగు వాడు కాదు., అందరు తెలుగు వాళ్ళే ఉండాలా అంటే కాదు కాని, తెలుగు వాళ్ళైతే బాగుంటుంది అంటున్నాను. అంతేలే, తిరుమలలో గుండు చేయించుకొని, కొండ దిగొచ్చి ఎవడైనా తిరుపతిలో దువ్వెన కొంటాడా? జగన్ అన్న బొమ్మ లేకుండా సాక్షి దినపత్రిక వస్తుందా? ఆంగ్లం లేకుండా తెలుగు చిత్రాలు వస్తాయా? నా పిచ్చి కాక పొతే!!!!!
సశేషం.............
ha ha ha ...........good one.........
ReplyDeleteoutstanding dudes......
ReplyDeleteచాల బాగుంది అంతరామయ్య.....
kruthagnathalu @ leelakrishna & ravichandra.
ReplyDeletechala correct ga chepavu...........actually nenu kuda ilage feel ayya
ReplyDeletekadupubba navvinchaaru....kunda baddalukottinattugaa cheppaaru!!
ReplyDeletetelugu cineemaalalo TELUGU neti beerakaaya lo NEYYANTA!!
telugu cineemaalalo TELUGU SWACHATA , mana gavarnamentulo NIJAAYATEE ANTA!!
Sreelu
@sree: nenu cheppina sodantatini rendu mukkallo chaala baaga chepparandi
ReplyDeleteఅనంత రామయ్య గారూ, చాలా చక్కగా చెప్పారు. అయితే, ఆ పాటలు రాసిన వాళ్ళకి, తీసిన వాళ్ళకీ భాషాభిమానం లేదని చెప్పలేం. విభిన్నత కోసం, అలా వుండకపోతే వ్యాపారం కాదేమోనన్న అర్థం లేని భయం కూడా కారణం కావచ్చు. మంచి సృజన రావాలంటే కళాకారులకి తమ మీద తమకి నమ్మకం చాల ముఖ్యం. (మీ బ్లాగులో అది కనిపిస్తోంది.మీ సునిసితమైన చమత్కార శైలికి మరోసారి వందనాలు.)
ReplyDelete-ఆకునూరి మురళీకృష్ణ
నిజమే మురళీ కృష్ణ గారు, రచయితలను నేను తప్పు పట్టను, వాళ్ళు ఇంతకన్నా రాయగల సమర్ధులు. దర్శక నిర్మాతలకు భాషాభిమానం ఉందనే అనుకుందాము. అయితే అది రావణుడి అంశ అనట్టు, ధర్మం తెలియటం ముఖ్యం కాదు, దానిని ఆచరించటం ముఖ్యం అని చాగంటి గారు చెప్పినట్టు, భాషాభిమానం ఉంటే అది పాటల్లో కనపడాలి కదా. ఆంగ్లంలో రాస్తేనే వ్యాపారం అవుతుంది అనేది సాకు మాత్రమే
Deleteథర్మం తెలియడం వేరు, ఆచరించడం వేరు అన్నది మీకూ వర్తిస్తుందేమో ఆలోచించండి? మీరు మీ నవలకి రాం శృతి ల ప్రేమకథ అని కాకుండా రాం@శృతి డాట్.కాం అన్న పేరెందుకు పెట్టారు? నేను ఎవరినీ సమర్థించడం లేదు. అక్కడ ఆ పదాలు అవసరమని మీరు అనుకున్నట్టె ఆయా వ్యక్తులు కూడా ఆనుకుని వుండచ్చు. మాతృభాష మీద మమకారం వుండే రచయితలు అర్థం లేని భయాలని వదిలేస్తె మేలు జరుగుతుందని చెప్పాను. అంతే.
ReplyDeleteఆకునురి మురళీకృష్ణ
హహహ, నా మీదకే తిప్పారా బాణాన్ని, మీరన్నది నిజమే అని ఇప్పుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి. పాపం రచయితల భయాలు రచయితలవి, దర్శక నిర్మాతలు ఎలా చెబితే అలా రాస్తారు
Delete