"కాదేదీ కవితకనర్హం" అని మనం విన్నాం. కానీ ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మనం కొద్దిగా మార్చాల్సిన పరిస్థితి, "కాదేదీ వ్యాపారనర్హం". ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారమే. ఆఖరకు శవాల మీద కూడా వ్యాపారం చేసే వాళ్ళున్నారు. పోయిన నెలలో అలాంటి వ్యాపారాలు నేను రెండు చూశాను. మొదటిది పైన చెప్పినట్టు చనిపోయిన వాళ్ళని కూడా వ్యాపారానికి వాడుకోవటం. పుట్టపర్తిలో సత్య సాయి బాబా చనిపోతే., మన టీవీ వాళ్ళు ఆ వార్త మీద ఎంత వ్యాపారం చేశారో మనందరికీ తెల్సిన విషయమే. ఒక టీవీ ఛానల్ వాడు, " బాబా చనిపోయిన తర్వాత, ఆయన ముఖానికి శస్త్ర చికిత్స జరిగింది, అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అని" ఎక్కువ సేపు కాకపోయినా ఒక రెండు మూడు గంటలు పాపం బిడ్డ, బాధ పడ్డాడు. ఇంకొకరేమో " నెల రోజులముందే పార్ధివ దేహానికి పేటిక తెచ్చారు, దీని అంతర్యం ఏంటి? ఇందులో ఏదో రహస్యం ఉంది. అంటే వీళ్ళకి ముందే తెలుసా?" అని తమదైన శైలిలో ప్రశ్నల పరంపర కొనసాగించారు. (ముందుగా తీసుకురాకుండా, చనిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసి పేటిక తయారు చేయాలేమో?). ప్రతి విషయాని సంచలనం చేయాలి, వ్యాపారం బాగుండాలి అన్న ఉదేశ్యంతో, కనీస జ్ఞానం మరచిపోయి, ఏది పడితే అది చెప్తున్నారు, చూపిస్తున్నారు.
ఇక రెండో వ్యాపారానికి వద్దాం. మొన్నామధ్య సకుటుంబ సమేతంగా(నాకింకా పెళ్లి కాలేదండోయి!!) తిరుపతి వెళ్ళాం. దగ్గరలో ఒక దేవాలయం విశిష్టమైనది అని ఎవరో చెపితే ముందుగా అక్కడికి వెళ్ళాం. దాదాపుగా తిరుపతి నుంచి ఐదు గంటల ప్రయాణం అనుకుంటా. దేవాలయం బయట, మా ఊర్లో ఆంధ్ర బ్యాంకు కన్నా అందంగా, ఒక చిన్న S/W కార్యాలయం లాగా ఉన్నది. దేవుడు దయవల్ల, అందులో మనకు మూడు రకాల సదుపాయాలు కల్పించారు.
రెండు 100/- దర్శనం: నడవాల్సింది ఒక కిలోమీటర్ కు తగ్గించారు.
మూడు 500/- దర్శనం: దీనికే శీఘ్ర దర్శనం అని కూడా పేరు. నేరుగా గర్భగుడికి వెళ్లిపోవచ్చు.
నా ఆర్ధిక స్తోమత మీకు తెలియంది కాదు. పేదవాడిని, 500 సమర్పించుకోలేక, మధ్యస్తంగా 100/- ల దర్శనాన్ని ఎంచుకున్నాం. మా బామ్మగారికి 82 సంవత్సరాలు. కొంత దూరం ఐతే నడవగలదు. కానీ కిలోమీటర్లు అంటే కష్టం. దీనికి వాళ్ల దగ్గర ఒక ఉపాయం ఉందండో . 150/- కడితే మనకు ఒక తోపుదుకుర్చీ ఇస్తారు. అందులో వ్రుధ్ధులని దర్శనం చేయించి మళ్లీ గంటలో కుర్చీ వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వరు. గంటలో వస్తే 100/- వెనక్కి ఇస్తారు, ధర్మ ప్రభువులు. ఇందులో వాళ్ల మనుషులు తోస్తే ఇంకో 100/- ఎక్కువ తీసుకుంటారు. ఇన్ని సదుపాయాలు మనం ఎక్కడ చూసి ఉండం కదా!! నేనైతే చూడలేదు. సరే ఆ తోసేదేదో మనమే తోద్దాం, కనీసం "మాత్రుసేవా భాగ్యం" దొరుకుతుందని మా నాన్నగారే తీసుకెళ్ళారు.
ఈ దేవాలయం అంతా ఒక మహానుబావుడి సారధ్యంలో కట్టబడింది. ఇక ఆలయంలో అడుగు పెట్టగానే, దారికి ఇరువైపులా, విశాలాంధ్ర పుస్తక ప్రదర్సన మాదిరి పుస్తకాలు, CDలు, DVDలు, ఉన్నాయి. అన్నింటి మీద చూద్దాం అన్నా కానీ మాహానుభావుడి చిత్రం తప్ప ఎక్కడా దేవుడి చిత్రం కనపడితే ఒట్టు. ఇంకొంచెం ముందుకు వెళితే మాహానుభావుడి చిత్రం రక రకాల భంగిమలతో, దానికి తగ్గ నీతి వాక్యాలతో దర్శనమిస్తాయి. కొంచం సేపు అది అసలు అమ్మవారి గుడా? లేక మహానుబావుడి గుడా? అనేది మనకు అర్ధం కాదు. సరే చివరికి ఆలయంలోకి వెళితే అక్కడ కొబ్బరి కాయలు నిషేదమట!! కేవలం కుంకుమతోనే పూజట!!! అది కూడా మాహానుభావుడి పేరు మీద అక్కడనే డబ్బాలో పోసి అమ్ముతున్నారు. వాటిని కొన్నటానికి తిరునాళ్ళలో అంగళ్లు పెట్టినట్టు ఆడవాళ్ళు కేకలు వేస్తూ అమ్ముతున్నారు. నాకైతే అది కేవలం ఒక వ్యాపార కేంద్రంగానే అనిపించింది. ఎంత బంగారు గుడి ఐతే మాత్రం, అంత వ్యాపారమా??
గమనిక: "మీరు ఎంత సొమ్ము విరాళంగా ఇచ్చిన తీసుకొనబడును".
ఈ సందర్భంగా నాకు ఇంకో మహానుబావుడు జ్ఞాపకానికి వచ్చారు. ఈయన మాహాజ్ఞాని అట!!!! హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు, రోజుకి ఒక ప్రాంతంలో తన యొక్క "అనుగ్రహ భాషణాన్ని"(అంటే ఏంటో నాకు తెలియదు) అందిస్తారట!!! దానికి నగరం నిండా తెరలు(బ్యానర్) ప్రదర్శించారు. అందంగా పెద్ద పెద్ద విభూది రేఖలు పెట్టుకుని, ఇంకా అందమైన రుద్రాక్షలు ధరించి, కళ్ళు మూసుకొని జపం చేస్తున్న భంగిమలో ఒక చిత్రం, నించొని ఆసీర్వదిస్తునట్టు ఇంకో భంగిమలో మరో చిత్రం, ఇలా రక రకాల భంగిమలతో తెరలు ముద్రించారు. ఇది ఇంకో రకమైన వ్యాపారం. ఏంటో ఈ మధ్య మనుషుల్లో దేవుళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి ఒకళ్ళు తమకి తాము దేవుడిని అని చెప్పుకోవటం, వాళ్ళకింద ఒక గుంపు చేరి పూజలు చేయటం., భజనలు చేయటం, ఆ తరువాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు ముద్రించటం, తమ గుంపును పెంచుకోవటానికి ప్రచారాలు చేయటం, చూడలేక పోతున్నా!!!
ఇది ఇలానే కొనసాగితే మనుషులకన్నా దేవుళ్ళు ఎక్కువ అయిపోతారేమో?? నాకు ఇంకో ఆలోచన కూడా వుంది, నేనే పేరు మార్చుకుని "రామానంద్ బాబా" అనో "రామానంద స్వామి" అనో పెట్టుకుని నన్ను నేను దేవుడిగా ప్రకటించుకుంటా. మీరంతా అప్పుడు నా భక్త గుంపులో చేరతారు కదూ!!!!
chala bagundoi, telugu leni telugu pata, telugu vachkam rani telegu natulu, telugudanam lenide mana telegu cinima sume ani chakka ga cheppavu. (nenu teluguni english lo script chesinattu undi mana telegu cinima paristhithi kadu dusthithi)
ReplyDeletevellure tamil nadu worst place in world
ReplyDeleteగంటలో వస్తే 100/- వెనక్కి ఇస్తారు, ధర్మ ప్రభువులు. :-) manushulu chesina devudu lol...kiran stubborn
ReplyDeleteమీరు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా అనుభవించి రండి, ఆ కిక్కే వేరబ్బా.... :P
Delete