Friday, April 4, 2014

బ్యాంకు క్లర్కుకి, సాఫ్ట్ వేరుకి పెళ్లి చేసె పాడు లోకం

"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపోయే వెలుగుని ఇస్తుంది!!!!!

"మొత్తానికి కవిగాడి పెళ్లి కుదిరింది" అని స్నేహితులు అంటున్నారు. ఆ కవిగాడిని నేనే.., ఆ పెళ్ళీ నాకే (నేను కవిని ఎప్పుడు అయ్యానో..., ఇప్పుడు అనవసరం). ఇప్పటికీ చాలా రోజుల తరువాత నన్ను కలిసిన పెద్ద వాళ్ళు, "ఇప్పుడు ఏమి చదువుతున్నావు బాబు?" అని నన్ను అడుగుతూ ఉంటారు (దాని అర్ధం, నేను ప్రతి తరగతిలోనూ తప్పుతాను అని కాదు). అలాంటి నాకు, అప్పుడే పెళ్లి అనే సరికి ఆశ్చర్యం వేస్తున్నది. ఎంత ఆశ్చర్యం అంటే, సాక్షిలో చంద్ర బాబు గారినీ, ఈనాడులో జగన్ అన్నని పొగిడినంత ఆశ్చర్యంగా ఉందంటే నమ్మండి. 

"పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ" అన్నారు ఆచార్య ఆత్రేయ గారు. ఎందుకు వేడి ఎక్కదు ? ఎండాకాలంలో పెళ్లి పెట్టుకుంటే. విజయవాడలో అందునా ఏప్రిల్ ఎండల్లో పెళ్లి చేసుకోవటం, నా జీవితంలో నేను చేయబోతున్న మొదటి సాహసం. ఏప్రిల్ 18, శుక్రవారం నాడు ముహూర్తం నిశ్చయించారు. ఐదు రోజుల పెళ్లి  చేసుకుంటున్నాను కాబట్టి, మీరు సోమవారం నుండే సెలవలు పెట్టి మరీ రావాల్సిందిగా విజ్ఞప్తి.  







బొచ్చె కూడు కూడా ఏర్పాటు చేయదలిచాము. తిని, మా పేర్లు కలిసినట్టే, మేము కూడా కలిసి ఉండాలని దీవించి వెళ్లవలసినదిగా కోరుతున్నాను . మీరు అందరి రాక కోసం ఎదురు చూస్తూ... అప్పటి వరకు "బ్యాంకు క్లర్కుకి, సాఫ్ట్ వేరుకి పెళ్లి చేసె పాడు లోకం " అని పాడుకుంటూ ఉంటాను.


25 comments:

  1. అనంతసీతారామదీప్తులకు శుభాకాంక్షలు,శుభోజ్జయం కలగాలి

    ReplyDelete
  2. మంచి కబురు .
    congratulations .

    ReplyDelete
  3. RAM wed SEETA, perlu kuda chala baga kalisayi ram. Congratulations...

    ReplyDelete
  4. అద్దంకి అబ్బయికి అభినందనలు...అబ్బాయి గారు పెళ్లికి తర్వత అమ్మాయి ఇంటి పేరు మార్చలనుకుంటే
    అమ్మాయి గారు అంత కంటే ముందే పేరు చివర అబ్బాయి పేరుని తగిలించుకున్నారు...
    సీతారాముల జంటల్లే రాధ క్రిష్నుల ప్రేమల్లే మీ బంధం పాలు తెనేలా వెలుగు దివ్వెల కలిసిపోవాలని ఆకాంక్షిస్తున్నాను

    ReplyDelete
  5. Only son and only daughter getting married? LOL. Congratulations BTW.

    ReplyDelete
  6. excellent boss...

    but paadu ane maata vadhhu. adi okati teseyyandi.

    Meeru idhharau kalakalamu sukha sntoshalatho undalani korukuntu.

    ReplyDelete
  7. Happy married life..wow, 5 rojula Pelli...

    ReplyDelete
  8. hi , memu kudaa raavachaa? mee frnds kenaa

    ReplyDelete
    Replies
    1. meeru na blog chadivaru ante, naa friends ane ardham

      Delete
  9. Congratulations Ram & Sita, Wish you good luck and have a happy married life ahead :)!

    ReplyDelete
  10. Congratulations and All the best!

    ReplyDelete
  11. shubhabhinandananlu Anantaram garu :)
    mee vaivahika jeevitham sukha, shanthulatho varthillalani korukuntunnanu.

    ReplyDelete
  12. మంచి కబురు .
    congratulations .

    ReplyDelete
  13. కవి గాడికి పెళ్లి కుదిరింది .... తిక్క కూడా కుదరాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాభినందనాలు తెలుపుకుంటున్నాము :)

    ReplyDelete
    Replies
    1. హ హ హ ధన్యవాదాలు అన్నా

      Delete
  14. శుభాకాంక్షలండి.

    ReplyDelete
  15. Congratulations Ananth Ram. Happy married life. All the very best.

    ReplyDelete
  16. Congratulations Ananth Ram. Happy married life. All the very best.

    ReplyDelete
  17. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

    ReplyDelete
  18. అభినందనలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు

    ReplyDelete