Saturday, October 29, 2011

కళాబంధు మా శ్రీరామ చందు


ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒక రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. రోజు ఎనిమిది గంటలకు ఈటివిలో చందు పాట పాడుతున్నాడు అనేది సారంశం. తను పాటలు పాడతాడు అని తెలుసు, కానీ టివిలో పాడేంతగా అని అనుకోలేదు.

పూర్వాశ్రమంలో నేను మా బడిలో పాటలు పాడేవాడిని(కంగారు పడకండి, ఇప్పుడు పాడటంలేదు). అబ్బో రోజులే వేరు. నేను పాడుతుంటే చపట్లు కొట్టాలా? లేక నన్ను కొట్టాలా?? అని ఆలోచించే లోపు నేను వేదిక దిగిపోయేవాడిని. ఇప్పుడా ముచ్చటంతా ఎందుకులే కానీ, విషయానికి వద్దాం. ఎక్కడున్నాం? ....... ఎనిమిది గంటలకు టివిలో అనే సరికి అందరం టివిలకి అతుక్కు పోయాము. మనోడు రోజు పాట ఇరగదీశాడు. నా అంత బాగా కాక పోయినా, నేను అనుకున్న దానికన్నా చాలా బాగా పాడాడు. ఒక్కింత బాధ (నేను స్థాయికి వెళ్ళలేక పోయానే అని), ఒక్కింత ఆశ్చర్యం, ఆనందం (మనోడు చాలా బాగా పాడాడు అని).

క్షణం అనిపించింది నేను సంగీతం నేర్చుకుంటే బాగుండేది అని. సహజమే., సచిన్ ని చూసి క్రికెటర్, జే.పి.ని చూసి కలెక్టర్, బాలకృష్ణని చూసి కదానాయకుడిని అవ్వాలనుకున్నా. పాటలు నేర్చుకోవటం మొదలు పెట్టా. పాటకు తగ్గట్టు చేతులు ఊపటం వచ్చింది కానీ, పాడటం మాత్రం రాలేదు.

ప్రతి వారం ఎనిమిదింటికల్లా టివి ముందు వాలి పోయేవాడిని. ఒక్కో వారం ఒక్కో పాటతో దూసుకుపోయాడు. ప్రతి పాటకి తనని తానూ మెరుగు పరుచుకుంటూ ముందుకు పోయాడు. రక రకాల పాటలని తనదైన శైలిలో అధ్బుతంగా పాడాడు.

క్రమంలో ఎన్నో మధురమైన పాటలు పాడాడు. నవరసాల్ని పండించాడు. ముఖ్యంగా అలనాటి ఆణిముత్యం, ఘంటసాల గారి "రసిక రాజ తగు వారము కామా?" అనే పాట పాడుతున్నంత సేపు ఊపిరి బిగబట్టి విన్నాను. క్షణంలో అనుకున్నా నేనింక తన స్నేహితుడిని కాను, కేవలం అతని లక్షలాది అభిమానుల్లో ఒకడిని అని. రోజే నాకు అనిపించింది., ఏదో ఒక రోజు సంగీత సామ్రాజ్యంలో తను ఉన్నత స్థానానికి వెళతాడు అని. నా లాంటి లక్షలాది అభిమానులని సంపాదిస్తాడు అని.

అలా ఎన్నో కార్యక్రమాలలో విజేతగా నిలిచి, సినీ నేపధ్య గానాన్ని మొదలు పెట్టాడు. "అష్ట చెమ్మ" లాంటి చిత్రాలలో పాడి మంచి పేరు సంపాదించాడు. మణి శర్మ, కీరవాణి గారి లాంటి గొప్ప సంగీత దర్శకుల దగ్గర పని చేశాడు. అయినా, ఇంకా ఏదో సాదించాలన్న తపన, ఇంకా నేర్చుకోవాలి అన్న కసి, మిగితా గాయకుల నుంచి అతనిని వేరు చేసింది. క్రమంలోనే ఉత్తర భారతంలో అడుగు పెట్టి, "ఇండియన్ ఐడల్ - 5" కార్యక్రమానికి వెళ్లి, అక్కడ విజేతగా ఆవిర్భవించాడు. దక్షిణ భారత దేశం నుండి కార్యక్రమంలో గెలిచిన మొట్ట మొదటి గాయకుడు అయ్యాడు.

తెలుగు వాడి సత్తా ప్రపంచానికి మరోసారి చాటాడు అనటం మాత్రం అతిశయోక్తి కాదు. "క్వాజ మేరె క్వాజ " అనే పాటకు పాకిస్తాన్లో సైతం అభిమానులను సంపాదించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు, తను సాదించింది ఏంటో? తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మానం అందుకున్నాడు. కళాబంధు బిరుదాంకితుడయ్యాడు. ప్రపంచం నలుమూలల తన గానామృతాన్ని వినిపించాడు. "హాలివుడ్" కి సైతం తన స్వరాన్ని పరిచయం చేశాడు. "కామన్ వెల్త్ క్రీడల" ముగింపు వేడుకల్లో అందరినీ అలరించాడు.

మనిషి ఉన్నతమైన వాడు అని చెప్పాలంటే అతను సాదించిన దానికన్నా, అతని ప్రవర్తన చూచి చెప్పాలి. ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించినా., ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నా, మనిషి మాత్రం మారలేదు. అదే చిరున్నవ్వు, అదే ఆప్యాయత, అదే చికాకు (:P). మంచి గాయకుడిగానే కాదు అంతకు మించి మంచి స్నేహితుడిగా నేను తనని గుర్తిస్తా.

( అనంతరామ్, శ్రీరామ్)
ఇలానే తను ఇంకెన్నో సాదించాలని, తన గానామృతంతో అందరినీ అలరించాలని కోరుకుంటూ.., పనిలో పనిగా ఒక చిన్న కవితని మనోడికి అంకితం ఇస్తున్నాను, కంగారు పడకుండా కానివ్వండి.
------------------------------------------------------------------------------------------------------------
తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటిన మిత్రమా! శ్రీరామ చంద్రమా!

ప్రతి హృదయమనే "నోట్ బుక్"ని నీ పాటలనే అక్షరాలతో "బోణి" చేశావు. నీ "కత్తి"లాంటి గొంతు తో అందరిని "తీన్ మార్" ఆడిస్తున్నావు. "ఆపిల్" పండు లాంటి అమ్మాయిలంతా, నీ గానామృతంలో మునిగి "వస్తాడు నా రాజు" అని, "అష్టాచెమ్మ" ఆడుతూ నిరీక్షిస్తున్నారు. నువ్విప్పుడు కేవలం మా చందువి కాదు, "అందరి బంధువి". ఇలా నీ "ప్రయాణం" ఆసాంతం హాయిగా సాగాలని, నీ పాటల "జల్లు" "కోతిమూక" మీద ఎల్లప్పుడూ కురవాలని, "బద్రీనాధుని" ఆశీస్సులు నీకు సదా ఉండాలని, ఆకాంక్షిస్తూ.......
నీ మిత్రుడు ,
అద్దంకి అనంతరామయ్య
------------------------------------------------------------------------------------------------------------
(గమనిక : ఎరుపు రంగులలో ఉన్నవి శ్రీరామచంద్ర పాడిన పాటలు గల చిత్రాలు.)

Saturday, October 22, 2011

జీవిత సారం 3 (భగవద్గీత)

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమి చెప్పాడు నాయనా?? మేము అంత చదువులు చదువుకోలేదు స్వామి అంటారని నాకు తెలుసు. అందుకే ఆ నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పారో, ఒకసారి చూడండి.

అర్జునా! గతమంతా మంచే జరిగింది,
వర్తమానం కుడా మంచే జరుగుతున్నది,
భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది.
నువ్వేమి పోగొట్టుకున్నావని అంతలా ధుఃఖిస్తున్నావు?
నువ్వు పోగొట్టుకున్నదానిని నువ్వు సృష్టించలేదు!
నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే!

నువ్వు అనుభవించే భోగం నిన్న వేరొకరి సొత్తు!
నేడు నీదిగా అయ్యింది , రేపు మరొకరి సొంతం అవుతుంది!
మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం.



కానీ, ఈ రామానంద స్వామి ఏమి చెప్తున్నారంటే???

భక్తులారా నా శీర్షికలలో! గతమంతా మంచే చదివారు,
వర్తమానం కుడా మంచే చదువుతున్నారు,
భవిష్యత్తు కుడా మంచే చదువుతారు.

నువ్వేమి చదవలేదని అంతలా చింతిస్తున్నావు?
నువ్వు చదివింది నువ్వు రాయలేదు!
నువ్వు చదువుతున్నదంతా శ్రీ రామానందుల వారి ఆశ్వీర వచనాలే

నువ్వు చదువుతున్నది నిన్న వేరొకరు చదివారు!
నేడు నీవు చదువుతున్నావు! రేపు మరొకరు చదువుతారు!
మార్పు అనేది శీర్షికల సహజ ధర్మం.

Wednesday, October 12, 2011

పేరులో ఏముంది?

మీ అందరికీ నా పేరు అద్దంకి అనంతరామయ్యగా తెలుసు. అసలా పేరు నాకు ఎలా వచ్చిందో ముందుగా మీకు చెప్పాలి. మా తాతగారు (కంగారు పడకండి వంశ వృక్షం బయటకు తీయటంలేదు) అద్దంకి రామారావు గారు. మా తాతమ్మ పేరు శ్రీ అద్దంకి అనంతలక్ష్మమ్మ గారు. కాబట్టి మా తాతమ్మ పేరులోని "అనంత" అనే మొదటి సగం, మా తాతగారి పేరులోని మొదటి సగం "రామయ్య" అని కలిపారు. దానితోటి మొత్తం "అద్దంకి అనంతరామయ్య". ఇక్కడే అస్సలు కధ మొదలు అయ్యింది.

పేరులోని మొత్తం అక్షరాలు కలిపితే, శాస్త్రానికి కావాల్సిన అన్ని అంకెలు రాలేదట. అందుకని చివర "పవన్" అని చేర్చారు. అప్పటికీ చాలక పొతే చివరికి "కిరణ్" అని కూడా చేర్చారు. దానితో నా పేరు కొండ వీటి చాంతాడంత అయ్యింది. మొత్తానికి నా పేరు "అద్దంకి అనంతరామయ్య పవన్ కిరణ్" దగ్గర ఆగింది. బడిలో వేసిన తర్వాత పేరు అంతా చెప్పటం ఎందుకని అనంతరామయ్య అని చెప్పాను. ఆంగ్లంలో పేరుని ఎలా రాయాలో అర్ధం గాక నా తోకని(పేరులోని) కత్తిరించి "అనంతరాం" తో సరిపెట్టారు.

ఇక్కడితో పేరు సమస్య తీరలేదు. ఉద్యోగంలో చేరిన తర్వాత కార్యాలయంలో పైనోళ్ళందరూ (ఉత్తర భారత దేశానికీ చెందినా స్నేహితులు)  కలిసి "రామ్ అద్దంకి" గా మార్చేశారు. నా పేరు అనంతరాం అని చెప్పి చూశా, వాళ్ళకి నోరు తిరక్క అడ్డమైన పేర్లతో పిలవటం మొదలు పెట్టారు. వీటన్నిటికన్నా "రామ్ అద్దంకి" అన్న పేరే నయంఅనుకోని, విదంగా ముందుకు పోతున్నాను. జీవితం..., ముందుగా తోక "అయ్య" పోయింది. తరువాత తల "అనంత" పోయింది. ప్రస్తుతానికి "రామ్ అద్దంకి" మాత్రం మిగిల్చారు.

ఇక ముద్దు పేర్ల విషయానికి వస్తే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు మొదట పెట్టిన ముద్దు పేరు "జండు బామ్". చిన్నప్పుడు నా బుగ్గలు జండు బామ్ రాసి వాచినట్టు ఉంటాయని(ఇప్పుడు అలా లేవులేండి) మా హిందీ పంతులమ్మ పెట్టిన పేరు. తర్వాత తోటి స్నేహితులు పెట్టిన పేరు "పప్పు" అని. నేను మాంసం తినను(ఇప్పటికీ), కేవలం పప్పు తింటానని ఆ పేరు పెట్టారు. ఇంకా కొంత మంది "రాముడు" అని, మా రాధక్క"రామీ" అని, మీ లాంటి భక్తులంతా "రామానంద స్వామి" అని, హరీష్ లాంటి శిష్యులంతా "గురూజీ" అని, చూడబోతే చివరకి నాకు కూడా సహస్ర నామాలు అయ్యేట్టు ఉన్నాయి. కొంత మంది ఎదవల దయ వల్ల, మీకు చెప్పుకోలేని పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.


పేరులో ఏముంది అనుకున్నాను కాని, చూడండి నా ఒక్కడి పేరుకి ఎంత చరిత్ర ఉందో !!!

మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, నాకు తెలిసి, ముందు ఇంటి పేరు తరవాత మన పేరు ఉంటుంది. ఉదాహరణకు "టంగుటూరి ప్రకాశంగారు, అల్లూరి సీతారామరాజు గారు, పొట్టి శ్రీరాములుగారు, నందమూరి తారక రామారావు గారు, అద్దంకి అనంతరామయ్య గారు", ఇలా గొప్ప గొప్ప వారి పేర్లకు ముందు ఇంటి పేర్లు ఉంటాయి తప్ప, "రాజగోపాల్ లగడపాటి గారు, జనార్ధనరెడ్డి నాగం గారు, పెద్ద పిచ్చయ్య బచ్చు గారు" అంటామా?? అంతెందుకు "జీవితా రాజశేఖర్" అంటాము తప్ప "రాజశేఖర్ జీవిత" అనము కదా (:P). ఎక్కడ కూడా మన పేరులో తండ్రుల పేర్లు చేర్చము. కాని ఈ మధ్య ముఖం పుస్తకంలో, కొంత మందికి ఇంటి పేరు లేదా తండ్రుల పేర్లు, అమ్మాయిలు కొంత మంది, తమ భర్తల పేరు, తమ పేరు చివరన చేర్చుకోవటం వెర్రి అయిపొయింది. తల్లి తండ్రుల మీద, తమ తమ భర్తల మీద  ప్రేమతో పెట్టుకోవచ్చు అని అనకండి. పేర్లలో చెర్చుకుంటేనే ప్రేమ ఉనట్టా? అది మన సాంప్రదాయం కాదు. దయ చేసి ఇక నయినా మీ పేర్లకు ముందు ఇంటి పేర్లు చేర్చమని మనవి. కాదు కూడదు అంటారా? మీకు ఓదార్పు యాత్ర చేయటం మాత్రం ఖాయం!!