లవ్వు , నవ్వు లేని మనిషి ఉంటాడేమో కానీ, కొవ్వు లేని మనిషి ఉండడు. అస్సలు ఏమీ చేయకుండానే వచ్చేది ఈ కొవ్వు. ఈ కొవ్వును, దాని ద్వారా వచ్చే బరువును ఎలా తగ్గించుకోవాలో అని, తెగ ఇబ్బంది పడిపోతుంటాం. Gym కి వెళ్ళటం, ఉపవాసాలు ఉండి కడుపు మాడ్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం. డబ్బులు కట్టి జిమ్ వెళ్ళటమే ఒక ఎత్తు ఐతే, ఈ మధ్య అంత కన్నా వింత ఒకటి చూశా. ముందు మనం $500 కట్టి చేరాలి. మండలం రోజుల్లో, వాళ్ళు చెప్పినంత బరువు తగ్గితే, మన డబ్బులు మనకు వెనక్కి ఇచ్చేస్తారుట! మన మీద ఎంత నమ్మకం ఉంటే అలాంటివి పుట్టుకు వస్తాయి. ప్రతి సంవత్సరం, జనవరి ఒకటిన New year జరుపుకున్నా, జరుపుకోకపోయినా, resolution అన్న పేరుతో అందరం Gymల వైపు పరుగులు పెడతాం. కొవ్వు మానదు కానీ, మనం మానేస్తాము, అది వేరే విషయం. అలాంటి కొవ్వుని తలుచుకుంటూ, ఈ పాట పాడుకుంటూ ఇలా కానిచ్చేద్దాం.
ఎంత కొవ్వు ఎక్కి కొట్టుకోక పొతే మాత్రం, నేను ఇంత మంచి పాటను ఖూనీ చేస్తాను చెప్పండి.
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ (2)
నాలోనే కొవ్వు, నాతోనే కొవ్వు, నా చుట్టూ కొవ్వు, నేనంతా కొవ్వు
నా నడుము పైన కొవ్వు ,నా మెడవంపున కొవ్వు, నా గుండె మీద కొవ్వు, ఒళ్ళంతా కొవ్వు
చేతుల్లో కొవ్వూ... చెంపల్లో కొవ్వు... చంపేసే కొవ్వూ
నిద్దర్లో కొవ్వూ... పొద్దుల్లో కొవ్వు... ప్రతి నిమిషం కొవ్వూ
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ
చేతుల్లో కొవ్వూ... చెంపల్లో కొవ్వు... చంపేసే కొవ్వూ
నిద్దర్లో కొవ్వూ... పొద్దుల్లో కొవ్వు... ప్రతి నిమిషం కొవ్వూ
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ
చరణం : 1
నా మనసును వేధించే బద్దకమే కొవ్వు, నా వయసును మార్చేసే మాయే ఈ కొవ్వు
పైకే బరువనిపించే ఆకారం కొవ్వు, బైట పడాలనిపించే పిచ్చిదనం కొవ్వు
నా ప్రతి యుద్దం నువ్వు నా పస్తే నువ్వు, నా ఉప వాసం నువ్వూ ... కొవ్వూ
మెత్తని జామే తెచ్చే తొలి జిగురే కొవ్వు, నచ్చే కష్టం నువ్వు ... నువ్వు ... కొవ్వూ
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ
చరణం : 2
నా సిగ్గును రెట్టించే కౌగిలివే కొవ్వు, నా వన్నీ దోచుకునే ఆకలివే కొవ్వు
ముని పంటితొ నే తింటే మిగిలేదీ కొవ్వు, నా నడకను మార్చేసే మొదరష్టానివి కొవ్వు
తీరని దాహం నువ్వూ నా మోహం నువ్వూ, తప్పని స్నేహం నువ్వూ ... కొవ్వూ
తీయని లడ్డే చేసే అన్యాయం కొవ్వూ, చాలా సులభం నువ్వు ... కొవ్వూ ...
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ
చరణం : 3
ఏమార్చేస్తు కొవ్వు మురిపిస్తుంటే కొవ్వు, నే కొరుకోని నా మరోఖర్మ కొవ్వు
భయపెట్టిస్తూ కొవ్వు కవ్విస్తుంటే కొవ్వు, నాకే తెలియని నా ముద్దు పేరు కొవ్వు
నా కోపం నువ్వు ఆక్రోశం నువ్వు, నేనంతే కొవ్వూ ...
నా పంతం కొవ్వు నా సొంతం కొవ్వు,నా అంతం కొవ్వూ ...
నువ్వు... నువ్వు... కొవ్వే... నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ (2)