"పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావ్?","భోజానానికి కష్టం అయిపోతుంది సార్", "కుక్ ని పెట్టుకో", "ఇల్లు చూసుకోవటానికి ఎవరూ లేరు సార్", "కుక్కని పెంచుకో", " ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్", "మిమల్ని ఎవరూ బాగు చేయలేరయ్యా. పోండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమంటాడు, నువ్వు పెళ్లంటావు, ఇంకొకడు శోభనం అంటాడు". "శోభనానికి ఎవ్వరినీ పిలవటంలేదు సార్"...... ఈ పాటికి మీకు అర్ధం అయ్యుంటుంది. ఇది మన్మధుడు చిత్రంలోని మాటలని. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన హాస్యపు జల్లు. ఆ చిత్రాన్నిఎన్ని మార్లు చూసినా, నవ్వు ఆపుకోలేము.
ఆ చిత్రం విడుదల అయ్యేనాటికి నేను పదో తరగతి చదువుతున్నాను. అందులో "వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా" అనే పాటని, ఆ పసి వయసులోనే మార్చి రాసి పాడుకున్నాను. కాలగర్భంలో కలిసి పోయిన పాట, మొన్న జ్ఞాపకం వచ్చింది. ఎందుకు జ్ఞాపకం వచ్చిందో చెప్పి తీరాలి.
మొన్న ఒక చిన్న సభకు హాజరు అయ్యాను. ఆ సభకు ఒక స్నేహితుడు (నా కన్నా చాలా పెద్దవాడు) తన పదేళ్ళ కొడుకుని వెంట తీసుకు వచ్చాడు. ఆ బుడతడు, అంత చిన్న వయస్సులోనే, ఆవర్తన పట్టికలోని (నాకు తెలుసు అర్ధం కాదని, ఆవర్తన పట్టిక అంటే periodic table) అన్ని మూలకాలను (elements) ఠక్కున చెప్పేస్తున్నాడు. అబ్బో ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాదానం చెప్పాడు.
"మా అబ్బాయి ఇంకా ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది?" అని వాళ్ళ నాన్న అడిగాడు. ఏ తరగతిలో పుస్తకాలు ఆ తరగతిలో చదవితేనే రావికాము లాంటి మేధావులు అవుతారు. పై తరగతి పుస్తకాలు కూడా ముందే చదివితే..... త్రివిక్రమ్ బాషలో నాకేమి అనిపించిందంటే, "పదేళ్ళకే అన్నీ చదివేస్తే, పాతికేళ్ళకు పిచ్చోడైనా అవుతాడు, లేదంటే పరమహంస అయినా అవుతాడు". వీళ్ళ గురించి ఇంకో రోజు ఖండిస్తాను. ఆ లోపు ఈ పాట పాడుకోండి....
పల్లవి||
ఆ.....ఆ........ శభాష్....
సగమప.. నిప.. మగప రి సనిప మపనిస.....
వద్దురా సోదరా చదువంటే నూరేళ్ళ మంటరా, ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి చదువుకోవద్దురా రా రేయ్
వద్దురా.... వద్దు....
వద్దురా సోదరా చదువంటే నూరేళ్ళ మంటరా, ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి చదువుకోవద్దురా
చెడిపోవద్దు విద్యార్ది, చదువుకోవద్దు ఖర్మకాలి, పట్టుకుంటే కలం పాళీ, జీవితాంతం సుఖం కాళీ
సంస్కారమే వేస్టురా, జన్మంతా విడుదల లేదురా, నీ బుర్ర భోంచేస్తుందిరా, చచ్చినా చదువు కొనవద్దురా
Don't study, Be happy, Don't study, Be happy Don't study, Be happy happy
||వద్దురా||
చరణం||
హరీష్ అని నా స్నేహితుడు,
నాన్న మాట విని ఐ.ఐ.టిలో చేరాడు,
హై స్కూలు లో వాడు గ్రీకు వీరుడు
కాలేజికి రాక ముందు రాకుమారుడు
ఇంతా జరిగి జస్ట్ వన్ ఇయర్ కాలేదు,
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు
కళ్ళ జోడు వచ్చి, కాళ్ళు బక్కచిక్కి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను ఐ.ఐ.టి చదవటం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క గ్లాసు పాలు తాగి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు
పొద్దునే లేస్తూనే, మేధామాటిక్స్ చదవాలి,
మరి ఏపూటకాపూటే హోంవర్క్ చేయాలి,
ఏం చెప్పినా తక్షణం, పిడెయ్యాలి రా మొత్తం,
కత్తి సామైందిరా చదవటం, చదువు అంటేనే పెద్ద నరకం

అంతెందుకు మా మల్లిగాడు,
మా ఊరికి వాడే మహేష్ బాబు,
మామూలుగానే వాడు దేశముదురు
ఇంజినీరింగ్ తోటే పోయింది వాడి పొగరు
హెచ్.ఓ.డి అమ్మోరు, పడలేక ఆమె పోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా లాబు వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
చదువు కాదురా అది చట్టుబండ
ఆ గయ్యాళి దయ వల్ల
ప్రతి రోజూ క్లాసు మాయం
పేకాట దయ వల్ల కనిపించింది గాలి మార్గం
బడికెళ్ళటం వేస్టనీ ఇక వ్యాపారమే బెస్టనీ
క్లాత్ షాపే పెట్టాడు రా!! పెట్టి కోటీశ్వరుడయ్యాడు రా!!!!